Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ ఆ ర్థికాభివృద్ధికి రహదారులు పునాద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రోడ్లు కే వలం ప్రయాణానికి మాత్రమే కా కుండా పెట్టుబడు లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను తీసుకు వచ్చే ప్రధాన మౌలిక సదుపాయమ ని తెలిపారు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల ప్రమాదాలు జరిగి 1.6 లక్షల మంది మృతిచెందగా, తెలంగాణలో 2 2,4 41 ప్రమాదాల్లో 6,221 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వి వరించారు. రోజుకు సగటున 18 నుంచి 20 మంది మరణిం చడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రాణం అ మూల్య మని, సురక్షిత రోడ్ల నిర్మా ణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చే శారు. రాష్ట్రంలో మొత్తం 34,062 కిలోమీటర్ల రోడ్డు నె ట్‌వర్క్ ఉందని, ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.7, 590 కోట్ల తో1,835 కిలోమీటర్ల రో డ్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. 76 భారీ వంతెనల నిర్మాణం కోన సాగుతోందని, మరో రూ.1 3,0 51 కోట్ల విలువైన పనులు పురోగతి లో ఉన్నాయని అ సెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
గత 27 నెల ల్లో 595 కిలోమీటర్ల రోడ్లు, 51 వంతెనలు పూ ర్తి కాగా, మరో 323 కిలోమీటర్ల రోడ్లు,16 వంతెనలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. హ్యామ్ విధానంలో 12 వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపా రు. మొదటి దశలో 6,092 కిలోమీటర్ల రోడ్లను రూ.13,006 కోట్లతో 30 నె లల్లో నిర్మించి, 15 సంవత్సరాలు నిర్వహించే ప్రణాళిక ఉందన్నారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్, హై దరాబాద్ విజయవాడ రహదా రి విస్తరణ, అమరావతి బందరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రె స్వే వంటి ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థి కాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారతాయని పేర్కొన్నారు. బుల్లె ట్ ట్రైన్ కారిడార్ కోసం శం షాబాద్ సమీపంలో 500 ఎక రాలు కేటాయించే యోచన ఉందన్నారు. ఉస్మానియా ఆ సుపత్రి కొత్త భవ నం, హైకోర్టు భవన నిర్మాణం, రూ. 8,000 కోట్లతో నాలుగు ఆధునిక ఆసుపత్రులపనులు వేగంగా కొన సాగుతున్నాయని తెలిపారు. ప్రజ లకు మెరుగైన వసతులు అందిం చడమే లక్ష్యమని స్పష్టంచేశారు.
ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు రహదారి భద్రత చర్యలను కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలె క్టర్ బి. చంద్ర శేఖర్ కోరారు. సోమ వారం కలెక్టర్ కార్యాలయంలోని స మావేశం మందిరంలో జిల్లా ఎస్ పి శరత్ చంద్రపవార్ తో కలిసి ఆయ న జిల్లా స్థాయి రహదారి భద్రత స మావేశాన్ని నిర్వహించారు.
ముందుగా జిల్లాలో ఉన్న ఆయా రహదారులు, వాటిపై ఉ న్న బ్లాక్స్ స్పాట్స్, ఇప్పటివరకు సంభవించిన రోడ్డు ప్రమా దాలు, సంభవించిన మరణాలు, తీసుకున్న చర్యలు, తది తర అంశాలను పోలీసు శాఖ ద్వారా పవర్ పాయింట్ ప్ర జెంటేష న్ ద్వారా తెలుసుకున్న జిల్లా కలె క్టర్ అనంతరం మాట్లాడుతూ రహ దారి భద్రతపై సమాజంలోని అన్ని వ ర్గాల వారికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “సురక్షితం గా చేరుకోండి “కార్యక్రమంపై ఏప్రిల్ 2న ని ర్వహించనున్న ప్రజా పాల న- ప్రగతి ప్రణాళిక గ్రామ, మున్సి పల్ వార్డు సభల ద్వారా పెద్ద ఎత్తు న ప్రజలకు అవగాహన కల్పించాల ని చెప్పారు. అంతేకాక లైసెన్స్ రిజి స్ట్రేషన్, లైసెన్సు సేవా పోర్టల్ పై కూడా ప్రజలకు అవగాహన క ల్పిం చాలని రవాణా శాఖ అధికారుల ను ఆదేశించారు.
నల్గొండ జిల్లాలోజాతీయ రహదారి నిడివి ఎక్కువగా ఉ న్నందున హై దరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ట్రా మా కేర్ సెంటర్ ఏర్పాటుకు చ ర్యలు తీసుకోవడం జ రుగు తుందని ఆయన వెల్లడించారు. హైవే పె ట్రోలింగ్, హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే 20 నిమిషాలలోపు పోలీసుల తో పాటు, సంబంధిత శా ఖల అధికారులు చేరుకునే విధం గా చర్యలు తీసుకోవాలని, పోలీసులు గుర్తించిన రహదారు ల బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సంభవించ కుండా గట్టి చ ర్యలు చే పట్టాలని, ఏప్రిల్ మొదటి వారంలోగా గుర్తించిన రహదారులపై బ్లాక్ స్పాట్ల వ ద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్ అండ్ బి నేషనల్ హైవే ఇతర రహ దారి అథారిటీలు చర్యలు చేపట్టా లని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మా ట్లాడుతూ పోలీసు యం త్రాంగంతో పాటు, జిల్లా అధికార యంత్రం తీసుకున్న చర్య ల వల్ల గడచిన 18 నెలల్లో ఆయా రహదారులపై బ్లాక్ స్పా ట్ల సంఖ్య ను 58 నుండి 38 తగ్గించామని, అలాగే మరణా ల సంఖ్య ఏడుశాతానికి తగ్గించగలి గామని తెలిపారు. ఇటీ వల కాలంలో చాలామంది మైనర్ యువకులు ద్విచక్ర వా హనాలు నడుపుతు న్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీ నివ ల్ల ప్రమాదాలు సంభవించేం దుకు అవకాశం ఉందని, అం దువల్ల తల్లిదండ్రులు- టీచర్ల సమావేశంలో పాఠశాల విద్యా ర్థులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ ద్వారా అవగాహన కా ర్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ముకుందాపురం, మాడుగులపల్లి, నల్గొండ టౌన్, హాలియా, నకరేకల్, కొండభీమనపల్లి, దేవరకొండ, చిం తపల్లి నుండి మాల్ తదితర ర హ దారులపై సంభవిస్తున్న రోడ్డు ప్ర మా దాల నివారణకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆ యన జి ల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ర హదారి ప్రమాదాల నివారణకు కృషిచేసిన అధికారు లు ఇతర అధికారులకు జిల్లా కలె క్టర్ ఎస్పీలు అభినందన ప త్రాలను అందజేశారు.ఈ సమావేశంలో పో లీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, పం చాయతీ రాజ్ ,జాతీయ రహదారు లు, మున్సిపల్ కమిషనర్లు, ట్రా న్స్పోర్ట్ తదితర శాఖల అధికా రు లు హాజరయ్యారు.



