Tuesday, September 29, 2026
More
    HomeOpinionMinister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, చదువుతోనేకుటుంబాలు చక్కబడుతాయి

    Minister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, చదువుతోనేకుటుంబాలు చక్కబడుతాయి

    📰 Generate e-Paper Clip

     

    Minister komatireddy venkatreddy :ప్రజా దీవెన, కన గల్: సమాజంలో పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒ క్క కుటుంబంలోని పిల్లలం దరూ ఉన్నత చదువులను అ భ్యసించినప్పుడే ఆ కుటుంబాలు అన్నివిధాల చెక్కబడతా యని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బా ధ్యతా యుతంగా ఉన్నత చదువులు చదివించాలని అప్పీల్ చేశా రు. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రా ష్ట్రం లోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని ఆయన పునరుద్ఘాటించారు.గురువారం ఆయన నల్గొండ జిల్లా కన గల్ మండల కేంద్రం లో 6 కోట్ల రూపాయల వ్యయంతో ని ర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశా ల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతేకాక కళ్యాణ లక్ష్మి చె క్కులను పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మా ట్లాడుతూ చదువు ద్వారానే కుటుంబాలు బా గుపడతా యని ,అభివృద్ధి సాధ్య మని, అందువల్ల ప్రతి ఒక్కరు త ప్ప కుండా పిల్లలను చదివించాలని కోరారు. తమ ప్రభుత్వం వి ద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగా ప్రతి నియోజక వర్గంలో 200 కోట్ల రూపాయలతో అన్ని ఆ ధునిక సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గా లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లను నిర్మి స్తున్నదని చెప్పారు. కనగల్ లో నిర్మిస్తున్న ప్రభు త్వ జూనియర్ కళా శాల చుట్టుపక్కల గ్రామాల విద్యా ర్థు లకు ఎంతో ఉపయోగకరమని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా ర్థుల మాదిరిగానే ఇంటర్ విద్యార్థు లకు కూడా వచ్చే విద్యా సంవత్స రం నుండి ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్న భోజనం అందించనుందని, అందువల్ల త ప్పని సరిగా పిల్లలను కళాశాలకు పంపించాలని ఆయన కోరారు.

    నల్గొండ జిల్లా కేంద్రంలో 150 కోట్ల తో ప్రభుత్వ వైద్య కళాశా లను నిర్మించామని, అలాగే నర్సింగ్ కళా శాల నిర్మాణం డి సెంబర్ లోపు పూ ర్తి చేస్తామని, చదువుకున్న నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పించ డంలో భాగంగా 20 కోట్ల రూపా యలతో న్యాక్ బిల్డింగ్ నిర్మించి మొద టి అంతస్తు పూర్తి చే శామని, అక్క డ మహిళలకు కూడా శిక్షణ ఇస్తు న్నామని, సెట్విన్ ద్వారా 2500 మంది మహిళలకు వివిధ రకాల శి క్షణ కార్యక్రమాలు ఇస్తున్నామని, అంతేకాక 80 కోట్ల రూపా యల వ్యయంతో ఏటీసీ కేంద్రాన్ని నిర్మించ డం జరిగిందని, వీటన్నిటి ద్వారా చదువుకున్న యువత స్వయం ఉపాధి పొందవచ్చని మంత్రి తెలిపారు.

    తమ సొంత నిధులతో ప్రతీక్ ఫౌం డేషన్ ద్వారా నల్గొండలో జూనియ ర్ కళాశాల కట్టించడం జరిగిందని, అంతేకాక బొ ట్టు గూడా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో నిర్మిం చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రా ష్ట్ర ప్రభుత్వం రుణాల మంజూరుతో పాటు, నల్గొండ ఎస్ఎ ల్బీసీ సమీపంలో 5 కో ట్ల రూపాయల వ్యయంతో పెట్రోల్ పంపు నిర్మిస్తున్నదని, అక్కడే సూపర్ మార్కెట్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక అన్ని నియోజక వర్గాలలో ఇలాంటి పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయ ను న్నట్లు వెల్లడించారు. మహిళలు స్వయం సహాయక సంఘా లలో సభ్యులుగా చేరాలని కోరారు. మహి ళలు సోలార్ ప్యానల్ ఏర్పాటు చే సుకోవడం ద్వారా ఆదాయం పొం ద వచ్చని తెలిపారు.

    రహదారుల అభివృద్ధిలో భాగంగా నల్గొండ నుండి దర్వేశి పురం వరకు 50 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మా ణం మంజూరు చేయడం జరిగిందని, ధర్వేశిపురం నుండి గు ర్రంపోడు మీదుగా 180 కోట్ల రూ పాయలతో చేపట్టే రో డ్డుకు టెండ ర్లు పూర్తయ్యాయని, వారం రోజుల్లో పనులు మొదలు పెడతామ న్నారు. కనగల్ చివరస్తా నుండి అసం పూర్తిగా ఉన్న రహదారిని స రి చేసేందుకు 8 కోట్ల రూపాయ లను మంజూరు చేసామని, శుక్రవారం నుండి పనులు ప్రా రంభమవుతున్నాయని, అలాగే రేగట్ట వరకు 60 కోట్లతో డ బుల్ రోడ్డు నిర్మాణం, పగిడిమర్రి మీదుగా మరో రోడ్డు ము శ్రంపల్లి వరకు 100 కోట్ల రూపాయలతో రోడ్డును మంజూరు చేసినట్లు వెల్లడించారు.

    తమ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత పేదలందరి కీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, మూడు కోట్ల 15 లక్ష ల మందికి సంవ త్సరానికి సన్నబియ్యం అందిస్తున్నామని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తు న్నామని చెప్పారు. కనగల్ మం డల అభివృద్ధికి తన వం తు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, 8 కోట్ల రూపాయలతో పును గోడు లిఫ్ట్ ఇరిగేషన్, కాంచనపల్లి, రేగట్ట లిఫ్ట్ ఇరిగేష న్లు చేపట్టడం జరిగిందని మొత్తం 50 కోట్ల రూపాయలతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ,కనగల్ నల్గొండ మధ్య పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకా శాలు కల్పిస్తామని, కోటి 20 లక్షల రూపాయలతో కనగల్ మండల కేంద్రంలో గోడౌన్ ఏ ర్పాటు చేస్తున్నామని, మరో 16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నామని, ఏప్రి ల్ మొదటి వారంలో కనగల్ లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతిని ధులతో సమా వేశాన్ని నిర్వహించి కనగల్ అభివృద్ధికి అవసరమైన చర్యల పై సమీక్షిస్తామని మంత్రి తెలిపారు.

    అంతకుముందు మంత్రి ధర్వేశిపురంలో రేణుక ఎల్లమ్మ త ల్లి దర్శనం చేసుకోవడమే కాక ప్రత్యేక పూజలు నిర్వహిం చారు . ఈ సందర్భంగా ధర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచన లు చేశారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మా ట్లాడుతూ మం డల కేంద్రంలో 6 కోట్ల రూపాయలతో జూని యర్ కళాశాల నిర్మించ డం సంతోషకరమని,తమ ప్రభు త్వం వచ్చాక రేషన్ కార్డులతో పా టు, సన్న బియ్యంతో పా టు, ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ కనగల్ ప్రభుత్వ జూ నియర్ కళాశాల చుట్టుప క్కల ప్రాంతాల గ్రామీణ వి ద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతం 62 మంది ఉన్న ఈ జూనియర్ కళాశాల స్ట్రెంత్ కళాశా ల భ వన నిర్మాణం తర్వాత తప్ప నిసరిగా పెరుగుతుందన్నారు. మం డలంలో ట్రాక్టర్లు, ఆర్ సిసి భవనాలు ఉండి ఇందిర మ్మ ఇండ్ల కు దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ను రాష్ట్ర గృహనిర్మాణశాఖ ఎమ్ డి కి సమర్పించడం జరిగిందని, అ క్కడి నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుం టామన్నారు.

    వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల కు బ్రేక్ ఫాస్ట్ తో పాటు, లంచ్ కూడా ఇవ్వ నున్నట్లు ఆయన తెలిపారు. మే చి వరి నాటికి నల్గొండ జిల్లా కేం ద్రం లోని ఎస్ఎల్ బిసీ కాలనీ వద్ద చే పట్టిన మహిళ పెట్రోల్ పంపు ని ర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీనివ ల్ల ఎస్ హెచ్ జి మహిళల కు ఉపాధి దొరుకుతుందన్నారు. జిల్లాలో రెండు కోట్ల 91 లక్షల రూపాయల తో పాఠశాల పనులు చేపట్టేందుకు అ మ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు మంజూరు చేయడం జరి గిందని, ఇవన్నీ చురుకుగా కొనసాగుతున్నాయన్నారు.

    కనగల్ మండల కేంద్రంలో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు పైలెట్ ప్రా జెక్టుగా తీసుకోవడం జరిగిందని, మొత్తం 260 ఇళ్లలో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసేందుకు నిర్దేశించగా, ఇప్పటివర కు 120 ఏ ర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించా రు. నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూ కురి రమే ష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశా ఖ అధికా రి దశ్రునాయక్, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు మాట్లాడా రు.స్థానిక సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.