:Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వై ద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి ని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపా రు. ప్రజా పాల న- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11వరకు నిర్వహి స్తున్న ఆరోగ్య వారోత్సవాల సం దర్బంగా బుధవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చె ల్కలో కోటి 91 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన పట్ట ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్ర ధాన ఆ స్పత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడా న్ని దృష్టిలో ఉం చుకొని మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం ద్వారా మె రుగైన వైద్యం అందించేందుకు ప్ర భుత్వ నిధులతో పాటు, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపా యల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయా లు, డాక్టర్లను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. మాన్యంచెల్క యుపిహెచ్ సికి నూతన భవనాన్ని నిర్మించడమే కాకుండా, అవసరమైన మెడికల్ సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగిం దని, ఇంకాఅవసరమైతే ఎక్కువ ఎక్విప్మెంట్ సమకూరుస్తా మన్నారు.
చుట్టుపక్కల ప్రజలు,పెద్దవారు గ ర్భిణీ స్త్రీలకు, మాన్యంచె ల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనువుగా ఉంటుందని ఇక్కడే అన్ని రకా ల వైద్య సేవలు అందించేందుకు ఏ ర్పా టు చేస్తామని, పరీక్షలతో పా టు, అవసరమైతే ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రికి రిఫర్ చేసే విధంగా వైద్య సేవలు అందించా లని డాక్టర్లకు సూచించారు. కార్పొరేటర్లు వివిధ రకాల జ బ్బులతో బాధపడే ప్రజలను గుర్తించి పట్టణ ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి పంపించాలని చెప్పా రు.నల్గొండ కార్పొరేషన్ అయినం దున సిసి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మంచి వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో మూ డెకరాల స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చే స్తున్నట్లు తెలిపారు.అనుకోకుండా పట్టణ పిహెచ్ సిలో మం దులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రయివేట్ మెడికల్ షాపును గుర్తించి అవసరమైన అత్యవ సర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వ డం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసు కోవాలని మంత్రి కోరారు.
అవసరమైతే మాన్యం చెల్కపట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో అక్షయ ఫౌండేషన్ సహకారంతో ఆసుపత్రికి వచ్చిన రో గులకు ఆహారం ఇ చ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, ఆశ వర్కర్లు బాగా పనిచేయాలని, పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. మాన్యం చెల్క చౌరస్తా సుందరీకర ణతో పాటు, విస్తరించి తీర్చిదిద్ద డం జరుగుతున్నదని తెలిపారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాన్యం చెల్కతో పాటు, చుట్టుపక్కల వార్డుల ప్రజలకు ప ట్టణ ప్రాథమిక వై ద్య ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రతీ క్ ఫౌండేషన్ ద్వారా సొంతం గా 50 లక్షల రూపాయలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి ఇవ్వడం పట్ల ఆమె మంత్రిని అభినందించారు.అన్ని సౌ కర్యాలతో ఏర్పాటు చే సిన మాన్యం చెల్కపట్టణ ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో కొన్ని రకాల ప రీక్షలను సైతం ఇక్కడే చే సుకోవచ్చని, డాక్టర్లు పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాల ని కోరారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మా ట్లాడుతూ విద్యతోపాటు, పేదప్రజలకు వైద్యంఅందించేం దు కు మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు నాణ్య మైన వైద్యం అం దించేందుకు ఎంతగానో ఉపయోగ పడు తుందని, ఆస్పత్రికి అవసర మైతే అదనపు సౌకర్యాలు, మె డికల్ ఎక్విప్మెంట్ కు సహకారం అం దించాలని మంత్రికి వి జ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వై ద్యాన్ని ఈ ఆస్పత్రి ద్వారా పొం ద వచ్చని, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బం ది ఆవిధంగా పని చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా ఈనెల 6 నుండి 11 వరకు నిర్వ హిస్తున్న ఆరోగ్య ఉ త్సవాల్లో మాన్యంచెల్క పట్టణ ప్రా థ మిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిం చడం జరిగిందని, ఇక్కడ వివిధ ర కాల టెస్టులలను చేయడం జరుగుతుందని, ప్రభు త్వం ఉచితంగా అం దిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ను అం ద రు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లా డారు.
డిప్యూటీ మే యర్ అమీర్ అలీ,ప్రధాన ఆస్పత్రి సూప రిం టిండెం ట్ నరసింహారావు నేత, డిప్యూటీ డిఎంహెచ్ ఓ వే ణు గోపాల్ రెడ్డి, జిల్లా టీబి నియంత్రణ అధికారి డాక్టర్ క ళ్యాణ్ చక్రవర్తి, యుపిహెచ్ సి డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్ర తినిధులు, అధికారులు ఉన్నారు.



