Tuesday, September 29, 2026
More
    HomeOpinionMinister N Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన,ఏప్రిల్...

    Minister N Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన,ఏప్రిల్ మాసాoతానికి హు జూర్ నగర్ మోడల్ కాలనీ ప్రారం భo 

    📰 Generate e-Paper Clip

     

    Minister N Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హు జూర్ నగర్: హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామ స్వామి గుట్ట సమీపంలో 11 6 ఎకరాల విస్తీర్ణంలో 2,160 సింగి ల్ బెడ్ రూమ్ లతో నిర్మించిన మో డల్ కాలనీ తెలం గాణా రాష్ట్రానికే తలమానికం కానుందని రాష్ట్ర నీటిపారు దల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమా ర్ రెడ్డి పేర్కొన్నారు.2011లోఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రారం భించిన మో డల్ కాలనీ కోసం దేవాదాయ ధర్మాదాయ శా ఖా నుండి అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం ధర చెల్లించి భూ మి కొనుగోలు చేసిన విషయా న్ని ఆయన గుర్తు చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మోడల్ కాలనీని సంద ర్శించి పనుల పు రోగతిని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ తేజ స్ నందాలాల్ పవార్, ఎ స్.పి నరసింహ స్థానిక ఆ ర్.డి.ఓ లతో పాటు గృహానిర్మాణా శాఖాధి కారులు ఈ కార్యక్రమం లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పా టు చేసిన విలేకరుల స మావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తె లంగాణా రాష్ట్ర ఆవిర్భా వం,తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం మోడల్ కాలనీ ప నులను ఉద్దేశ్య పూర్వకంగా ఆట కెక్కించడంతోటే ఇంతటి జాప్యం క లిగిందన్నారు.అప్పటికే 90 శాతం మేర పనులు పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంద న్న కోణంలో నాటి పాలకులు నిర్లక్ష్యం చే శారన్నారు. అయి తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రావడంతో పనులు వేగవంతం చేశామన్నారు.

    మారుతున్న పరిస్థితిలకనుగుణంగా మోడల్ కాలనీని తీర్చి దిద్దుతు న్నా మని అందులో భాగంగానే భూమి కొనుగోలు కు చేసిన వ్య యం మినహాయించి మొత్తంగా ఒక్క నిర్మా ణానికే 125 కోట్లు వెచ్చిం చడంతో పాటు మరో 20 కోట్లు తా జాగా మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించా రు.పదికోట్లతో మోడల్ కాలనీలో తెలంగాణా ప బ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు మరో పది కోట్లతో ఇదే కాల నీ లో అంగడివాడి కేంద్రం, కమ్యూ నిటీ హల్,క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్,ఓపెన్ జిమ్ ఏర్పట్లతో పాటు సి.సి రోడ్ల నిర్మా ణం, డ్రైనేజీలని ర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటిం చారు.

    ఏప్రిల్ మాసంతానికి మోడల్ కాల నీ ప్రారంభోత్సవం ఉం టుందని ఆ యన సూచనా ప్రాయంగా వెల్లడించారు. ప్రారం బొత్సావానికి ముందే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అం దులో మొదటి విడతలో అధి కారులు 1500 మంది లబ్ధిదా రులను ఎంపిక చేస్తారని ఆయన ప్రక టించారు. అయితే అ దే సమయంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతం గా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుందని బహి రంగం గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

    హుజుర్ నగర్ కే ఐకాన్ గా నిల బడనున్న ఈ మోడల్ కాల నీ లబ్ధిదారుల ఎంపికలో అపోహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ని ష్పక్షపాతంగా ఎంపిక ఉంటుందని ఆయన స్ప ష్టం చేశారు.అదే సమ యంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సిఫార్సు లు కుడా అర్హులైన వారే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనర్హు ల ను సిఫార్సు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల జాబి తాను ఒకటికి రెండు సార్లు నిశితం గా పరిశీలించాలని జా బితాలో ఒ క్క అనర్హుడి పేరు ఉన్నా మోడల్ కాలనీ నిర్మా ణ సంకల్పం దెబ్బ తిం టుందని ఆయన అధికారులకు నిర్ది ష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    నిజ నిజాలు తెలుసు కోకుండా ప్రజల్లో గందరగోళం సృష్టిం చి అపో హలు రేకిత్తీస్తే కఠిన చర్యలు తీసు కోవాలని ఆయ న అధికారులకు సూచించారు.అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదా రుల జాబితా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉం టుందని ఇందులో ఎటువంటి అపోహ లకు ఆస్కారం ఉం డదని ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే అధికారులకు ఫి ర్యాదు చేయవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టికరిం చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.