Minister komatireddy venkatreddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సి పల్ కార్పొరేషన్ యావత్తు కోడి కూతతో పాటు మంత్రి కోమటి రెడ్డి ఆకస్మిక క్షేత్రస్థాయి విస్తృత పర్యటనతో మేల్కొంది. సో మవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రమాణ స్వీకా రం కార్యక్రమoలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలోనే బసచేసి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక పర్యటన బయలుదేరి వెళ్ళారు. నల్లగొండకు వ్యా పార గుండెకాయగా నిలుస్తూవస్తోన్న ప్రకాశం బజార్ లో క్షేత్ర స్థాయిలో పారి శుధ్య కార్మికులతో మమేకమై ముందు కు సాగుతున్న క్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఆయనను అనుసరించారు.
దీంతో నల్లగొండ మంది మార్బలం అంతా అలెర్ట్ కావడంతో తెల్లవారు జాము నే నల్లగొండ మున్సిపల్ కార్పొరేష న్ క్షేత్ర స్థాయి అభివృద్ధిపై కార్యా చరణ ప్రారంభమైంది.మంత్రి ప ర్యటనలో ప్రధానంగా ప్రకాశం బజార్ లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గంగా డివైడర్ల తొల గింపుతో పాటు ప్రకాశం బజార్ లో ని పూలు, పండ్ల దుకాణాలను పా త కలెక్టరేట్ ఆఫీస్ స్థలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులకు తక్ష ణ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రంలోగా పా త కలెక్టరేట్ కార్యాలయ స్థలంలో సిసివేసి తక్షణమే పూలు, పండ్ల దుకా ణదారులకు స్థలాలు కేటాయించాలని అధి కారులకు సూచించారు. ఇకపై ప్రకాశం బజార్ లో ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి స్వయంగా పూలు, పండ్ల వ్యాపారు లందరితో చర్చించి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని అప్పీల్ చేశారు. ఏ ఒక్క రూ ఉపాధి కోల్పోకుండా అందరికీ ప్రత్యా మ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రకాశం బజార్ రో డ్డులో ఇకపై ఇబ్బందులు లేకుండా భూగర్భ ఎలక్ట్రిసిటీ తో పాటు, తక్ష ణమే సిసి రోడ్డు వేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ అండ్ బి, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, టౌన్ ప్లా నిం గ్ అధికారులు అందరితో కలిసి భవిష్యత్ ప్రకాశం బజార్ పై సుదీ ర్ఘంగా చర్చించారు.
నల్గొండకు గుండెకాయ ప్రకాశం బజార్ ..
నల్లగొండ జిల్లా కేంద్రానికి ప్రకాశం బజార్ గుండెకాయ లాం టిదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నా రు. ప్రకాశం బజార్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని మననం చేసుకుం టూ ముందుకు సాగారు. ప్రకాశం బజార్లో రోజు 10వేల మం ది వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సా గిస్తున్నారని గుర్తుచేశారు. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు, షాపులు ఉండేవని, ఏలాంటి ఇ బ్బంది అయ్యేది కాదని వ్యాపారాలు పెరగడం, జనాభా పెరగడం వల్ల ప్రస్తుతం ట్రా ఫిక్ జామ్ తో ప్రతి నిత్యం సమస్త వర్గాలు సమస్యలతో సత మతమవుతున్నారని వ్యాఖ్యానించారు.
సమస్త సమస్యల కారణంగానే రోడ్డుపై ఫూట్ పాత్ పై ఉన్న పూ లు,పండ్లు, దుకాణాలు,ఇతర చిన్న చిన్న షాపులను పా త కలెక్టరేట్ స్థలంలోకి తరలిస్తున్నామని, పూలు,పండ్ల వ్యా పారులు ఎవరికి అ న్యాయం జరగనీయకుండా పాత కలె క్టరేట్ స్థలంలో ఉన్న డీసీఎంల ను దేవరకొండ రోడ్ లో ఉన్న హౌ సింగ్ బోర్డ్ స్థలంలోకి తక్షణమే తర లిoచి అక్కడ వీధి వ్యాపారు లంద రికి స్థలం కేటాయింపు చేయాలని అధికా రులను ఆదేశిస్తూ వ్యాపారులకు నచ్చజెప్పారు. 50, 70, 100 గజాల వారీగా స్థలాల కేటాయింపు చేస్తూ వారి వారి షాపుల పరిణా మo మేరకు స్థలంకేటాయింపు చేయాలని ఆదేశించారు.
60 ,70 షాపుల వాళ్ళుమాత్రమే ప్రకాశం బజార్ లో ఫూట్ పాత్ పై ఉన్నారని,వీరందరికి స్థలాలు కేటాయిస్తామని హా మీ ఇచ్చారు. నేను పేదల మనిషినని, పేదలకు ఎట్టి పరి స్థి తుల్లోనూ అన్యాయం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సహాయం చేస్తానని స్ప ష్టం చేశారు. ప్రజలకు మే లు కలిగిందుకే ప్రకాశం బజార్ ప్రక్షాళన కార్యక్రమం చేపట్ట డం జరిగిందని వివరించారు. తాను చేస్తున్న ఈ పనిని ప్రజ లు హర్షిస్తున్నారని, న ల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీ ర్చి దిద్దేందుకే ఈ కార్యక్రమాలన్నీ చే పడుతున్నామని పేర్కొ న్నారు.
ప్రకాశం బజార్ రాకముందే లతీఫ్ షాప్ గుట్ట,పట్టణంలోని తదితర ప్రాంతాలను సందర్శించిన మంత్రి ఆయా ప్రాంతా లతో పాటు నల్లగొం డ నగరంలోని ప్రధాన ప్రాంతాల త క్షణ అభివృద్ధి ప్రక్షాళనకు చేపట్టా ల్సిన కార్యాచరణ కు సం బంధించిన ప్రణాళికలు అధికారులకు సూచించారు. ఆయ న వెంట నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదన పు ఇంచార్జ్ కలెక్టర్ జగదీశ్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి పృధ్వీధర్ రెడ్డి, మున్సిపల్ అధికా రులు ఉన్నారు.
Minister komatireddy venkatreddy surprise visit in Nalgonda muncipal corporation pic.twitter.com/FwTRW3gAM5
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 17, 2026



