Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగా ణ రాష్ట్రంలో రానున్న రెండు సంవత్స రాలలో 30 లక్షల మంది నిరుద్యో గయువతకు స్వయం ఉపాధి కల్పించాల న్నదే రాష్ట్ర ప్ర భుత్వ ల క్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపా రు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో 20 కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించిన నేషనల్ అకాడ మీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొదటి అంత స్తును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాక్ ద్వారా నిరుద్యోగ యువ తకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చే స్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన న్యాక్ భవనాల లో నల్గొండ న్యాక్ మొదటిదని తెలిపారు. నల్గొండ న్యాక్ కేం ద్రం ద్వారా వివిధ రకాల కోర్సులలో ముఖ్యంగా ఎలక్ట్రిషన్, ప్లంబర్, మెకా నిక్, వెల్డర్, డెకరేషన్, కార్పెంటర్, సి సి టీవీ, కంప్యూటర్ తదితర వి భాగాలలో శిక్షణ ఇవ్వడం జరుగు తుందని, రాబోయే కాలంలో మరి న్ని కోర్సులలో శిక్షణను ఇస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కార్మిక శాఖ కారంతో న్యాక్ ఆధ్వ ర్యంలో 60 మంది మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చే శారు .న్యాక్ ద్వారా అత్యాధునిక కోర్సులలో సైతం శిక్షణ ఇ వ్వడం జరుగుతుందని చెప్పారు. యువతలో నిరాశ పెరగ కుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం రా ష్ట్ర స్కిల్ యూని వర్సిటీని ఏర్పాటు చేయనుందని, అంతే కాక జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండేళ్ల లో 30 లక్షల మంది నిరు ద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పి స్తామని తెలిపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో 84 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఇది వరకే ప్రారంభించుకోవడం జరిగిం దని, 5 కోట్ల రూపాయలతో వివిధ రకాల కోర్సులలో శిక్షణ ఇచ్చేందు కు సెట్విన్ ఏర్పాటు చేశామని, ప్ర స్తుతం 20 కోట్ల తోన్యాక్ భవనాన్ని పూర్తిచేసినట్లు తెలిపారు. ఎక్కువ మం ది నిరుద్యోగులు ఉన్న జిల్లా నల్గొండ అని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వారాధి సంస్థ ద్వారా వంద మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకుగాను ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతేకా కుండా జాక్వార్ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయల వ్యయంతో లేబ రేటరీ ఏర్పాటు చేసేందుకు కూడా ఎంఓయూను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మం త్రి రాష్ట్రపతి ద్వా రా అవార్డు పొందిన ఇన్స్ట్రక్టర్ స్నే హల తను శాలువాతో సన్మానించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ నేషనల్ అకాడ మీ ఆఫ్ క న్స్ట్రక్షన్ ద్వారా నిర్మాణ రంగంలో జిల్లా యువ తకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఐటిఐ, పా లిటెక్నిక్, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసిన వారికి ఆధ్యాత్మిక కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకా శా లు కల్పించడం ఉద్దేశం అని తెలిపారు. నల్గొండ న్యాక్ లో సాధ్యమైనంత తొందరగా కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆ యన వెల్లడించారు.న్యాక్ ద్వారా శిక్షణ పొందిన సర్టిఫికెట్ అన్ని ఉద్యోగాలకు పనికొస్తుందన్నారు. న్యాక్ డిజీఎం నా యక్ మాట్లాడారు.జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఎ మ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, న్యాక్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధు లు హాజరయ్యారు.

