Tuesday, September 29, 2026
More
    HomeOpinionMinister N. Uttam Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్య,...

    Minister N. Uttam Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్య, కవిత మాటలతో బీఆర్ఎస్ బండారం బయటపడింది

    📰 Generate e-Paper Clip

     

    Minister N. Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హుజూర్‌నగర్: కాళే శ్వరం ఎత్తిపోతాల పధకం వెనుక దాగి ఉన్న అసలు “ఇన్‌సైడ్ స్టో రీ”ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవిత చేసిన “కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుం చి బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు వచ్చాయి” అనే వ్యాఖ్య దేశం ముందుం చిందని రాష్ట్ర నీటి పా రుదల, పౌర సరఫరాల శాఖ మం త్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజు హుజుర్నగర్ ,కోదాడ నియో జకవర్గాలలో పలు అభివృద్ధి కార్య క్రమాలను ఆయన ప్రారంభించా రు. అనంతరం ఆయన హుజూ ర్‌నగర్‌లో మీడియాతో మాట్లా డిన మంత్రి, కవిత వ్యాఖ్యలతో కాళేశ్వ రం ప్రాజెక్టులో ఇం జినీరింగ్ ప్రమా ణాలు ఎందుకు కుప్పకూలాయో, మేడిగడ్డ ఎందుకు కూలిందో, అ న్నారం–సుందిళ్ల బ్యారేజీలు ఎం దు కు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయో ప్రజలకు అర్థమ వు తోందన్నారు.

    “మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మార్తె స్వయంగా రూ.1,4 00 కోట్ల వ్యవహారం గురించి మాట్లాడితే… ఆ డబ్బు ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? దానికి ప్రతిఫలం గా ఎవరికీ లాభం జరిగిం ది? అనే ప్రశ్నలకు బీఆర్ఎస్ నా యకత్వం సమాధానం చెప్పాలి. కాంట్రాక్టర్లతో రాజకీయ నాయకుల ఆర్థిక సంబంధాలే నిర్మాణ నాణ్య తను బలి చేశాయనే అనుమానా లు ఇప్పుడు మరింత బలపడుతు న్నాయి” అని ఉత్తమ్ అన్నారు.

    మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం సంక్షోభం కేవలం మేడిగ డ్డకే పరిమి తం కాదని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పునాదులు, కట్‌ ఆఫ్ వాల్‌లు, రాఫ్ట్, సీపేజ్, ఖాళీ లు, ని ర్మాణ లోపాలు బయటపడ టం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై తీ వ్రమైన అనుమానాలు కలిగిస్తోం దన్నారు.

    ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిర్మా ణం వరకు తీసుకున్న ప్రతి కీలక ని ర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే జరిగిందని, ఇప్పుడు అదే ప్రాజెక్టు వైఫల్యాలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేయ డం రాజకీయ మోసమేనని ఆయ న విమర్శించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హ రీశ్ రావును నేరు గా లక్ష్యంగా చేసుకున్న ఉత్తమ్ కు మార్ రెడ్డి, “కాళేశ్వరం నిర్మాణం జ రిగినప్పుడు నీటిపారుదల మంత్రి గా ఉన్న వ్యక్తే ఇప్పుడు మూడు నెలల్లో ప్రాజెక్టును బాగు చేస్తానని చెప్పడం రాజకీయ హాస్యాస్పదం. నిర్మాణం జరిగినప్పుడు బాధ్యత మీదే… ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌పై నిం దలు వేయడం ప్రజలు నమ్మరు” అ ని ఘాటుగా విమర్శించారు.

    “పంపులు వెంటనే ఆన్ చేయం డి… నీళ్లు నిల్వ చేయండి” అంటూ హరీశ్ రావు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా బాధ్య తారాహిత్యమైన వని మంత్రి మండిపడ్డారు. “పునా దులే అనుమానాస్పదంగా ఉన్న బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయమం టారా? ప్రజల ప్రాణాలను పణంగా పెట్టమం టారా? మరో మేడిగడ్డ త రహా ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభు త్వం ఎప్పటికీ కారణం కాదు. రాజ కీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే సంస్కృతి మాది కాదు” అని స్పష్టం చేశారు. జాతీ య డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీ ఎస్‌ఏ) మూడు బ్యారేజీల పునా దులపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, పూర్తి స్థాయి పరీ క్షలు, రీడిజైన్, శాస్త్రీయ పునరావా సం పూర్తయ్యే వరకు నీటిని నిల్వ చేయరాదని స్పష్టంగా సూచించిం దన్నారు.

    “పార్లమెంట్ చట్టంతో ఏర్పడిన జా తీయ డ్యామ్ సేఫ్టీ అథా రిటీ సూచ నలను విస్మరించి రాజకీయ ప్రయో జనాల కో సం వ్యవహరించే ప్రసక్తే లేదు. నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి న తర్వాత మాత్రమే నీటి నిల్వ లు, పంపింగ్ కార్యకలా పాలు ప్రారంభిస్తాం” అని మంత్రి తేల్చి చెప్పారు.అన్నారం, సుందిళ్ల బ్యారే జీలను అసలు డీపీఆర్‌లో పేర్కొన్న ప్రదే శా ల నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించడం కూడా తీవ్రమైన సాంకేతిక విరుద్ధ మని పేర్కొన్న మంత్రి, ఆ మార్పు లకు ఇప్పటికీ సరైన సమాధానం లేదన్నారు.

    ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో పు నాదులు, కట్‌ఆఫ్ వాల్‌లు, రాఫ్ట్, సీపేజ్, అంతర్గత ఖాళీలు తదితర నిర్మాణ అంశాలపై సమగ్ర శాస్త్రీయ పరీక్షలు కొనసాగుతున్నాయని, ని పుణుల సిఫార్సుల మేరకు పున రావాస పనులు పూర్తయ్యాకే భ ద్ర తా అనుమతులు జారీ అవుతా యని తెలిపారు.బీఆర్ఎస్ పాలన లో నీటిపారుదల రంగంపై సుమా రు రూ.1.81 లక్ష ల కోట్లు ఖర్చు చే సి రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబి లోకి నె ట్టారని, డాక్టర్ బి.ఆర్. అం బేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు ను పక్కనబెట్టి అధిక వ్యయంతో కాళేశ్వరం నిర్మించడం వల్లే నేటి సంక్షోభం ఏర్పడిందని మంత్రి విమర్శించారు.

    “ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించలేదు… బీఆ ర్ఎస్ వదిలి న ప్రమాదకర వారసత్వాన్ని మే ము స్వీక రించాం. శాస్త్రీయ పరీక్ష లు, నిపుణుల ఆమోదం, జాతీయ భద్రతా ప్రమాణాలు పూర్తయిన త ర్వాతే కాళేశ్వరం బ్యారే జీల్లో నీటి ని నిల్వ చేస్తాం. ప్రజల ప్రాణాల విషయంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు” అని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.