Sunday, September 27, 2026
More
    HomeOpinionMiryalaguda Midnight Operation : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడ ‘మిడ్‌ నైట్ ఆపరేషన్’,ఎస్పీ శరత్ చంద్ర...

    Miryalaguda Midnight Operation : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడ ‘మిడ్‌ నైట్ ఆపరేషన్’,ఎస్పీ శరత్ చంద్ర పవార్ ‘ఉక్కుపాదం’

    📰 Generate e-Paper Clip

    Miryalaguda Midnight Operation : ప్రజా దీవెన, మి ర్యాలగూడ: అది మంగళవారం అర్ధరాత్రి సమయం దాదా పు 12 గంటలు కావస్తోంది. మిర్యాలగూడ రోడ్లన్నీ సైలెం ట్‌గా మారుతున్నవేళ.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, సైరన్ల మోత తో రంగంలోకి దిగింది ఖాకీ సైన్యం. నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ స్వయంగా ప ర్యవేక్షించిన ఈ హై-వోల్టేజ్ ‘ నాకా బందీ’ ఆపరేషన్ చూసి రూల్స్ బ్రేక్ చేసేవాళ్ల ఫ్యూజు లు ఎగిరిపోయాయి.మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూ డళ్లు, నేషనల్ హైవేలు, అనుమానాస్పద అడ్డాలపై పోలీ సు లు ముప్పేట దాడి చేశారు. ప్రతి వాహనాన్ని అంగుళం అం గుళం జల్లెడ పట్టారు.

        లాక్ అయిన 150 వాహనాలు

    సరైన పేపర్లు లేవు, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేక పోవడం.. ఇలా రూల్స్ బ్రేక్ చేసిన 150 కి పైగా వా హనాలపై కేసులు బుక్ అయ్యాయి. బైక్ రేసింగ్‌లు చేస్తూ, సైలెన్సర్లు మార్చి ఊరు ఫై రింగ్ సౌండ్‌తో భయపెట్టే ‘సౌండ్ పార్టీల’ ఆట కట్టించారు.

     

          డ్రంక్ అండ్ డ్రైవ్ షాక్

    ‘మందు కొట్టి స్టీరింగ్ పడితే జై లు కే’ అంటూ సాగిన తనిఖీల్లో ఏకం గా 40 మంది దొరికిపోయారు. వీరందరికీ స్పాట్‌లోనే చట్టపర మై న ట్రీట్‌మెంట్ స్టార్ట్ అయింది.

    ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సరే.. రాజీ పడే ప్ర సక్తే లేదు. గంజాయి, మట్కా, జూ దం, రౌడీయిజం కనిపిస్తే ఉక్కు పా దంతో అణచివేస్తాం. మిడ్ నైట్ రై డ్స్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ఇకపై నిరంతరం కొనసాగుతాయ ని ఎస్పీ రూల్స్ బ్రేకర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

    టైమ్ దాటిందా, హోటళ్లు, దాబాలకూ సీజ్

    కేవలం రోడ్ల పైనే కాదు రాత్రి వేళ ల్లో రూల్స్ బ్రేక్ చేసే దా బాలు, కేఫ్‌ లు, టీ స్టాళ్లపై కూడా ఎస్పీ నిఘా పెట్టారు. నిర్దే శిత సమయం దాటిన తర్వాత షట్టర్లు తెరిచినా, అసాం ఘి క కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చినా.. ఓనర్లపై కూడా క్రిమిన ల్ కేసులు గ్యారెంటీ అని హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. లేదా అ క్రమంగా గంజాయి, జూదం లాంటివి జరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వా ల ని ఎస్పీ ప్రజలను కోరా రు. ఈ మెగా ఆపరేషన్‌లో డిసిఆర్‌బి డిఎస్పీ రవి, సీఐలు నాగభూషణ్, సోమన ర్సయ్య, పి.ఎన్.డి. ప్రసాద్‌లతో పా టు సిబ్బంది మొత్తం ఒక పక్కా ప్లానింగ్‌తో పాల్గొని మిర్యా లగూడ ను క్లీన్ అండ్ సేఫ్‌గా మార్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.