Mla komatireddy Rajagopal reddy : ప్రజా దీవెన, ము నుగోడు: చిన్న నాడు మేము చదువుకునేటప్పుడు పాఠశా లల్లో కులాల గురించి తెలియదని, అన్ని కులాల అన్ని మ తాలవారు ఒకే పాఠశాల ప్రాంగ ణంలో చదువుకునేవా ళ్లమ ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొ న్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో మళ్లీ అ లాంటి రోజులు రాబోతున్నాయని కీలక వ్యాఖ్య చేశారు.
ఈ పాఠశాలలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసిమెలిసి చదువుకోవచ్చన్నారు. గత బిఆర్ఎస్ ప్రభు త్వం విద్యను గాలికొదిలేసిందని గుర్తు చేశారు. ఆదివారం మును గోడులోని దుబ్బ కాల్వ రోడ్డులో రూ. 200 కోట్ల వ్య యంతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, నల్గొండ జి ల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, టీ జీఈడబ్ల్యు ఐడిసి ఎండి గణపతి రెడ్డి లతో కలిసి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మా ట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ కేం ద్రంలో 200 కోట్ల రూపాయల వ్య యంతో 2500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మా ణం చేసుకోవడం శుభపరిణా మని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ ర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రా రంభమవుతున్నాయని తె లిపారు. వీటిలో సుమారు రెం డు లక్షల మంది విద్యార్థులు చదువు కోబోతున్నారన్నారు.
గత బి ఆర్ఎస్ ప్రభుత్వంలో కొం దరికి బర్లిచ్చారని, కొంద రి కి గొర్లి చ్చారని, కొందరికి చేప పిల్లలు ఇ చ్చారని, కానీ నా ణ్యమైన విద్య మాత్రంఅందించలేదని, విద్య వై ద్యాన్ని గత ప్రభుత్వం గాలికి వది లేసిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటి గ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకొచ్చింద న్నారు. ఈ స్కూళ్లు పూర్తయిన త ర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపే చూస్తుందని చెప్పా రు. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ స్కూలు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అ ప్పులు చేసింది అవి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లాభమయ్యా యనివిమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో 76 లక్షల ముప్పై ఐదువేల 115 మంది వి ద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రా ష్ట్రంలో చదువుతున్నారని, ప్రై వే ట్ సెక్టార్ లో 44 లక్షల మంది వి ద్యార్థులు చదివితే ప్రభుత్వ సెక్టా ర్లో 24 లక్షల మంది చదువుతున్నారని, విద్య మొత్తం కార్పోరేట్ చేతిలో కి వెళ్ళిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కనీసం 50 లక్షల మంది విద్యా ర్థు లు ప్రభుత్వ ఇన్స్టి ట్యూ షన్స్లో చ దివే అవకాశం రావాలని, బడ్జెట్ లో 10 నుండి 15 శాతం బడ్జెట్ కే టాయిస్తే సాధ్యమవుతుందన్నారు. బడ్జె ట్లో విద్యకు అత్యంత ప్రాము ఖ్యత ఇవ్వాలని కోరారు. ము నుగోడు నియోజకవర్గంలో 330 ప్ర భుత్వ పాఠశాలలు ఉ న్నాయని, వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 9, 700 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారన్నారు. మునుగోడులో వి ద్యావ్యవస్థలో సమూల మైన మార్పులు తీసుకురావాల్సి ఉంద న్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెస్ చార్జీలను పెంచామని, వి ద్య విషయంలో రాబోయే రోజుల్లో చాలా చేయాల్సి ఉంద ని,హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న ము ను గోడు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని పునరుద్ఘాటించారు. నల్లగొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మునుగో డు నియోజకవ ర్గమని, ఈ నియోజకవర్గానికి ఎంతో చే యాల్సి ఉందని గుర్తు చేశారు. మొట్టమొదటి అడుగు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణoతో పడబోతుందని వ్యాఖ్యా నించారు.నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజకీయా లను శాసించే జిల్లా అని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి మునుగోడు నియో జకవర్గ ప్రజల తరఫున ధ న్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూ లు ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డికి శుభా భినందనలు తె లియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కో సం రాజ్ గోపాల్ రెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్నా రు.భవిష్యత్తులో పేద విద్యా ర్థు ల కు నైపుణ్యంతో కూడిన విద్యను అందించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ప్ర భుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వా ల పై ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలలో విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయింపులు ఉన్నా యన్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో అ ర కోర వసతులు ఉన్నా యని, విద్యా వైద్యంపై ప్రభుత్వం బాధ్యత తీసు కోవాలన్నా రు. విద్యా వైద్యాన్ని కా ర్పొరేట్ శక్తులు వ్యాపారంగా మా ర్చాయని వివరించారు.ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతు లు కల్పించి ప్రభుత్వ పాఠశాలను బలో పేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞ ప్తి చేస్తున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాల లో టీచర్ల కొరత ఉన్నదని,నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటె డ్ పాఠశాల రావడం శుభపరిణా మమన్నారు. ఈ కార్య క్రమంలో కుంభం శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

