Mrps Padmashri MandhaKrishnaMadhiga : ప్రజా దీవెన, నల్లగొండ: భారతదేశం లో రాజ్యాంగాన్ని గౌరవించిన వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశ ద్రోహులుగా పరిగణింపబడతా రని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మా ది గ అన్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లా డుతూ దళితులపై ఇప్పటికి వివక్ష, అంటరానితనం, దాడులు, హ త్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని, ఇవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో ఓ దిక్కు జరుగుతూనే ఉన్నాయ న్నారు.
దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ మీ దనే సుప్రీంకోర్టులో బూటుతో దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో దేశం, ప్రపంచంలో నే ప్రజలు నివ్వెరపో యారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరి గి మూడు వారాలు గడుస్తున్న ప్పటికీ ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారని, కేసులు పెట్టలేదని, న్యా య వ్యవస్థ సుమోటోగా కేసు తీసు కోలే దని, మానవ హక్కుల కమిషన్ స్పందించలేదంటే ఈ దే శంలో దళి తులకు ఇప్పటికీ రక్షణ లేదని స్ప ష్టంగా రుజువు అవుతుందన్నా రు.
దాడి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు సోషల్ మీడియా ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అభిప్రాయాలను చెబు తూ నే మేము మళ్ళీ మళ్ళీ దాడులు చే స్తామని చెబుతూనే ఉన్నా రన్నా రు. ధర్మం ముసుగులో, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగా న్ని లెక్క చేయకుండా, చట్టాలకు విలువనివ్వకుండా దాడులు చేస్తా మంటే వారు దేశ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని,చట్టాలకు వి లువ ఇవ్వడం లేదు కదా అని భారత రాజ్యాంగాన్ని భారత పౌరు లుగా మనమే అంగీకరించకపోతే, విలువనివ్వక పోతే ఇతర దేశ స్థులు ఇస్తారా అంటూ మనం ఈ దేశభక్తులం ఎట్లా అవుతామని ప్ర శ్నించారు.
రాజ్యాంగాన్ని గౌరవించేవారు, మన చట్టాలకు విలువనిచ్చేవారు దేశభక్తులు అవుతారన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు చట్టా లకు విలువనివ్వని వారు దేశద్రోహులవుతారని స్పష్టం చేశారు. రా జ్యాంగాన్ని గౌరవించేవారు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేయరని తెలిపారు. దళితుడు జస్టిస్ గవాయ్ స్థానంలో వేరే జస్టిస్ ఉంటే దాడి జరిగేనా అ ని ప్రశ్నించారు.? గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో న్యా యవాది, న్యాయ మూర్తి మధ్యన జరిగిన చిన్నపాటి వాగ్వివాదంపై న్యాయమూర్తిని అ వమానించాడని ఐదుగురు జడ్జిల బృందం అర్ధ గంటలో న్యాయవాదిపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు.
అదేవిధంగా రౌడీషీటర్ రియాజ్ పై 40 కేసులు ఉన్నాయని, నిజా మాబాద్ లో సంఘటన జరిగితే హైద రాబాద్ పోలీసు కస్టడీలో ఉన్న రి యాజ్ ఎలా చనిపోతాడని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. దీని ని బట్టి చూస్తే చీప్ జస్టిస్ దళితుడి మీద సుప్రీంకోర్టులో దాడి జరిగి తే సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో ఇంకా దళి తులకు జరగాల్సిన న్యాయం జరగ ట్లేదని, దళితులు ఏ స్థాయికి ఎది గి నా కూడా అవమానాలు దాడులు, హ త్యలు, జరుగుతున్నాయన్నా రు. వారికి న్యాయం జరగట్లేదని స్ప ష్టం అవుతుందన్నారు. అధికారాలు ఉన్న పోలీసులు, మానవ హ క్కుల కమిషన్, రాజ్యాంగ సంస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నా యని ప్రశ్నించారు.
దాడి చేసిన వారు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలలో మాట్లాడుతూ మా విశ్వాసాల పరంగా దాడి చేశాం దానికి కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారని, ఎవరు విశ్వాసాలు వారి వ్యక్తిగ తం. ఎవరి మతాలు వారు దేశంలో గౌరవించుకుంటున్నా రాజ్యాం గాన్ని మాత్రం అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. విశ్వా సాల ముసుగులో దాడులు, హత్యలు చేస్తే రాజ్యాంగం, చట్టాలు ఎందుకని నిలదీశారు.
అందుకే దళితుడైన చీ ఫ్ జస్టిస్ గవాయిపై సుప్రీం కోర్టులో జరిగిన దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ ద ళి తుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడా నికి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబె ట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షిం చుకోవడా నికి నవంబర్ 1న ఎ మ్మా ర్పీఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా జర గని నిరసన ర్యాలీ హైదరా బాదులో జరుగుతుందని, కుల, మత, రాజకీయాలక తీ తంగా ప్రతి ఒక్కరు కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలోఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్ ఎ ఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, ఎమ్మేస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మా దిగ,ఎమ్మా ర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ, ఉద్యోగ సం ఘం నాయకులు మల్లేపాక వెంకన్న, సీనియర్ నాయకులు మేడి శంకర్ మాదిగ, కొమిరే స్వామి మాదిగ, కూరపాటి కమలమ్మ మాదిగ, పో లే యాదయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

