Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda district collecter ilatripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి...

    Nalgonda district collecter ilatripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు,జిల్లా మొద లు గ్రామస్థాయి వరకు అధికారు లు, సిబ్బంది వారి కార్యస్థానాల్లో ఉండాలి

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు,జిల్లా మొద లు గ్రామస్థాయి వరకు అధికారు లు, సిబ్బంది వారి కార్యస్థానాల్లో ఉండాలి

    Nalgonda district collecter ilatripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నే పథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారు లు, సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రా ణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. బుధవారం ఆమె మొంథా తుఫాన్ ప్రభావంపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎడతె రి పిలే కుండా వర్షాలు కురుస్తున్నందు న ప్రజలు ఎవరు సాధ్యమైనంత వ రకు ఇళ్లనుండి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప బయటి కి రావద్దని అప్పీల్ చేశారు.

    రైతులు పొలం పనుల నిమిత్తం పో లాలకు వెళ్ళవద్దని, అలాగే పంట కోతలు చేయవద్దని, పొలాలకు వె ళ్లిన సమయంలో వాన నీటిలో పా ముకాటు గురయ్యే అవకాశం ఉం దని, అలాగే పిడుగు పాటు,ఇతర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. వీట న్నిటి నుండి సురక్షితంగా ఉండేందుకు ఇళ్లలో ఉం డాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం వల్ల తడిసి పడిపో యేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఎవరు ఉండ కుండా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అలాంటి ఇండ్లను గు ర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి వారిని సురక్షిత ప్రాం తాలకు తరలించాలని ఆదేశించారు.

    వర్షాల నేపద్యంలో పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించ డం జరిగిందని, అయినప్పటికీ క స్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు కడగకుండా సంబంధిత ఆర్సివోలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా పాఠశాలల్లో పారిశుధ్య, ఆరోగ్య సమస్యలు, విద్యుత్ ప్రమాదాలు,ఇతర సమ స్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీ సుకోవాలన్నారు. రైతు లు పశువులను పొలాల్లోకి వదల వద్దని, అలా వెళ్లడం వల్ల పిడు గుపాటుకు పశువులు చనిపోయే ఆస్కారం ఉందని తెలిపారు.

    వర్షాలనేపద్యంలో ప్రజలుప్రత్యేకిం చి యువత వాగులు, వంకలు, న దుల వద్దకు ఈత కొట్టేందుకు, బట్ట లు ఉతికేందుకు, చేపలు పట్టేందు కు ఎవరు వెళ్ళవద్దని, అలాగే లో తట్టు కాజ్ వేలు, పొంగి ప్రవహించే బ్రిడ్జిలు, వాగులు, వంకలు దాటే ప్ర యత్నం చేయవద్దని ఆదేశించారు.వర్షాలను దృష్టిలో ఉంచుకొని దా న్యం, పత్తి కోతలు చేయవద్దని రై తులను కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం ,పత్తి పం టలు తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీ సుకోవాలని, ఇందులో భాగంగా టార్పాలిన్లు కప్పి ఉంచా లన్నారు.

    ఎక్కడైనా రహదారులు దెబ్బ తిన్న ప్పటికి కోతకు గురైన, తెగిపో యి న, గుంతలు పడిన వెంటనే పున రుద్ధరణ చర్యలు చేపట్టేలా పం చాయతీరాజ్, ఆర్ అండ్ బిశాఖ లు చర్యలు చేపట్టాలని ఆదే శించారు. విద్యుత్ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఎక్కడైనా వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు ఉంటే సరిచేయాలని, ఎవరు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా చర్య లు తీసుకోవాలని వి ద్యుత్ అధికారులను ఆదేశించారు.దేవరకొండ డివిజన్లో 12 సెంటీమీ టర్ల వర్షపాతం నమోదైనందున ఈ ప్రాంతం లోని మారుమూల, గిరిజన తండాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్ర జలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా చూడాలని తెలిపారు.

    మొంథ తుఫాన్ కారణంగా భారీ వ ర్షాలను దృష్టిలో ఉంచుకొని జి ల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంట లు పని చేసే విధంగా సిబ్బంది అం దుబాటులో ఉండాలని ఆయా శా ఖల అధికారులను ఆమె ఆదేశిం చారు. ప్రజలు వర్షానికి సంబంధిం చిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 18004251442 కు తెలియజేయాలని ఆ మె కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, భారీ వర్షాల సందర్భంగా ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చ ర్యలపై సూచనలు చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.