Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda collecter Alternative Crops : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, రైతులు...

    Nalgonda collecter Alternative Crops : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda collecter Alternative Crops :  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పా ల న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4 నుండి ని ర్వహిస్తున్న రైతు వారోత్సవంలో భాగం గా రైతులకు వివిధ అంశాలపై అవ గాహన కల్పించే క్రమంలో మూడవ రోజైన బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రై తు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి న అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హా జరయ్యారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించా ల ని, ప్రత్యేకించి ఆయా భూముల కు అనుకూలంగా ఉండే పంటలు పండిస్తే అధిక దిగుబడులతో పాటు, అధిక లాభా లు సాధించవచ్చన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయి ల్ హెల్త్ కార్డులను మం జూరు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఆయా గ్రామాల లోని భూములకు అ నుగుణంగా పంటలు వేసేందుకు జి ల్లా యంత్రాంగం తరుపున అవసర మైతే ఒక డ్రైవ్ లా భూ ముల సార వంతం పరిశీలించడం జరుగుతుందని తెలిపా రు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పుడే రై తు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్ర భుత్వం పై ఉంటుందని అన్నారు. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకా ల పంటలు పండిం చాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరి స్థితులకు అనుకూలంగా పంటలు పండించాలని చెప్పారు.

    ముఖ్యంగా పంటల సాగుతో పా టు, పండించిన పంటల ద్వారా అధిక లాభాలు పొందేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌక ర్యాలు వినియోగించుకొని పంటలు నిల్వ చేసుకోవడం ద్వారా ఎ క్కువ ఆదాయం పొందవచ్చని అ న్నారు. వ్యవసాయంలో మార్పు లు చేసుకోవాల్సిన అవ సరం ఎం తైనా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వరిలో ఎల్లప్పు డూ దొడ్డు బియ్యం కాకుండా, డిమాండ్ ఉ న్న సన్న బియ్యం ఇతర రకాల ధాన్యాన్ని పండించాలని రై తులకు సూచించారు.

    రైతు సoక్షే మంలో భాగంగా తిప్పర్తి ప్రాథమిక సహకార సం ఘం ఆధ్వర్యంలో ఉన్న భూమిని రైస్ మిల్ ఏర్పాటు చేసేం దుకు సుముఖవ్యక్తం చేసిన నేప థ్యంలో నాబార్డ్ అధికారు లతో మాట్లాడి తగు చర్యలు తీ సుకుంటామని కలెక్టర్ చె ప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాం కు ద్వారా ఇచ్చే రుణాల కు ఎలాంటి పాస్ పుస్తకాలు లేకుండా ఆన్లైన్లో భూభారతి వి వరాల ఆధారంగా లోన్లు మంజూ రు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఈఓను ఆదేశించారు.

    నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగో లు సమస్య పరిష్కారా నికి కృషి చే స్తున్నామని, ధాన్యం సేకరణను త్వరలోనే పూ ర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. రైస్ మిల్లర్లు, లారీలు, వ ర్షం, తదితర కారణాలవల్ల కొనుగోలులో కొద్దిపాటి జాప్యం ఏ ర్పడిందని, మిల్లర్లు,హమాలీలు త దితర సమస్యలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ,ఆర్ అండ్ బిశాఖ ఆ మాత్యులతో మాట్లాడి చర్చించి సమస్యలన్నీ అధిగమిం చ డం జరిగిందని తెలిపారు.

    ప్రస్తుతం ధాన్యం తరలించేందు కు 900 లారీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేవలం 20 రోజులలో 3 లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొ నుగోలు చేయడం జరిగిం దని, ప్రతిరోజు ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారు లు, సిబ్బంది తో టెలికాన్ఫరెన్స్, వీడి యో కాన్ఫరెన్స్, సమీక్ష లు నిర్వహిస్తున్నామని, ధాన్యం సేక రణ వేగవంతం చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం మిల్లులలో అన్లోడింగ్ సమస్య లేదని తెలిపారు.

    నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకా లు సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ధాన్యం కొనుగో లు పై రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రితో పాటు ,జిల్లా కలెక్టర్ ప్ర తిరోజు సమీక్షిస్తున్నారని, వారం, పది రోజుల్లో దాన్యం తర లించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, రైతులు ఎల్ల ప్పుడూ వరినే సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు.

    ఈ సందర్భంగా వివిధ శాఖల అ ధికారులు వారి శాఖ ద్వా రా అందించే పథకాలపై రైతులకు అవగాహన క ల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పిఎసిఎస్ అధ్య క్షులు నాగరత్నoరాజు, సహదేవ రె డ్డి, మార్కెటింగ్ ఎడి ఛా యాదేవి, ఎల్డిఎం శ్రామిక్, జిల్లావ్యవ సాయ అధికారి శ్రవణ్ పాల్గొన్నారు. జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ కార్య క్రమానికి అధ్యక్షత వహించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.