Nalgonda Collecter IlaTripathi : ప్రజా దీవెన మాడు గులపల్లి:మహిళలు చిత్తశుద్ధితో ముందుకె ళ్లాలని, మహిళ కోసం మహిళనే అండగా నిలబడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. మంగళవారం ఆమె మాడుగుల పల్లి మండలం పోరెడ్డి గూడెం లో మిర్యాలగూడ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి ఇందిర మ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమా నికి హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిర మ్మ ఇల్లు పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని అంది స్తోందని కలెక్టర్ అన్నారు. తక్కువ సమయంలో ఇల్లు నిర్మిం చుకోవడం చాలా గొప్ప విషయమని,పోరెడ్డి గూడెం పైలెట్ ప్రాజెక్టు కింద లేనప్ప టికీ, జూన్ లో వర్షాలు వచ్చినా త్వరగా ఇండ్లు నిర్మిం చుకొని లబ్ధిపొందడం నూతనగృహప్రవేశాలు చేసిన కుటుంబాలను అభినందించారు. మహిళలు మహిళ శక్తిగా ఎదగాలని, మహిళలు అన్ని రంగాలలో అ భివృద్ధి చెందాలని,మహిళలకు ప్ర భుత్వం వడ్డీ లేని రుణాలు,బస్సుల నిర్వహణ,బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు.
మహిళలు ఒకేపనికి పరిమితం కా కుండా, అని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీదనే కల్యాణ లక్ష్మి, ఇందిర మహిళా శక్తి చీరల వంటి పథకాలు అందిస్తుంద న్నదని తెలిపారు. ఇల్లు ఒక కుటుం బానికి భద్రత, మహిళకు గౌరవమ ని,వారు ఇష్టపడేది చీర లు ఇల్లు అని అన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు భ త్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రా ష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రకాలు గా అభివృద్ధి సాధించేం దు కు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు, వడ్డీ లేని రుణాలు ,ఇంది రా మహిళ శక్తి చీర లు,తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నదని తెలిపారు. ఇ ల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూ పాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తు న్నదని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకో వాలని అన్నారు.
అనంతరం శాసనసభ్యులు, ఎమ్మె ల్సీ, జిల్లా కలెక్టర్ మహిళలకు ఇంది ర మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, తదితరు లు ఉన్నారు.

