Sunday, September 27, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకట న, 2034 నాటికి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకట న, 2034 నాటికి దేశంలోనే ఓ ఆద ర్శవంతమైన నియోజకవర్గంగా కొడంగల్‌ 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, కొడంగల్ : 2034 నా టికి దేశంలోనే ఒక ఆదర్శవంతమై న శాసనసభ నియోజకవర్గంగా కొ డంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలు పునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవ ర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభి వృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా ని లబెడుదామని చెప్పారు. ముఖ్య మంత్రి సోమవారం కొడంగల్ నియో జకవర్గంలో పర్యటించారు. కొడంగ ల్‌ లో హరేకృష్ణ సంస్థ (HKM) వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీకి చె న్)ను పరిశీలించారు. అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ (Akshaya Patra Foundation) ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా ని యోజకవర్గంలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకు స్థాపన చేసి సంక్షేమ పథకాలకు సం బంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ము ఖ్య మంత్రి ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీ ర్చి ది ద్దడానికి సంబంధించి ప్రణాళికల ను ఆవిష్కరించారు.

    ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతం గా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథ కాలను అమలు చేస్తున్నాం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్ర భు త్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎం చుకున్నాం. ఇంట్లో అమ్మ ఏ విధం గా ఆలోచన చేస్తుందో, అదే విధం గా అక్షయపాత్ర సహకారంతో ని యోజకవర్గంలోని 312 పాఠశాల ల్లో చదువుకుంటున్న 28 వేల మం ది విద్యార్థులకు ప్రతి రోజూ ఉద యం అల్పాహారం పెడుతున్నాం. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడ కూడదు. ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పా హారం పెట్టాలని నిర్ణయించాం. మ ధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవే శపెడుతున్నాం.

    కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఎ డ్యుకేషనల్ హబ్‌గా మార్చుతు న్నాం. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియో థెరఫీ, ఇం జనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియ ర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రం లో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూ ల్‌ను కొడంగల్‌లో ప్రారంభించుకో బోతున్నాం. రేపటి తెలంగాణ పు న ర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భా గస్వామ్యం చేయడానికి చర్యలు తీ సుకుంటున్నాం. 5 వేల కోట్ల రూ పా యలతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ ను నిర్మించుకుంటున్నాం. గొప్ప చ దు వు చదవాలంటే కొడంగల్ వెళ్లే వి ధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్‌ను ని ర్మిస్తున్నాం. 16 నెలలు తిరిగే లో పు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హ బ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చే స్తున్నాం.

    కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల ను కృష్ణా నదీ జలాలతో తడపాల ని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకో వడమే కాకుండా దాదాపు 5 వేల కో ట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీ రివ్వాలని సంకల్పించాం.

    భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చా రు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయి. రైతులు అడి గిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చాం. లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాం తంలో రైతులు ముందుకొచ్చి ఇస్తు న్నారు. అంతర్జాతీయ స్థాయి పరి శ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రా మిక వాడను అభివృద్ధి చేస్తున్నాం.

    కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేం ద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. ఇక్కడి పిల్లలకు విద్య తో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు క ల్పించే ప్రణాళికలు చేస్తున్నాం. ఇ క్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందా లంటే రైల్వే లైన్ కావాలి. అందుకే వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ (వి కారాబాద్, పరిగి కొడంగల్ నారా యణపేట్, మక్తల్) నుంచి కర్నాకట రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదమే కాకుండా రా ష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మం జూరు చేశాం. 70 ఏండ్లుగా వత్తు లేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొద లుపెట్టబోతున్నాం.

    ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండ లంలో తొందరలోనే సిమెంట్ పరిశ్ర మను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు క ల్పించబోతున్నాం.రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పంపిణీ చేయ డానికి కోటి చీరెలను సారెగా నా ణ్యత కలిగిన చీరలను అందిస్తు న్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర అందా లి. ప్రతి ఆడబిడ్డ ఇంటికెళ్లి చీర అం దించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎ న్నికల్లో మంచి వారిని గెలిపించుకో వాలని ముఖ్యమంత్రి పిలుపుని చ్చారు.

    నియోజకవర్గంలో స్వయం సహా యక సంఘాలకు వడ్డీలేని 300 కో ట్ల రూపాయల చెక్కును అందిం చా రు. అంతకుముందు మహిళా శక్తి ప థకంలో భాగంగా మద్దూరు మం డల మహిళా సమాఖ్య సౌజన్యం తో నడపనున్న బస్సుకు ముఖ్య మంత్రి జెండా ఊపి ప్రారంభించా రు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాvకిటి శ్రీహరి, జిల్లా ప్రజా ప్రతినిధులు, అ ధికారులు, మహిళా సంఘాల ప్రతి నిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.