Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, చి ట్యాల: ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని మనం ర క్షించుకుంటూనే ఎదుటివారి ని కాపాడాల్సిన అవసరం ఉం దని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అ న్నారు. పరిశ్రమలలో ప్ర మాదాలు సంభవించినప్పుడు అత్యవసర ప్రతిస్పందన, సంసిద్ధత, వ్యవస్థలను బలోపేతం చేసే విషయమై జాతీయ విపత్తుల నిర్వహ ణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సం స్థల ఆదేశాల మేరకు సోమవారం న ల్గొండ జిల్లా చిట్యాల మండలం పి ట్టంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీ (సైమ్ ల్యాబ్స్) లో నిర్వ హించి న “మాక్ డ్రిల్” నమూనా విన్యాసానికి ఆయన ముఖ్యఅతి థి గా హాజరయ్యారు.
జాతీయ విపత్తుల నిర్వహణ సం స్థ ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు ల నిర్వహణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరదలు, అటవీ అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు సంభవిం చినప్పుడు జిల్లా యంత్రాంగాల ప్రతిస్పందన, సంసిద్ధత పై వివిధ జిల్లాలలో సంసిద్ధత కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా పారి శ్రామిక ప్రమాదాల ప్ర తిస్పందన, సంసిద్ధతకు ఎంపిక కాగా, ఈ నమూనా కార్యక్ర మాన్ని పిట్టంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వియాస్ సైం టిఫిక్ లిమిటెడ్ కంపెనీ లో నిర్వహించడం జరిగింది.
నమూనా విన్యాసాన్ని పరిశీలించి న అనంతరం జిల్లా కలెక్ట ర్ మాట్లా డుతూ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించిన ప్పుడు సంబంధిత కంపెనీ తక్షణమే స్పందించాలని, ఫైర్, వాటర్, వైద్య ఆరోగ్య శాఖల బృందాలు నిర్దేశించిన సమ యంలో అప్రమత్తం కావాలన్నారు. ఒకరికొకరు సహకరిం చుకుంటూ వారి ని వారు కాపాడుకుంటూనే తోటి వారిని కా పాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల సమ యంలో అత్యవసర ప్రతిస్పందన తో పాటు, పరిస్థితులను ఎదుర్కొ నేందుకు సంసిద్ధంగా ఉండడం, తద్వారా వ్యవస్థ లను బలోపేతం చేసేందుకు నమూనా విన్యాసాలు ఉ ప యోగపడతాయన్నారు. దీని ద్వారా పరిశ్రమలలో ప్రమాదా లు సంభవించినప్పుడు ఉద్యోగులను ఏ విధంగా సంరక్షిం చుకోవాలో తెలుస్తుందని చెప్పారు.
ఇలాంటి విన్యాసాల వల్ల ప్రమాదా లు సంభవించినప్పుడు చనిపోయే వారి సంఖ్యను పూర్తిగా తగ్గించడంతోపాటు, ప్ర మాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్సలను అం దించవచ్చని, తద్వారా సం ఘటన సంభవించినప్పుడు ఎం త వరకు సిద్ధంగా ఉన్నామనే విషయం అర్థం అవుతుంద న్నారు. ఇ న్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, పరి శ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా క్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధి కారి, ఇతర సంబంధిత శా ఖల అ ధికారులు పాల్గొన్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సె క్యూరిటీ ఫోర్స్ అధికారులు హైదరాబాద్ నుండి కార్యక్రమా న్ని ఆన్ లైన్ లో పరిశీలించారు.
శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిసారించాలి
ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆ రోగ్యం పై దృష్టి సారించా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజా పా లన- ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శా ఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రం లోని డాక్టర్స్ కాలనీలో ఉన్నవిద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగ కార్యక్ర మానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్ర జాపాలన ప్రగతి ప్రణాళి క 99 రో జుల కార్యక్రమంలో భాగంగా అనేకరకాల కార్య క్రమాలను నిర్వహిం చడం జరుగుతున్నారు. ఇందులో భా గంగా ఈనెల 18 నుండి 23 వ రకు యువజన వారోత్సవం ని ర్వ హించనున్నామని, ఇందులో భాగంగా సోమవారం” ఫిట్ & యాక్టివ్ తెలంగాణ”లో భాగంగా యోగా కా ర్యక్రమా న్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, ఈ వారం రోజులపాటు ఫిట్ తెలం గాణ ఫిజికల్ లీటరసిపై కార్యక్రమాలు ఉంటా యన్నారు.
మనుషులు ప్రతిరోజు వివిధ పను ల నిర్వహించడం వల్ల శరీరం అల సటకు గురవుతుందని, అందువల్ల ఆరోగ్యకర మైన భోజనంతోపాటు, వ్యాయామం ,యోగ వంటివి చే యాల్సిన అవసరం ఉందని తెలి పారు. దీన్ని దృష్టిలో ఉం చుకుని ఫి ట్నెస్ పై ప్రతి ఒక్కరు దృష్టి సారిం చాలని, యోగ శారీరక వ్యాయా మం ఇందుకు పనికొస్తాయని వివ రించా రు. యోగా జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ ఫి ట్నెస్ అనుసరిస్తే ఎలాంటి రోగాలు ద రిచేరవన్నారు. ప్రతి ఒక్కరూ శా రీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు.
ఈ వారం రోజుల పాటు ఫిట్ నెస్ తో పాటు, పర్యాటకానికి సంబం ధించిన కార్యక్రమాలను సైతం ని ర్వహించడం జరు గుతుందన్నా రు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జెడ్పి సీ ఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా క్రీడ లు, యువజన సర్వీసుల శాఖ అ ధికారి అక్బర్ అలీ, మున్సిప ల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పా ల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ని ర్వహించిన 2కే మారథన్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి రన్ లో పాల్గొన్నారు.



