Sunday, September 27, 2026
More
    HomeOpinionSuryapet brutal murder : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లా తు మ్మల పెన్ పహాడ్...

    Suryapet brutal murder : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లా తు మ్మల పెన్ పహాడ్ లో ఘోరం,ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు

    📰 Generate e-Paper Clip

    Suryapet brutal murder : ప్రజా దీవెన, సూర్యాపేట: సూ ర్యా పేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో సరిహద్దు నిఘా వ్యవస్థలు, ప్రిడిక్టివ్ క్రైమ్ అలర్ట్లు ఉన్న ప్పటికీ మనుషుల్లోని స్వార్థాన్ని, క్రూరత్వాన్ని సాం కేతికత మార్చలేకపోతోంది. ఆత్మకూరు ఎస్ మండల పరిధి లోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో సోమవారం తెల్లవారు జా మున ఒక దారుణ హత్య కలక లం సృష్టించింది. ఆస్తి కో సం కన్న అక్కనే కత్తితో నరికి చంపాడు ఓ కిరాతక తమ్ము డు.ఈ ఘోర దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

    మృతురాలు సురుగి అంజమ్మ భర్త చనిపోవడంతో, పిల్లలు కూడా లేకపోవడంతో తన స్వగ్రామమైన తుమ్మల పెన్ ప హాడ్‌కు వచ్చేసింది. అక్కడ తన చిన్న చెల్లెలి దగ్గరే ఉంటూ వస్తోంది. కష్ట కాలంలో చెల్లెలు తన బాగోగులు, మంచి చె డులు చూసుకుంటుండడంతో అంజమ్మ భావోద్వేగానికి లో నై, తన పేరిట ఉన్న 2 ఎకరాల విలువైన భూమిని చెల్లెలికే ఇచ్చేస్తానని ప్రకటించింది.

    అయితే అక్కతీసుకున్న ఈ నిర్ణయం తమ్ముడికి అస్సలు న చ్చలేదు. “నాకు ఇవ్వకుండా చెల్లెలికి ఎలా ఇస్తావ్?” అం టూ గత కొన్ని రోజులుగా అక్కతో తరచుగా గొడవ పడు తున్నాడు. చివరికి అక్క బ తికుంటే కదా భూమి చెల్లెలికి వె ళ్లే ది అదే తనే లేకపోతే ఆటోమేటి క్‌గా ఆస్తి నాకే వస్తుం ద ని అనే ఒక క్రూరమైన ఐడియా అతని మైండ్‌ లోకి వచ్చిం ది.

    ఈ క్రమంలో సోమవారం ఉదయం సరిగ్గా 6:45 గంటల స మయంలో అంజమ్మ రోజువారీగా కరువు పని కి వెళ్లేందుకు ఇంటి నుంచి బయ లుదేరింది. అప్పటికే పదునైన కత్తి తో కాపుగాచిన తమ్ముడు ఆమె వె నుక నుంచి ఒక్కసారిగా దా డి చేశాడు. విచక్షణా రహితంగా పలు మార్లు కత్తితో పొడ వడంతో అంజ మ్మ అక్కడికక్కడే రక్తపు మడుగు లో కొట్టు మిట్టాడుతూ ప్రాణాలు విడిచింది.

    దీంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘట నా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్స్ సా యంతో ఆధారాలు సేకరిస్తున్నా రు. నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభ మైంది. ఈ మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నామని పోలీసులు తెలిపారు. కా గా టెక్నాలజీ ఎంత పె రిగినా భూమి, పైసల కోసం కన్నవాళ్లను చం పుకునే నైజం మాత్రం మారడం లే దు అనడానికి ఈ ఘటన నిదర్శ నంగా నిలుస్తుందని చర్చ జరుగుతోంది.

     

    తుమ్మల పెన్ పహాడ్‌ లో జిల్లా ఎస్పి నరసింహ

    భూ సంబంధిత తగాదాలు ఉంటే చట్ట పరిధిలో పరిష్కరిం చుకోవా లి చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులు హత్యలు చేస్తే జైలు శిక్షలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ స్పష్టం చేశారు. ఆత్మ కూ రు పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మల పెనపహాడ్ గ్రామంలో భూతగాదా ల నేపథ్యంలో జరిగిన మహిళ హ త్య ఘటన స్థలాన్ని ఎస్పీ పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా రు. ఘటన జరిగిన ప్రదేశంలో క్లూస్ టీ o సిబ్బంది, డాగ్స్ స్క్వాడ్ సి బ్బంది ఆధారాలు సేకరించా యి. నేరానికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపర మైన చర్యలు తీసుకోవాలని కేసును వేగంగా ద ర్యాప్తు చేసి కోర్టుకు పంపించాలని అధికారులకు సూచించారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామానికి చెందిన సు రిగి సై దులు సొంత అక్క అంజమ్మకు ఇ ద్దరికీ భూవివాదం నెలకొని ఉంది, దీనికి సంబంధించి గతంలో ఆత్మ కూరు పో లీస్ స్టేషన్ లో కేసు న మోదు చేయడం జరిగింది, ఇరు వ ర్గాలను కూడా బైండోవర్ చేసి హెచ్చరించడం జరిగిందని తె లిపారు. అక్క ఉంటే భూమి నాకు దొరకద ని అక్కను తప్పి స్తే త్వరగా భూమి తన సొంతం చేసుకోవచ్చని భావిం చిన నిందితుడు సైదులు సోమవా రం రోజు ఉదయం కరువు ప ని నిమిత్తం వెళుతున్న అంజమ్మ పై వి చక్షణ రహితంగా క త్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు.

    స్థానిక ప్రజలతో మాట్లాడుతూభూ సంబంధిత తగాదాలు ఉంటే కోర్టు ల సమక్షంలో, పెద్దమనుషుల స మక్షంలో చట్ట పరంగా పరిష్కరిం చుకోవాలని చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులు చేసిన హత్యలు చేసిన జైలుకు వెళ్లడం తప్పద న్నారు. గతంలో గరిడేపల్లి మండలం లో పొనుగోడు గ్రామం లో భూతగా దాలకు సంబంధించిన జరిగిన హ త్య కేసులో నలుగురు నేరస్థులకు యావజ్జీవ కారాగార శిక్ష పడిందని గు ర్తు చేశారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించు కోవాలని కోరారు.

    నేరానికి పాల్పడ్డ సైదులు పై ఆత్మ కూరు పోలీస్ స్టేషన్ నం దు హత్య కేసు నమోదు చేయడం జరిగింద ని, త్వరితగ తిన కేసు దర్యాప్తు చే సి నేరస్తులను శిక్ష పడేలా చేస్తామ ని బాధ్యత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కృషి చేస్తుం దన్నారు. ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖ ర్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ నవీన్, ఎ స్సైలు మహేష్, ఐలయ్య, గోపికృ ష్ణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.