Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, అన్నదాతలు వరివేసి ఆ...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, అన్నదాతలు వరివేసి ఆ గంకాకండి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, తిప్పర్తి: ఈ ఖరీఫ్ సీజన్ సమయం ముగిసినందున జిల్లా లోని రైతులు ఎట్టి పరిస్థితు లలో వరి వేయవద్దని, వరి వేస్తే నష్టపోవాల్సి వస్తుందని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నా రు. వ్యవసాయ అధికారులు మరో సారి క్షేత్రస్థాయిలో ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి రైతులు వరివేయకుండా అవగాహ న కల్పించాలన్నారు. వరి పంట వేసేందుకు పెట్టే పెట్టుబడి, నీటి లభ్యత, వర్షాలు, భూగర్భ జలాలు, కూ లీల పెట్టుబడి అన్నింటిని రైతు లకు వివరించి చెప్పి వరి పంట జోలికి వెళ్ల కుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పిం చాలని ఆదేశించారు.

    గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేం ద్రం శివారులో వరి సాగుకు భూములు సిద్ధం చేసుకుంటు న్న రైతులు మోహన్, పరశురాం, ఖాదర్ తదితరులతో మా ట్లాడారు. వరి పంటకు సాగునీటి అవకాశాలే లే వని, అలాం టప్పుడు వరి ఎందు కు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్ర శ్నిం చారు. బలవంతంగా వరి సా గు చేస్తే నష్ట పోవలసి వస్తుం దని రైతులతో చెప్పారు. ఆరతడి పం టలు వేసుకుంటే న ష్టం లేకుండా, ఆదాయం వస్తుందని తెలియజే స్తూ ఆరుత డి పంటలపై అవగాహన కల్పించారు.

    ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సంవ త్సరం వర్షాలు కురిసే అవ కాశం లేదని, వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు వర్షాలు కురిసే అవ కాశం లేనందున ప్రస్తుతం వరి వేసుకునేం దుకు పరిస్థితులు అనుకూలంగా లేవని, అంతేకాక ప్రాజెక్టుల నుండి కూడా సా గునీరు వచ్చే అవ కాశం లేదని, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రా జెక్టుల నుండి కూడా సాగునీరు రాదని, వర్షం లేకపోవడం, ప్రాజెక్టుల ద్వారా సాగునీ రు లేకపోవడంతో భూగర్భ జలా లు అడుగంటిపోయి బోర్లలో నీ రు తగ్గిపోయిందని తెలిపా రు. వీ టన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంట వే సుకోవద్దని, అనవసరంగా ఇబ్బందులు పడవద్దని అన్నా రు. వరి పంట వేసు కున్నట్లయితే మధ్యలోనే పంట ఎండి పో తుందని,ఇదివరకే చాలా చోట్ల బోర్లలో తక్కువ నీరు వ స్తు న్నదని,వరి పైన పెట్టిన పె ట్టుబడి కూడా రైతుకు గిట్టుబా టు కాదని ,వరి పంట స్థానంలో ఆరుతడి పంటలు వేసుకో వాలని,సెప్టెంబర్ చివరివరకే ఆరుతడి పంటలు వేసుకునేం దుకు అవకాశం ఉందని తెలిపారు.

    తిప్పర్తి మండల కేంద్రం శివారు లో చౌడు భూముల్లో రైతు లు వరి పంటకు సిద్ధం చేయడాన్ని గ మనించిన కలెక్టర్ చౌ దు భూముల్లో మిను ములు, పెసర వంటి పంటలు వేసుకో వాలని, మి ను ము, పెసర పంటలకు పెట్టుబడి తక్కువని, ఎకరాకు 8000 చొ ప్పున ఆదాయం వస్తుందని, అ దే వరి పంటకు పెట్టుబడి ఎ క్కువని, పొరపాటున నీళ్లు లేక, వర్షం రాక పెట్టిన పెట్టుబడి కూ డా రాక రైతు అప్పుల పాలు కా వాల్సి వస్తుందని అన్నా రు. చవుడు భూములలో జిప్సం వేసుకున్నట్లయితే మిను ము, పెసర పంటల లాంటివి సు లభంగా తీసుకో వచ్చని, అంతేకాక చౌడు నెలల్లో రేగు, కూ రగాయలు, ఇతర ఉ ద్యా న పంటలు కూడా వేసుకు నేందు కు అవకాశం ఉందని, ఈ దిశగా రైతులు ఆలోచించి ఆరు తడి పంటలు ,ఉద్యాన పం టలు వేసుకునేలా చూడా ల్సిం దిగా ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

    వ్యవసాయ అధికారులు వారి ప రిధిలోని ప్రతి రైతును ప్ర త్యక్షంగా కలిసి పంట వివరాలను తెలుసు కొని వరి పంట సాగు చేయవద్ద ని, వరి పంట సాగు చేయడం వల్ల కలిగే నష్టాలను లెక్కలతో స హా వివరిం చాల్సిందిగా కలెక్టర్ ఆ దేశించారు. రైతులు యూరియా గురించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ అన్ని షాపులలో యూరియా దొరికే విధంగా అవ కాశం కల్పించాలని, యాప్ ద్వా రా యూరియా బుక్ చేయడం వల్ల వెంటనే స్టాకు అ యిపోతు న్నదని కలెక్టర్ దృష్టికి తీసుకువ చ్చారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ యూరియా ఇండెంట్ పంపాల్సిందిగా జిల్లా వ్యవసా య అధికారి వినోద్ కు మార్ ను ఆదేశించారు. వ్యవసాయ సహా య సంచాలకులు విజయేందర్ రెడ్డి, సన్నీ రాజ్, గిరి రాజు ,ఏవో శ్రీనివాస్, ఏఈఓ సంతోషి, తది తరులు జిల్లా కలెక్టర్ వెంట ఉ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.