Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, సమస్యల రహిత మున్సి...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, సమస్యల రహిత మున్సి పాలిటీలు,పంచాయతీలుగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ ధ్యేయo 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నకిరేకల్ : అన్నివర్గాల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన, ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యచరణను అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవ ర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గస్థాయి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సన్నాహక కార్యక్రమంలో మాట్లాదడారు.

    రాష్ట్ర ప్ర భుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ భాగస్వాములు అయ్యేలా ప్ర జాపా లన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మొదటి 15 రోజులు అన్ని గ్రామపంచాయతీలు, మున్సి పా లిటీలలో పారి శుద్ధ నిర్వహణ చేపట్టాలని, అదేవిధంగా అ న్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ కార్యక్రమా న్ని చేపట్టాలన్నారు.

    సమస్యలు లేని మున్సిపాలిటీలు, గ్రామపంచా యతీలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకు గ్రామ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు సమా వేశాలు ఏర్పాటు చేసుకొ ని పారిశుద్ధ్య సమస్యలు, ఇతర సమస్యలపై సమీక్షించుకో వాలన్నారు.వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ల బ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించాలని, ఇందుకు ఎం పీడీవోలు, తహసిల్దారులు ముందుగానే నివేదిక సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

    ఉగాది సందర్భంగా సామూహిక గృహప్రవేశాలు చేసేందుకు ఎక్కడైనా చివరి ద శలో ఉన్న ఇందిర మ్మ ఇండ్లను వే గవం తం చేసి పూర్తి చేయాలని క లెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ని డంపింగ్ యార్డులు, పార్కులను వినియోగంలోకి తీసు కురావాలని అన్నారు. పాఠశాల లు, హాస్టళ్లు, ఇతర సంస్థల లో ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలని కలె క్టర్ చెప్పారు.

    నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రా ష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ప థకాలను ప్రజల కు మరింత సమర్థంగా చేరవేయడానికి 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ని ర్వ హిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్ర జాప్ర తినిధులు సమన్వయంతో పనిచే సి విజయవంతం చే యాలని కోరారు.

    పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభు త్వం ప్ర జలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కా ర్డులు, మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేకంగా రోజులు కేటాయించి ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరా జ్యం సాధించాలన్నదే ము ఖ్య మంత్రి లక్ష్యమని, సంకల్పంతో పని చే స్తే ప్రతి కార్యక్ర మం విజయవంత మవుతుందని, అధికారులు మరి యు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచిం చారు.

    నకిరేకల్ నియోజకవర్గంలో గంజాయి సమస్య ఎక్కు వగా ఉండేదని, ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశామని యు వత తప్పుదారి లో పడకుండా అందరూ కలిసి చర్యలు తీ సు కోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమ స్యను పరిష్కరించేందుకు క ట్టుబడి ఉన్నామని అన్నారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆ సుపత్రిని త్వరలో ప్రా రంభించనున్నామని వెల్లడించారు.

    జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా “సురక్షితంగా చేరుకోండి”, యువత డ్ర గ్స్ బారిన పడకుండా పోలీస్ శాఖ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ప్రతిని త్యం అనేక మంది మరణిస్తున్నారని, 2024లో జిల్లాలో 40 0 రోడ్డు ప్రమాదాలు జరిగితే 2025లో దానిని 360కు తగ్గిం చామని, ఇందులో 50శాతం 2 వీలర్ పై వెళ్తున్న వారే చని పోయారని, అది 90 శాతం హెల్మెట్ లేనందువల్లే చనిపో యారన్నారు.

    హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మన రక్ష ణమన బాధ్య తని అన్నారు. నల్గొండ జిల్లాలో 2 023లో 59 బ్లాక్ స్పాట్స్ గుర్తించ గా 2025 నాటికివాటిని 31 తగ్గించామని, ప్రజాపా లన- ప్రగతి ప్రణా ళికలో భాగంగా వెంటనే గ్రామస్థాయిలో రహదారి భద్రత కమిటీ ల ను ఏర్పాటు చేసుకొని ప్రమాదా లు జరిగేందుకు ఆస్కారం ఉన్న రహదారులు, రోడ్డు ప్రమా దాల విషయాలపై చర్చించాలన్నారు.

    గంజాయి నివారిం చడంలో పూర్తి సహకారం అందించాలని, గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా సమా చారం తెలిస్తే తక్షణమే 8712670266 నంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలని, గత సం వత్సరం జిల్లాలో 53 గంజాయి కే సులు నమోదు చేశామని తెలిపారు.

    స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు క లెక్టర్, నల్గొండ ఆర్ డి ఓ అశోక్ రె డ్డి, కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించగా, అంతకు ముందు వైద్య ఆరోగ్య, వ్యవసాయం ,గ్రామీణభివృద్ధి, మె ప్మా, హౌసింగ్, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అ ధి కారులు ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళికలో చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రజలకు కల్పించే లబ్ది అవగాహన పై వివరిం చారు. ఈ సమావేశానికి నకిరికల్, చిట్యాల మున్సిపల్ చై ర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వా ర్డుసభ్యులు, ఎంపీడీవోలు, తహసిల్దారులు, ప్రత్యేక అధికా రులు తదితరులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.