Nalgonda Wine shop theft : ప్రజా దీవెన, నల్లగొండ టౌ న్: నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గూడ రోడ్‌లో ఉన్న మహాలక్ష్మి వైన్ షాప్‌లో జరిగి న దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ.1, 77,000 నగదుతో పాటు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసు కున్నట్లు వన్ టౌన్ సీఐ ఏ. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నింది తుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మంగళవారం ఆయన ఏ ర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు.
జిల్లాను నేర రహితంగా తీర్చిది ద్దా లనే లక్ష్యంతో జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో “నేను సైతం” కార్యక్ర మం ద్వారా వ్యాపార సంస్థలు, షాపులు మరియు కా లనీల లో సీసీటీవీ కెమెరాలు ఏ ర్పాటు చేసుకోవాలని ప్రజలకు అ వగాహన కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దొంగతనాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పలు మార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడిం చారు.
ఇలాంటి చర్యల ఫలితంగా గతేడా ది డిసెంబర్ 7వ తేదీన రాత్రి మహా లక్ష్మి వైన్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి సుమా రు రూ.5 లక్షల నగదు దొంగిలించిన ఘటనపై యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భా గంగా షాప్‌లో ఏ ర్పాటు చేసిన సీ సీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీ లించగా, గతంలో పలు వైన్ షాపు ల్లో దొంగతనాలు చేసిన అంతరా ష్ట్ర నేరస్థుడు కుమ్మరి నర్సింహా రా వు అని గుర్తించారు. జి ల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ రోజు ఉదయం దేవరకొండ రో డ్‌లో అనుమానాస్పదంగా తిరు గుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని వి చారించగా, నల్గొండ పట్టణంలోని మూడు వైన్ షాపుల్లో దొం గతనాలు చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అనంతరం మ హాలక్ష్మి వైన్ షాప్ దొంగతనానికి సంబంధించిన రూ.1,77,0 00 నగ దు మరియు ఒక సెల్ ఫోన్‌ను స్వా ధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి వివరాలు
కుమ్మరి నర్సింహా రావు (35), తండ్రి అంజయ్య, వృత్తి కుక్ మాస్టర్. స్వస్థలం వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్య ద్ మల్కాపూర్ గ్రామం. ప్రస్తుతం గుంటూరు జిల్లా బెల్లంకొం డ మండలం మచ్చయ పాలెం గ్రామంలో నివసిస్తున్నాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప లు పోలీస్ స్టేషన్ పరిధి లో మూడు దొంగతనాలు చేసి జైలుకువెళ్లి బెయిల్‌పై బ య టకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
అనంతరం పోలీ సు లు గుర్తించే అవకాశం ఉందని భావించి తెలంగాణ రాష్ట్రం లో దొంగతనాలు ప్రారంభించినట్లు తెలి పాడు. ఈ కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వన్ టౌ న్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఎ స్ఐలు స తీష్, లచ్చిరెడ్డి, వెం కటనారాయణతో పాటు సి బ్బంది అంజయ్య, రబ్బానీ శ్రీను లను డీ ఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారు.
