Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, వరి కొయ్యలను కాల్చకుండా...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, వరి కొయ్యలను కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాo 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులు వ రి పంట కోసిన తర్వాత పొలంపై ఉ న్న వరి కొయ్యలను కాల్చడం వ ల్ల అనేక దుష్పరిణామాలు సంభవి స్తాయని, అందువల్ల ఎవరు వరి కొయ్యలను తగల బెట్టవద్దని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తిచేశారు. శుక్ర వారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న గిరక బావి గూడెంలో రైతులు వరి కొయ్యల ను పొలంపైనే తగల బెడుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి రైతులతో మా ట్లాడారు. వరికోయ్యలు తగలబెడితే భూమి సారవంతం కో ల్పోతుందని, అనంతరందుక్కి దున్నినప్పటికీ గుల్లగా మా రదని, దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుందన్నారు. సాంద్రత పెంచుకు నేందుకు అధిక ఎరువులు వాడాల్సి వస్తుందని ఆ భారం కూడా రైతులపైన పడుతుందన్నారు.

    వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు, రహదారులపై వెళ్లే వాహనదారులకు కూడా ఇబ్బం దులు ఏర్పడతా యని, వరి కొయ్యల వల్ల పక్కన ఉన్న చె ట్లు, ఇతర విలువైన వస్తు వులు పరికరాలు తగలబడే అవ కాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఎట్టి పరిస్థితు లలో వరి కోయ్యలను తగలబెట్టవద్దన్నారు. ఇటీవ ల కాలంలో జిల్లా లో వరికొయ్యలను తగలబెట్టడం వలన ప్రాణాపాయం సంభవించిన విషయాలను ఆయన గుర్తు చే శారు. రైతులు వరికొయ్యలను తగలబెట్టకుండా ఉండేందు కుగాను వ్యవసాయశాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మా ట్లాడుతూ వరి కొయ్యల ను పొలం పైన తగలబెట్టడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే కా కుండా, భూములు సారవంతం కో ల్పోతా యని, అందువల్ల ఎవరు త గలబెట్టవద్దని చెప్పారు. ఎవరై నా ఇలా వరికొయ్యలు తగలబెట్టడం వల్ల ప్రమాదాల సంభ విస్తే అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామ ని ఆయన హెచ్చరించారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రవ ణ్, తదితరులు జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంట ఉన్నారు.

    ఆసుపత్రిలో సత్వర సేవలకు కృషి చేయాలి

    ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా సత్వర సేవలందించేందు కు డాక్ట ర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నారు. శుక్రవా రం తన చాంబర్ లో ప్రభుత్వ ప్ర ధాన ఆసు పత్రి పని తీరుపై ఆయ న జిజిహెచ్ పర్యవేక్షకులు నేత న రసింహారావు ,డి సి హెచ్ ఎస్ డాక్ట ర్ మాతృ ,జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ లతో సమీ క్షించారు.

     

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న మానవనరులు, వైద్య పరిక రాలు, ఇతర సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గల కార్యాచ రణను రూపొందించాలని , ఆస్పత్రిలోని అన్ని విభాగాల ద్వారా సత్వర సేవలతో పాటు మె రుగైన వైద్య సేవలు అం దించాల్సి ఉందని అన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లోని వి వి ధ విభాగాలలో అవసర మైన వై ద్య సామాగ్రి కొనుగోలుకుగాను ప్ర తిపాదనలు సమర్పించాలని ఆ దే శించారు. అల్ట్రా సౌండ్,స్కానింగ్, ఇతర పరీక్షల సమయం లో రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా సాధ్యమై నంత త్వరగా పంపించేందుకు గల పద్ధతులను పరి శీలిం చాలని, అనవసరంగా కా ల యాపన చేయకుండా వచ్చిన పే షెంట్లకు పరీక్షలు నిర్వహించి అ వ సరమైన పరీక్షల ద్వా రా వారికి ఉ న్న జబ్బులను తెలియజేసి ఖ చ్చి తమైన చికి త్స అందించేందుకు కృ షి చేస్తే ప్రభుత్వ ఆసుపత్రి పై ప్ర జ లకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు.

    ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలకు సంబంధిత వై ద్య నిపుణులతో మాట్లాడి అవసరమైన సామాగ్రిని తెప్పిం చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు గాను తక్షణమే ప్రతిపాదనలు రూ పొందిం చి రాష్ట్రస్థాయికి పంపించేందు కు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రి అభివృ ద్ధి సంస్థ క మిటీని క్షణమే ఏర్పాటు చే యాలని ఆదేశించా రు. డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదిత రులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.