–బాలల రక్షణ, చెడు వ్యసనాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిం చాలి
–జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: బాలలు నేరాల బాట పట్టకుండా, చెడు వ్యసనా లకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయా లని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశే ఖ ర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పి లుపునిచ్చారు. బాలల రక్షణ, బాల నేరాల నియం త్రణ, మత్తు పదార్థాల వినియోగం నివారణ, బాలల హక్కుల పరిరక్షణకు పటి ష్టమైన కార్యాచరణ రూపొందిం చి అమలు చేయాలని అధికారు లకు సూచించారు.నల్లగొండ జి ల్లా పోలీస్ కార్యాలయంలో గు రువారం బాలల రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ శాఖల అ ధికారులతో నిర్వహించిన సమ న్వయ సమావేశంలో బాలలు నే రాల వైపు మళ్లడానికి గల కార ణాలు, చెడు వ్యసనాలకు అ ల వాటు పడుతున్న పరిస్థితులు, వాటిని నియంత్రించేందుకు తీ సుకోవాల్సిన చర్యలపై విస్తృతం గా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖ ర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు బాలల విద్య, ఆరో గ్యం, సంక్షేమం, రక్షణ కోసం అ మలు చేస్తున్న పథకాలు అర్హులై న ప్రతి చిన్నారికి చేరేలా సంబం ధిత శాఖలు కృషి చేయాలని ఆ దేశించారు. పాఠశాలల్లో విద్యా ర్థులకు చదువుపై ఆసక్తి పెంపొం దించడం, మధ్యలో చదువు మా నేసిన పిల్లలను తిరిగి బడుల్లో చే ర్పించడం, అవసరమైన కౌన్సె లింగ్, వైద్య, మానసిక సహాయం అందించడం ద్వారా బాలలను నేరాలకు దూరంగా ఉంచవచ్చని పేర్కొన్నారు. బాలల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలని సూచించారు.
జిల్లాలో బాలల నేర సంబంధిత కేసుల్లో 130 మంది
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ చిన్న వయస్సు లోనే కొందరు పిల్లలు దొంగతనా లు, మద్యం, గంజాయి వంటి మ త్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు వివిధ నేరాల్లో భాగస్వాములవుతు న్నారని తెలిపారు. జిల్లాలో సు మారు 130 మంది బాలలు వివి ధ నేరాలకు సంబంధించిన కేసు ల్లో ఉన్న నేపథ్యంలో, వారు నే రాల వైపు మళ్లడానికి గల సా మాజిక, కుటుంబ, ఆర్థిక, మాన సిక కారణాలను లోతుగా విశ్లేషిం చాల్సిన అవసరం ఉందన్నారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, కుటుంబ కలహాలు, పేదరికం, చె డు స్నేహాలు, సామాజిక మాధ్య మాల ప్రభావం, మత్తు పదార్థాల సులభ లభ్యత, పాఠశాలలకు దూరమవడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి ని వారణకు కార్యా చరణ చేపట్టాలని సూచించారు.
బాలలకు భద్రమైన వాతావరణం కల్పించాలి
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనిసెఫ్ చైల్డ్ ప్రొటె క్షన్ సిస్టమ్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ ఇసిడోర్ ఫిలిప్స్ మాట్లాడు తూ బాలలను హింస, దోపిడీ, బాల కార్మికత్వం, చెడు వ్యసనా లు, నేర ప్రవృత్తులు, ఇతర ప్ర మాదాల నుంచి రక్షించడం సమా జంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అ ని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు సమష్టిగా పనిచేస్తూ పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూ చించారు.
బాలలు నేరాలకు పాల్పడిన సం దర్భాల్లో కేవలం శిక్షాత్మక చర్య లకే పరిమితం కాకుండా, వారి వ యస్సు, కుటుంబ పరిస్థితులు, విద్య, మానసిక స్థితి, సామాజిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసు కుని బాల న్యాయ చట్టాల ప్రకా రం తగిన మార్గనిర్దేశం చేయాల ని తెలిపారు. విద్య, నైపుణ్యాభి వృద్ధి, కుటుంబ సహకారం, కౌన్సె లింగ్ ద్వారా వారు తిరిగి నేరాల బాట పట్టకుండా, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎ స్పీ రమేష్, జడ్పీ సీఈఓ ప్రేమ్ క రుణ్ రెడ్డి, డీఎస్పీలు శివరాం రె డ్డి, రవి, శ్రీనివాస్ రావు, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, యువజన, క్రీడల శాఖ, పంచాయతీరాజ్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. బాలల రక్షణ, బాల నేరాల నియంత్రణకు చేపట్టా ల్సి న సమన్వయ చర్యలపై చర్చిం చారు.

