Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Goud Committee : నల్లగొండలో గౌడ శంఖారావం, పా తబస్తీలో నూతన కమిటీ...

    Nalgonda Goud Committee : నల్లగొండలో గౌడ శంఖారావం, పా తబస్తీలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    📰 Generate e-Paper Clip

    Nalgonda Goud Committee : ప్రజా దీవెన నల్లగొండ టౌన్:నల్లగొండ పాతబస్తీ గౌడ సంఘం చరిత్రలో ఒక నూత న అధ్యాయం లిఖించబడింది. ఐక్యత, సేవే లక్ష్యాలుగా నూతనంగా ఎన్నికైన క మిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్స వంతో పాటు కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమం స్థానిక గౌడ సంఘ భవనం వేదికగా అత్యంత వైభవంగా, ఉత్సాహభరి త వాతావరణంలో నిర్వహించబడింది.

    ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌడసంఘం పెద్ద లు బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ సమాజంలో మా ర్పు కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చా రు.ప్రతి వార్డులో గౌడ సంఘ కమిటీలను బలోపేతం చేయ డం ద్వారానే మన ఐక్యత చాటగలం. సామాజిక సేవా కా ర్యక్రమాల్లో మనమే ముందుండాలని ఆయన దిశానిర్దేశం చే శారు.

      కూడలిలో పాపన్న గౌడ్ విగ్రహం

    మరో ముఖ్య నేత తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ వీర త్వానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్ర హాన్ని పట్టణంలోని ప్ర ధాన కూడలిలో త్వరలోనే ఏర్పాటు చేస్తామని సగర్వంగా ప్రకటిం చారు. ఈ ప్రకటనతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగింది.

    భవనానికి అండగా ‘కందుల’ కుటుంబం

    సమాజ శ్రేయస్సు కోసం దివంగత కందుల యాదగిరి గౌడ్ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు సతీ మ ణి కందుల నిర్మలమ్మ గౌడ్, కు మారులు బాలరాజు గౌడ్, రమణ గౌడ్) ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గౌడ సంఘ భ వన నిర్మాణానికి తమ వంతుగా పూర్తి సహకారాన్ని అంది స్తామని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

       నూతన కమిటీ సారథులు వీరే

    భవిష్యత్తు ప్రణాళికలతో బాధ్య తలు స్వీకరించిన నూతన కార్య వర్గంలో అధ్యక్షుడుగా పెద్దగోని సురేష్ గౌడ్, ఉపాధ్య క్షునిగా బోయపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ముఖ్య స భ్యులుగా పుల్లెంల రాము గౌడ్, చెన్నగోని లింగస్వామి గౌడ్, బోయ ప ల్లి మధు గౌడ్, కొమ్మగోని సతీష్ గౌడ్, ఐతగోని రమేష్ గౌడ్, వాయుల నాగరాజు గౌడ్, అనంతల యాదగిరి గౌడ్, ఐతగో ని గణేష్ గౌడ్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు.

    ఈ వేడుకలో గౌడ సామాజికవర్గ కార్పొరేటర్లు రేగట్టే అండా లు లింగ స్వామి గౌడ్, గోపగోని స్వాతి రాజ శేఖర్ గౌడ్, పా లకూరి సుమలత సంతోష్‌ గౌడ్‌లతో పాటు స్థానిక కా ర్పొరే టర్ గుండబోయిన పుష్పలత వెంకన్న యాదవ్, అక్కనపల్లి రేవ తి, బలరాం, మామిడి కార్తీక్ తది తరులు పాల్గొన్నారు.

    అలాగే పెద్దలు తండు సైదులు గౌడ్, పుల్లెంల యాదగిరి గౌ డ్, సురిగి వెంకన్న గౌడ్‌లు నూతన కమిటీని అభినందిం చా రు. ఈ కార్యక్రమంలో పాత బస్తీకి చెందిన యువకులు, మ హిళలు మరియు గౌడ సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పా ల్గొని, నూతన కమిటీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.