Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda MG University : ఎంజి యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కీలక వ్యాఖ్య,...

    Nalgonda MG University : ఎంజి యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కీలక వ్యాఖ్య, దేశాభివృ ద్ధికి విద్యాలయాలే దీపస్థంబాలు 

    📰 Generate e-Paper Clip

    Nalgonda MG University : ప్రజా దీవెన, నల్లగొండ: తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రా రంభించిన “ప్రజా పాల న–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా న ల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో వారం రో జు ల పాటు నిర్వహించిన విద్యావారోత్సవాలు ఆదివారం ఘ నంగా ముగిశాయి. ఈ ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్ర సంగిస్తూ క్రమశిక్షణ, దక్ష త, బాధ్యతాభావంతో ప్రతి బోధ నే తర సిబ్బంది, అధ్యాప కులు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో తమవంతు పాత్ర పో షించాలని పిలుపునిచ్చారు.

    విద్య ద్వారానే వ్యక్తి, కుటుంబం, సమాజం రూపాంతరం చెందుతుందని, గ్రామీణ ప్రాంతాల సాధారణ విద్యార్థికి కూ డా నాణ్యమైన ఉన్న త విద్య అందే విధంగా సంస్థాగత ప్ర ణాళికలను అమలు చేస్తున్నామ ని ఆయన తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన విశ్వవిద్యాలయ దీర్ఘకాలిక ప్రణాళిక ను విడుదల చే సి సభికులకు వివరించారు. విశ్వ విద్యాల యం స్వల్ప, దీర్ఘకాల ఇ న్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా కొత్త కళాశాలలు, హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులు, స్కి ల్ డెవ ల ప్‌మెంట్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రా లు, లైబ్రరీ మరి యు ఇంజినీరింగ్ విభాగ విస్తరణ వంటి పలు మౌలిక వస తుల అభివృద్ధి పనులను దశ లవారీగా అమలు చేస్తున్న ట్టు వైస్ ఛాన్సలర్ వివరించారు.

    బోధనలో ఔట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ , నూతన పాఠ్య విధా నాలు, రి మీడియల్ టీచింగ్, మెంటరింగ్ సిస్టమ్, పరిశోధ నోత్సాహం, నాణ్య మైన విద్యార్థి ప్రాజెక్టులు, డాక్టరల్ రీసె ర్చ్ మెరుగుదలకు ఉపాధ్యా యులు కీలక పాత్ర పోషించా లని, నాన్-టీచింగ్ సిబ్బంది పారదర్శక పరిపాలన, రికార్డు నిర్వహణ, వి ద్యార్థి సేవల బలోపేతంలో కేంద్రీయ భాగస్వా ములని ఆయన పే ర్కొన్నారు.

    తల్లిదండ్రులు, పూర్వ విద్యా ర్థులు, స్థానిక ప్రజాప్రతినిధు లు, మీడియా వంటి స్టేక్ హో ల్డర్ల తో సమన్వయాన్ని బలో పేతం చేసి, గ్రామీణ, వెనుకబ డిన వర్గాల విద్యార్థులు ఉన్న త విద్యా ఫలాలను సద్విని యోగం చేసుకునేలా వి శ్వవి ద్యాలయం సంకల్పతో ముం దుకు సాగుతోందని ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య కొప్పుల అంజిరెడ్డి స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డా హరీష్ కుమార్, డా శ్రీని వాసరెడ్డి, ఎస్ఓ బేగ్, శ్రీహరి, తది తరులు పాల్గొన్నారు.

    ఎంజీయు రసాయన శాస్త్ర అధ్యాపకుడు కర్ర అమరేం దర్ కు డాక్టరేట్

    గ్రామీణ, పేదరిక కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కష్టా ల ను తట్టుకుని శ్రద్ధ, పట్టుదలతో విద్యను ఆయుధం గా మార్చుకుని, నల్లగొండ జిల్లా చిన్న సూరారం గ్రామానికి చెందిన కర్ర అమరేందర్‌ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ర సాయన శాస్త్ర విభాగం పీహెచ్‌డీ ప ట్టాను ప్రదానం చేసిం ది.“డిజైన్ అండ్ మైక్రోవేవ్ అసిస్టెడ్ సింతెసిస్ అఫ్ హేటేరోసై క్లిక్ కాంపౌండ్స్ కంటై నింగ్ ఎన్ , ఎ స్ అండ్ ఓ ఆటోమ్స్ – డాకింగ్ స్టడీస్ విత్ బయాలజి కల్ ఇవాల్యుయేషన్ ” అనే అం శంపై డా. ఎం. రాధిక అసోసియేట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో అమరేందర్ విజయవంతంగా తన పరిశోధన ప్రబంధాన్ని పూర్తిచేశారు.

     

    నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, అనంతరం ఉస్మా నియా విశ్వవిద్యాలయం నుంచి ఇనార్గానిక్ కెమిస్ట్రీ లో పీజీ చేసిన అమరేందర్, ప్రస్తుతం మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయంలో కెమి స్ట్రీ విభాగం‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)గా సేవలందిస్తున్నారు. తమ పీహెచ్‌డీ పరిశోధ నలో ఆయ న మైక్రోవేవ్‌ ఆధారిత గ్రీన్ కెమిస్ట్రీ పద్ధతుల ద్వారా వేగంగా, అధిక ది గుబడితో కొత్త హెటరోసైక్లిక్ సం యోగాలు సిద్ధం చేసి, కంప్యూటేష నల్ (డాకింగ్) అధ్యయ నాలు మరి యు ప్రయోగాత్మక జీవక్రియాత్మక ఫలితాల మ ధ్య భరోసా కలిగించే సంబంధాన్ని నిరూపించారు.

    అభివృద్ధి చేసిన సంయోగాల డ్రగ్స్ -లైక్నెస్ , ఏ డి ఎం ఈ లక్షణాలను శాస్త్రీయంగా స్థాపించి, ప్రస్తుత ప్రామాణిక ఔష ధాలకంటే సమానమై న లేదా మెరుగైన క్రియాశీలత చూ పిన మాప్ కైనేజ్ లక్ష్యంగా ఉండే పలు లీడ్ కంపౌండ్స్‌ను గుర్తించారు. సమాజ హితమైన ఈ పరిశోధన చిన్న సూరా రం గ్రామం, ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులకు కష్టపడి చదివితే ఉ న్న త స్థాయిలో పరిశోధనల వరకూ ఎ దగవచ్చని స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలుస్తోంది.ఈ సం దర్భంగా ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తా ఫ్ హుస్సేన్ మరియు రిజిస్ట్రార్ ఆ చార్య కొప్పుల అంజిరెడ్డి అభినం దించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.