Nalgonda police Smart operation: ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా పోలీసుల విజిలెన్స్‌కు మరో భారీ వి జయం దక్కింది. అర్ధరాత్రి సమయంలో హైవేలపై ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలనే లక్ష్యం గా చేసుకుని డీజిల్ దొంగ తనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ స్పెషల్ ఆపరేషన్ లో మొ త్తంగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా వారిలో ఒక రు మైనర్ కావడం గమనార్హం. వీరి వద్ద నుంచి 1000 లీట ర్ల డీజిల్, 2డిసిఎం వాహనాలు, 6 మొబైల్ ఫో న్లు, వడ్లపట్టా లు కలిపి మొత్తం వి లువ సుమారు రూ. 40 లక్షలను స్వా ధీన పర్చుకున్నారు.
ఈ మేరకు నల్లగొండ జిల్లా అడిషన ల్ ఎస్పీ రమేష్ శనివా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వి వరాలు ఇలా ఉన్నా యి. అర్ధరాత్రి ఆగిఉన్న వాహనాలే ల క్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పా ల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.ముఠా స భ్యులపై గతంలో తెలుగు రాష్ట్రాలలో 20కి పైగా డీ జిల్ దొం గతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
నల్లగొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు మరియు ఇ తర హైవే లపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్ర క్కు లు మరియు ఇతర భారీ వాహనాల నుండి వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ ఆదేశాల మేరకు డీజిల్ దొంగతనాలను అరికట్టేం దుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
దానికి అనుగుణంగా నల్లగొండ డిఎ స్పి శివరాంరెడ్డి ఆధ్వ ర్యంలో సి సిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, చిట్యాల సిఐ నా గరాజు పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైవే ల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో గస్తీ పెంచడం జరి గిందన్నారు.ఈ క్రమంలో ఈ నెల 10 వ తేదీన రాత్రి సమ యంలో చిట్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై అనుమా నాస్పదంగా నిలిపి ఉంచిన ఒక డి సిఎం వాహనాన్ని పోలీ సులు గమనించారు.
అందులోని వాహనాన్ని తనిఖీ చేయగా వడ్లపట్టాల చాటు న డీజిల్ తో నిండిన క్యాన్లు దాచి పెట్టినట్లు గుర్తించారు. మొత్తం సు మారు 400 లీటర్ల డీజిల్ అక్కడ లభించింది.. అందులో ఉన్న డ్రైవర్ బాలకృష్ణ మరియు ఇతరులను అ దుపులోకి తీసుకొని విచారణ జ ర పగా హైవేపై ఆగి ఉన్న గుర్తు తెలి యని లారీల నుండి డీజిల్ దొంగ తనం చేసినట్లు ఒప్పుకున్నారు.
అలాగే తమ ముఠాకు చెందిన మ రికొంత మంది సభ్యులు మరో డి సిఎం వాహనంతో కొంత దూరంలో ఉన్నట్లు సమా చారం ఇచ్చారు. దీ నిపై వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి రెండవ డిసి ఎం వాహనాన్ని కూడా గుర్తిం చి, దానిలో మిగతా డీజిల్ మొత్తం 6 గురు ముఠా సభ్యుల ను అదుపు లోకి తీసుకోవడం జరిగింది.
పోలుసులు చాకచక్యంగా వ్యవ హరించి అరెస్ట్ చేసిన నిo ధితుల్లో ముడావత్ గాంధీ నాయక్( 36),ముడావత్ వెంకటే శ్వర్లు నాయక్ (45), బనావ త్ తుల్స్య నాయక్ (21), ము డావత్ బాలకృష్ణ నాయక్ (32), రామ వత్ వాగ్య నాయక్( 45)తో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నారు. కాగా నిందితు లందరూ ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
నిందితులు ముందుగా హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉ న్న లా రీలు మరియు ఇతర వాహనాలను లక్ష్యంగా ఎంచు కుంటారు. వాహ నాల డ్రైవర్లు నిద్రలో ఉన్న సమ యంలో వాహనంలోని డీజిల్ ట్యాంకులను తెరిచి డీజిల్‌ను దొంగి లి స్తారు. దొంగిలించిన డీజిల్‌ను త మ వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ట్యాంకుల్లో నింపుకుంటారు.ఆ తర్వాత ఎ వరికి అనుమానం రాకుండా అక్కడి నుండి త్వరగా వెళ్లిపో తారు.ఈ విధంగా వీరు చెడు వ్యాసనాలకు అలవాటు పడి సులువుగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి దొంగత నాలకు పాల్పడుతునట్లు గతంలో కూడాపలు జిల్లాల్లో డీజి ల్ దొంగతనాలకు పాల్పడి 20 కేసులకు పైగా నమోదైనట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ హైవే లపై ప్ర యాణించే ప్రజలు వాహనదారు లు, అనుమానాస్ప ద వ్యక్తులు లే దా డీజిల్ దొంగతనాలు గమనించి న వెంటనే Dial-100 ద్వారా పోలీ సులను సంప్రదించాలని కోరుతు న్నారు. చాలా సందర్భాలలో బాధి తులు వెంటనే ఫిర్యాదు చేయక పోవడం వల్ల నేరస్తులు తప్పించు కునే అవకాశాలు పెరుగుతున్నా యని తెలిపారు.
ఈ కేసులోని ముఠా సభ్యులను నల్గొండ డి.ఎస్.పి. కె.శివ రాం రెడ్డి పర్యవేక్షంలో పట్టు కోవడంలో ప్రతి భ కనపరిచిన నల్లగొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ లు ఎమ్.జితేంధర్ రెడ్డి, చం ద్రశేఖర్ రెడ్డి, చిట్యాల సిఐ నా గరాజు, చిట్యాల ఎస్.ఐ రవి కు మార్,సిసిఎస్ ఎస్ఐలు విజయ్ కుమార్, మధు, సతీష్ వర్మ, సిసి.ఎస్ హెడ్ కానిస్టేబు ల్స్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, వ హీద్ పాషా, శ్రీ ను,కానిస్టేబుల్స్, అస్రర్ దస్తాగిరి, సాయికు మార్, జూనేద్, శివరాజు, నరేశ్ సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎ స్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.


