Telangana State Prohibition Excise Department: ప్రజా దీవెన నిజామాబాద్: నిజా మాబాద్ డివిజన్‌కు చెం దిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తీసుకున్న ఒక నిర్ణ యం ప్రస్తుతం శాఖలోనే కాకుండా అధికార వర్గాల్లో చర్చ నీయాం శంగా మారింది. మూడు దశాబ్దాల సేవ అనంతరం, ఆత్మా భిమానాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావించి ఆయ న ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకో వడం అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ నిర్ణయానికి కా రణమైంది. ఉన్నతాధికారి సమక్షంలో జరిగిన సమా వే శం లో ఆయనపై అనుచి త వ్యాఖ్యలు చేయడం సోమిరెడ్డి ని తీవ్రంగా కలచివేసింది. “వెధవ, ఇడియట్” వంటి పదాల తో పదే పదే అవమానించబడటం ఆయనకు జీవితంలో ఎ న్న డూ ఎదురుకాని పరిస్థితి. అక్కడ ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది ముందే ఈ ఘటన జరగడం ఆయనకు మానసి కంగా తీవ్ర వేదన కలిగించింది.
సమావేశం అనంతరం సహచరులతో ఈ విషయం పంచు కున్న ఆయన, ఇలాంటి ప్రవర్తనను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సూచించారు. అయితే, సహచరుల మౌనం,భయం ఆయనను మరింత నిరాశ కు గురిచేసింది. ఆ మానసిక ఒ త్తిడితో ఆయన కుప్పకూలగా, మిత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భం గా తనకు అండగా నిలిచిన ఉన్న తాధికారులు, మిత్రులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.సోమిరెడ్డి అభి ప్రాయం ప్రకారం, “ఆత్మాభిమా నం లేకుండా జీవించడం క న్నా ఉ ద్యోగాన్ని వదిలేయడమే మంచిదని పెరిగిన విలువ లు, కాళోజి చెప్పిన “ఆకలితోనైనా చస్తాం కానీ ఆ త్మాభిమా నం వదులుకోలేం” అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
“చేతకాని, చైతన్యం కోల్పోయిన వ్యవస్థలో పనిచేయడం కంటే బయటకు రావడం ఉత్తమమని భావించిన ఆయన, కుటుంబ సభ్యు లతో చర్చించి ఈ తుది నిర్ణయానికి వచ్చా రు.మూడున్నర దశాబ్దాల సేవలో తనతో కలిసి పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నిర్ణయం తనకు సు లభం కాలేదని, తీవ్ర మానసిక సంఘర్షణ తరువాత తీసు కున్నదని ఆయన పే ర్కొన్నారు.ఈ సంఘటన ప్రభుత్వ వ్య వస్థల్లో ఉన్న పని సంస్కృతి, గౌ రవం, మరియు మానవీయ విలు వలపై కొత్త చర్చకు దారితీసే అవకాశముంది.
ఎక్సైజ్ శాఖలో ఉద్రిక్తత వాతావరణం
నిజామాబాద్ డివిజన్‌లో ఆబ్కారీ శాఖలో ఉద్రిక్తతలు రేగా యి. డి ప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డిపై ఆ శాఖ కమిషన ర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ ఘటనపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నే తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు నిష్ఠగా సేవలందించిన అధికారి సోమిరెడ్డిని అకార ణంగా దూషించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నా రు.
“వెధవ, ఇడియట్” వంటి పదజా లంతో అవమానించడం అధికార వ్యవస్థకు మచ్చగా నిలుస్తుందని అన్నారు. ఉద్యో గుల గౌరవాన్ని దె బ్బతీసేలా వ్యవహరిస్తున్న కమిష నర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసు కోవాలని వారు డిమాండ్ చేశా రు.ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా, మొత్తం వ్యవ హారంపై ప్ర త్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు.అన్‌పార్లమెంటరీ భాషతో ఉద్యోగు లను అవమానించడం సహించబో మని హెచ్చరించిన జేఏసీ నేత లు, ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయం చే యాలని విజ్ఞప్తి చేశారు.
