Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌ లో జిల్లా...

    Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ

    📰 Generate e-Paper Clip

    Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిపాలన, శాంతి భద్రతల నిర్వ హణ, నేర నియంత్ర ణ చర్యలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పని తీరును స మగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో నమోదై న వివిధ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కేస్ డైరీలు, పెండింగ్ కేసుల వివరాలు, కోర్ట్ డిస్పోజల్ రికార్డు లు, వారంట్ అ మలు స్థితి తదితర అంశాలను ఎస్పీ పరిశీ లించారు.

    క్రైమ్ ప్రాపర్టీ రూమ్‌లో భద్రపరిచి న కేసు సంబంధిత వస్తు వులు, స్వాధీనం చేసుకున్న సామగ్రి, వాహనాల నిర్వహణ ను తనిఖీ చేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. కోర్ట్ రికార్డ్ రూమ్ నిర్వహణను పరిశీలించి కే సు పత్రాలు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదే శించారు.స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, వాష్ రూమ్‌లు, మెన్ బ్యారేక్, సి బ్బంది విశ్రాంతి గదులు, తాగునీటి సదుపాయా లను పరిశీలించి సి బ్బందికి మెరుగైన వాతావరణం కల్పిం చాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కిట్, యూనిఫామ్, ఆ యుధాల నిర్వహణ, డ్యూటీ ని ర్వహణ తీరు, హాజరు పుస్తకాల ను కూడా పరిశీలించారు.

    శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, రాత్రి వేళ ల్లో బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ పార్టీలు నిరంతరం అప్ర మత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప ట్టణం లో రద్దీ ప్రాంతాలు, విద్యా సంస్థలు, బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకుల వద్ద పటిష్ట మైన బందోబస్తు ఏర్పా టు చేయాలని తెలిపారు. అనుమానిత వ్యక్తులు, అనుమా నాస్పద వాహనా లపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల క ద లికలపై నిరంతరం నిఘా ఉంచా ల ని, శాంతిభద్రతలకు భంగం కలిగిం చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూ చించారు.

    గంజాయి, డ్రగ్స్, జూదం, అక్రమ మద్యం, ఈవ్‌టీజింగ్, మైన ర్ డ్రై వింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలపై ప్రత్యేక డ్రై వ్‌లు నిర్వహిం చాలని ఆదేశించారు.మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతపై ప్ర త్యేక శ్రద్ధ వహించాలని, మహిళా సంబంధిత ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల విని యోగాన్ని మరింత పెంచి నేర నియంత్రణలో సాంకేతి కత ను సమర్థవంతంగా ఉపయో గించాలని తెలిపారు.ప్రజలతో మ ర్యాదపూర్వకంగా వ్యవహరించి స్టే షన్‌కు వచ్చే ప్రతి ఫి ర్యాదును వెంటనే నమోదు చేసి త్వరితగతిన పరిష్కరిం చాలని ఎస్పీ పేర్కొన్నా రు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్య క్ర మాల ద్వారా ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలని, గ్రా మాలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాల ని సూచించారు.

     

    పోలీస్ అధికారులు, స్టేషన్ సిబ్బం దితో సమావేశం నిర్వ హించిన ఎ స్పీ, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అం దించాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతి భ కనబరిచిన సిబ్బందికి రి వార్డ్ లు ప్రకటించారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్పి వెంట డిఎ స్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎ స్బి సీఐ ఆ దిరెడ్డి, డిసిఆర్బి సీఐ శ్రీ ను నాయక్, 2 టౌన్ ఎస్.ఐ సైదు లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

    ఈద్గాప్రాంగణాన్ని సందర్శించిన  ఎస్పీ

    నల్లగొండ : బక్రీద్ ప డుగను పు రస్కరించుకొని మునుగో డు రోడ్డు లో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ పరిశీలించారు. ప్రా ర్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశ ము న్న నేపథ్యంలో భద్రతా చర్య లు, ట్రాఫిక్ నియంత్రణ, పా ర్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాల పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ పండుగను ప్రశాంత వాతావ రణంలో జరుపుకునేలా పోలీస్ శా ఖ ప్రత్యేక చర్య లు చేపట్టిందని తె లిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన లు చోటుచేసుకోకుండా పో లీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తు న్నామని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరా రు. పండుగ సందర్భంగా సామరస్య వాతావర ణాన్ని కాపాడా లని, యువత సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచా రా లు, రెచ్చగొట్టే పోస్టులు చేయ కుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో నల్లగొండడిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బి సీఐ ఆది రెడ్డి, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చై ర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఆమేర్, కార్పొ రేటర్స్, ముస్లిం మత పెద్దలు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.