Special Chief Secretary Dana Kishore : ప్రజా దీవెన, చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యా నత ఇస్తున్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు. బుధవారం ఆ యన చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో జాతీ య గ్రామీణ ఉపాధి హామీ, జలశక్తి అభియాన్ జనసంచా య్, జన్ భాగీదారి కార్య క్రమాలను పరిశీలించారు. అం తే కాక ఉపాధి కూలీలతో మాట్లాడి పనులు ఎలా జరుగుతు న్నాయని? వేతనాలు సమయానికి అందుతున్నాయా? అ వసర మైన సౌకర్యాలు కల్పిస్తున్నారా? అనిఅడిగి తెలుసు కున్నారు. ఉదయం 7 గంటల నుంచి పనులు చేస్తున్నామ ని, రో జుకు సుమారు రూ.300 వరకు కూలి అందుతోందని మహి ళ కూలీలు తెలిపారు.
ఈ సందర్భంగా స్పెషల్ చీప్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇ స్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16.20 లక్షల మంది ఉ పాధి హామీ కూలీలు పనిచేస్తుండ గా, నల్గొండ జిల్లాలో 1.20 లక్ష ల మంది పనిచేస్తున్నారని అన్నారు. ఉపాధి కూలీల నమో దులో రా ష్ట్రంలో ముందంజలో ఉన్న నల్గొం డ జిల్లాను జి ల్లా కలెక్టర్ ను ఈ సం దర్భంగా ఆయన అభినందించా రు. మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వర కు వడ్డీ లేని రుణాలు అందించేలా ము ఖ్యమంత్రి ప్రత్యేక చ ర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
గ్రామపంచాయతీ భవనాల నిర్మా ణానికి రూ.870 కోట్లు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల నిర్వహణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్ని గ్రామపంచాయతీ భవనాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారు ల ను ఆదేశించారు. చిన్నకాపర్తి చెరువును పరిశీలించి,ఉపాధి పనుల్లో తీస్తు న్న మట్టిని రైతుల పొలాల్లో వేయడం వల్ల భూమి సారవంతం అవుతుందని తెలిపారు. గ్రామాల్లో తా గునీటి సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ నిధు లను విని యోగించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కా ర్మికులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించేలా ప్ర భుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకుడు గుం తల నిర్మాణంపై విద్యార్థులకు అవ గాహన కల్పించాలని , చిన్నకాపర్తి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీ ర్చిది ద్దాలని, ప్రస్తుతం ఉన్న 800 కు టుంబాల్లో ఉపాధి హా మీ కూలీల సంఖ్యను 500కు పెంచాలని చె ప్పారు. గ్రామ పంచాయతీ నర్సరీని సందర్శించి ద్రాక్ష, కాకర, చింత, అ శ్వగంధ, కరివేపాకు, నేరేడు, బా దం, రాగి, మామిడి వంటి మొక్క లను పరిశీలించారు. గ్రామంలో ర హదారులు, హెల్త్ సెంటర్, మహి ళా సంఘాల భవనాల నిర్మాణ పనులను కూడా పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశిం చారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ చిన్నకాపర్తి గ్రా మంలో ఉ పాధి పథకాల అమలుపై ప్రత్యేక చర్యలు చేప ట్టామని తెలిపారు. ఉ పాధి కూలీలకు తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు , టెంట్లు వంటి సౌక ర్యాలు కల్పిస్తున్నామని తెలిపా రు. ఉపాధి హామీ పథకంలో జిల్లా కు జాతీయ అవా ర్డు రావడం గర్వ కారణమన్నారు. జలసంచాయ్ జ న భాగీ దారి పథకంపై మే 11 నుం చి జూన్ 10 వరకు ఆరు నియో జకవర్గాల్లో నాలుగు బృందాలతో ప్రచార రథాలు తిరుగు తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహు లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధి కారి శేఖర్ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రే మ్ కరణ్ రె డ్డి, ఏపీ డి నరసింహా రావు, జిల్లా సమాక్య అధ్యక్షు రా లు మాధవి, గ్రామ సర్పంచ్ సుంద ర్ ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెంట ఉ న్నారు



