Monday, September 28, 2026
More
    HomeOpinionNalgondaCollecter IlaTripathi : జిల్లాకలెక్టర్ ఇలాత్రిపాఠి కీలకప్రకటన, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకప్రజావాణి

    NalgondaCollecter IlaTripathi : జిల్లాకలెక్టర్ ఇలాత్రిపాఠి కీలకప్రకటన, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకప్రజావాణి

    📰 Generate e-Paper Clip

     

    NalgondaCollecter IlaTripathi ప్రజా దీవెన, నల్లగొండ: దివ్యాంగుల సమస్యల పరిష్కారా నికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బు ధవారం ఆమె నల్గొండ జిల్లాలోని జిల్లా కేంద్రం లోని మేకల అభి న వ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహిం చి న దివ్యంగ క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

    జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పో టీలలో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శా రీరక సామర్ధ్యాలు పెంపొందించు కో వడంతో పాటు, ఆత్మవి శ్వాసం పెరుగుతుందన్నారు. సమాజంలోని అందరితో పాటు, ది వ్యాoగులకు సమాన అవ కాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్య మని , ఇందుకుగాను విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్య అ భివృద్ధివంటి రంగాలలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి రెవిన్యూ డివిజన్లు, మండలాలలో సమస్యలను ప్ర భుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మని, ఈ ప్రత్యేక ప్రజావాణిలో దివ్యాంగుల సమస్య లు పరిష్కరిస్తామని తెలిపారు. ది వ్యాంగుల సంక్షేమం కోసం బ్యాటరీ మోటార్ వెహికల్స్, పింఛన్ల ను ప్ర భుత్వం ఇస్తున్నదని, దివ్యాం గుల ఇతర సమస్యల పరి ష్కా రానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. దివ్యాంగులు బాగా చ దువుకోవాలని, అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

    ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ పి. రమేష్, జిల్లా సంక్షేమ సంక్షే మ అధికారి కృష్ణవేణి, డిఆర్ డిఓ శే ఖ ర్ రెడ్డి .డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీ నివాస్, డిఇఓ బిక్షపతి , జిల్లా క్రీడలు, యువజన సేవల అ ధికారి అక్బర్ అలీ,సి డి పి ఓ హరిత తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.