Tuesday, September 29, 2026
More
    Homeఖమ్మం జిల్లాCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, స్వరాష్ట్ర ఆకాంక్షకు మొట్టమొదట...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, స్వరాష్ట్ర ఆకాంక్షకు మొట్టమొదట పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలో నే పునాది పడిoది 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, కొత్తగూడెం: దేశంలోనే మొట్టమొదటి భూవిజ్ఞాన శాస్త్ర (Ea rth Sciences) విశ్వవిద్యాలయా నికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాల న విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెల కొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్ర ముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Scie nces University of Tela ngan a) పేరు పెట్టారు. కొత్తగూడెంలో ని ర్వహించిన ప్రజా పాలన – ప్రజా వి జయోత్సవాల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వా కిటి శ్రీహరితో పాటు ఉమ్మడి ఖ మ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతిని ధులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ ఆరు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొట్ట మొదటగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే పునాది పడిందన్న వి షయాలను గుర్తుచేశారు.తెలంగాణ ఆకాంక్షను ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నెరవేర్చిన నేప థ్యంలో యూనివర్సిటీకి వారి పేరు పెట్టినట్టు వివరించారు.

    దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడిపించిన ప్రధానమంత్రి డా క్టర్ మన్మోహన్ సింగ్ ని ప్రశంసిం చారు. దేశాన్ని ప్రగతి పథంలో నడి పించాలని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితోనే ప్రజా ప్రభు త్వం విద్య, నీటి పారుదల రంగాల కు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అపార మైన ఖనిజ సంపదను గుర్తించడం తో పాటు సింగరేణి లాంటి పేరొంది న సంస్థలున్న ప్రాంతంలో ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు ప రిశోధన కోసం ఎర్త్ సైన్సెస్ యూ ని వర్సిటీ ఆఫ్ తెలంగాణ (DrMM S ESUT) ను ఇక్కడ నెలకొల్పామని చెప్పారు.

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేండ్లు గా నిర్లక్ష్యానికి గురైన నీటి పారుద ల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నా రు. ఈ జిల్లాను అభివృద్ధి వైపు న డిపించే బాధ్యత ప్రభుత్వం తీసు కుంటుందని చెప్పారు. తెలంగాణ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబె ట్టాలన్న సంకల్పంతో విద్య, నీటి పా రుదల రంగాలకు అధిక ప్రాధా న్య త ఇస్తున్నామని ముఖ్యమంత్రి చె ప్పారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.