Petrol diesel CNG prices hiked : ప్రజా దీవెన, న్యూఢి ల్లీ: రేపటి సూ ర్యోదయం దేశవ్యాప్తంగా సామా న్యుల జేబు లపై గట్టి దెబ్బేయ బో తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెం చుతూ చమురు సంస్థలు తీసుకు న్న నిర్ణయం రేపు ఉద యం 6 గం టల నుంచి అమల్లోకి రానుంది.ఈ ధరల పెంపు తో రవాణా భారమై, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పె రిగే అవకాశం కనిపిస్తోంది.
పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావం తో ఈ కింది విధంగా పెంపుదల ఉండనుంది.పెట్రోల్ లీటరు కు రూ. 3.14 పెరగ నుండగా డీజిల్ లీటరుకు రూ. 3.11, సీ ఎన్జీ (CNG) కిలోకు రూ. 2 మేర భారం పడనుంది. కాగా
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ధరల గరిష్ట స్థాయిని తాక నున్నాయి.ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77 డీజిల్ రూ. 90.67 మేర అమలు లోకి ధరలు రానున్నాయి.
రేపు ఉదయం 6 గంటల లోపు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగే అవ కాశం ఉంది. ధరల పెంపు ప్రభావం వల్ల సామా న్యుడి నెలవారీ బడ్జెట్ లో కనీసం 5 శాతం నుండి 8శాతం వరకు వ్యత్యాసం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.

