Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshSensation over firing on ORR : బిగ్ బ్రేకింగ్,ఓఆర్ఆర్ రన్‌వేపై రి యల్...

    Sensation over firing on ORR : బిగ్ బ్రేకింగ్,ఓఆర్ఆర్ రన్‌వేపై రి యల్ ‘పుష్ప’ రేంజ్ యాక్షన్, ఎట్ట కేలకు చిక్కిన దొంగలముఠా నాయ కుడు

    📰 Generate e-Paper Clip

    Sensation over firing on ORR : ప్రజా దీవెన, హైద రాబాద్: హైదరా బాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) బుధవారం సా యంత్రం ఒక హై-వోల్టే జ్ యాక్షన్ ఫిల్మ్‌ను తలపించే సీన్‌ కు వేదికైంది. ఏపీ, తెలంగాణ పోలీ సులకు కంటిమీద కును కు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమిన ల్,100కు పైగా ఇ ళ్ల దొంగతనాల ముఠా నాయకుడు బూష్మి శ్రీకాంత్ ఎట్టకే లకు పోలీసుల తూటాలకు లొంగిపోయాడు. బొంగులూరు ఎగ్జిట్ వద్ద జరిగిన ఈ సినిమాటిక్ ఎన్‌కౌంటర్ తో పాటు చే జింగ్ వివరాలు ఇలా ఉన్నాయి

     

    2007 నాటి పాత పగ.. కానిస్టేబుల్ హంతకుడు

    పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్‌ కు చెందిన బూష్మి శ్రీ కాం త్ క్రైమ్ హిస్టరీ మామూలుది కాదు. 20 07కు ముందు చిన్న చిన్న దొంగత నాలు చేసే ఈ రౌడీ, తనను అరెస్ట్ చేయ డానికి వచ్చిన ఐడీ పార్టీ కా నిస్టేబుల్ వేణుబాబును దారు ణంగా హత్య చేసి పరారయ్యాడు. అప్పటినుంచి ఇప్పటివ రకు దాదాపు 120కి పైగా నేరాలకు పాల్పడ్డా డు. ఇందులో ఒక్క నల్లగొండ జిల్లా లోనే 30 కేసులు ఉండడం గమ నా ర్హం. దీంతో శ్రీకాంత్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నల్గొం డ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పక్కా ప్లా న్ వేశారు. అత ని కోసం 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గత వారం రోజులుగా వేట కొనసా గిస్తున్న పోలీసులకు, శ్రీకాంత్ హై దరాబాద్ ORR మీదుగా వెళ్తున్న ట్లు పక్కా ఇన్ఫర్మేషన్ అందింది.

    బొంగులూరు ఎగ్జిట్ వద్ద ‘కత్తి’యుద్ధం.. ఆపై కాల్పులు

    సినిమా స్టైల్‌లో పోలీసులు బొంగు లూరు ఎగ్జిట్ వద్ద శ్రీకాం త్‌ను చు ట్టుముట్టారు. అయితే, లొంగిపోవ డానికి నిరాక రించిన ఆ ముఠా నా యకుడు, ఒక్కసారిగా కత్తితో పోలీ సులపై దాడికి తెగబడ్డాడు.ఈ దాడిలో నల్గొండ సీసీఎస్ హె డ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తలకు తీ వ్ర గాయమైంది. ఈ క్రమంలో నిం దితుడు పారిపోయేందుకు ప్రయ త్నించడంతో పోలీసులు ఆత్మరక్ష ణ కోసం తక్షణమే తుపాకులకు పనిచె ప్పారు.పోలీసులు జరిపిన కాల్పుల్లో శ్రీకాంత్ కాలికో, చేతికో స్వల్ప గాయాలు కావడంతో అ తను కుప్పకూలాడు. వెంట నే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    ఆసుపత్రికి నిందితునితో పాటు కానిస్టేబుల్

    గాయపడిన హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరితో పాటు, కా ల్పుల్లో గాయపడిన నిందితుడు శ్రీకాంత్‌ ను కూడా చికి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.టాలీవుడ్ యాక్షన్ సీక్వె న్స్‌ను తలపించిన ఈ ఆపరేషన్‌తో తెలుగు రాష్ట్రాల పోలీ సులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు విచారణలో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కావాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.