Sunday, September 27, 2026
More
    HomeIndiaSmart Food Security cards in Telangana : రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’...

    Smart Food Security cards in Telangana : రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత 

    📰 Generate e-Paper Clip

     

    Smart Food Security cards in Telangana : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలం గాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మా ర్ట్’ రూపం రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.43 కోట్ల మంది ల బ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వా తం త్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ కారం చుట్టనున్నారు. సంగారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్ర మంలో ముఖ్యమంత్రి ఈ ప్రక్రి యను లాంఛనంగా ప్రారంభించ నుండగా, అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎ న్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిం చారు.

    స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏ ర్పాట్లపై మంగళవారం పౌర సర ఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ ర వీంద్ర, పౌర సరఫరాల సంస్థ డైరె క్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్న తాధికారులతో మంత్రి సమీక్ష ని ర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీ క్ జైన్‌తోనూ మాట్లాడి ముఖ్యమంత్రి పర్యటన, బహి రం గస భ ఏర్పాట్లపై దిశానిర్దేశం చే శారు. రాష్ట్రంలో ప్రస్తు తం 1,06 ,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధి దారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్త మ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి అర్హుడైన లబ్ధి దారుడికి నెలకు ఆరు కిలోల స న్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పం పిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారులసౌల భ్యం మరింత పెరుగుతాయని చెప్పారు.

     ఏడాదిన్నరలో 16.32 లక్షల కొత్త కార్డులు

    2025 జనవరి 26 నుంచి ఇప్ప టి వరకు 16,32,810 కొత్త ఆహా ర భద్రత కార్డులను జారీ చేసి, వాటి ద్వారా 61,08 ,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత క ల్పించినట్లు మంత్రి వెల్లడించా రు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొ త్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నా రు.తెలంగాణలో ఆహార భద్రత కార్యక్రమం ఏ స్థాయిలో కొన సా గుతోందో ఇందుకు ప్రభుత్వం చే స్తున్న వ్యయమే నిదర్శనమన్నా రు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రై తుల నుంచి ధాన్యం కొనుగోలు కు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపా రు.

       లబ్ధిదారుడికి ఇబ్బంది కలగొద్దు

    సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠా త్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల తరలింపు, సీటింగ్, భ ద్రత, కార్డుల పంపిణీతో పాటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పక డ్బందీగా ప్రణాళిక చేయాలన్నారు. కార్యక్రమానికి సంబం ధించిన మినిట్-టు- మి నిట్ షెడ్యూల్ సిద్ధం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

    సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వాస్తవ ల బ్ధిదారులను గుర్తించి ముఖ్య మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని చె ప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తం గా కార్డుల పంపిణీలో లబ్ధిదా రు ల గుర్తింపును ధ్రువీకరించి, పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.మిగిలిన జిల్లాల్లో నిర్వ హించే కార్యక్రమాలకు సంబంధిం చి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శ కాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.

    ‘ప్రతి అర్హుడికీ ఆహార భద్రతే లక్ష్యం’

    ‘‘తెలంగాణలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత క ల్పిస్తున్నాం. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచి తంగా అందిస్తున్నాం. ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్ధిదారుడి చెంతకు తీసుకెళ్లడ మే స్మార్ట్ రేషన్ కార్డుల లక్ష్యం’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వ ఆహార భ ద్రత కార్యక్రమం విస్తృతిని ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అధికా రులను ఆదేశించారు. 1.06 కోట్ల కార్డులు–3.43 కోట్ల లబ్ధిదారు లు–ఉచిత సన్నబియ్యం వంటి కీలక అంశాలతో ప్రింట్, ఎలక్ట్రా నిక్, సోషల్ మీడియాతో పాటు షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా వి స్తృత ప్రచారం చేపట్టాలని సూ చించారు.ఆగస్టు 15 నాటికి అ న్ని ఏర్పాట్ల ను పూర్తి చేసి, సం గారెడ్డి రాష్ట్ర స్థాయి కార్యక్రమం తో పాటు 33 జిల్లాల్లో జరిగే పం పిణీ కార్యక్ర మాలను క్రమశిక్షణ తో, పారదర్శకంగా, నిర్వహించా లని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.