Spark ACB double trapped : ప్రజా దీవెన, హైదరాబాద్: అవి నీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపించింది. రంగారె డ్డి జిల్లా డీఎంహెచ్వో (DMHO) స్వర్ణకుమారి ఓ ప్రైవేట్ ఆ స్పత్రి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు చిక్కారు. లంచం వ్యవహారంపై ముందస్తు స మాచారం మే రకు ఏసీబీ అధికా రులు పక్కా వ్యూహంతో దాడి చేసి ఆమె ను పట్టుకున్నట్లు సమాచారం.
మరో ఘటనలో హైదరాబాద్ మె హిదీపట్నంలోని జిహెచ్ఎం సి (G HMC) కార్యాల యంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత ఏ సీబీ వలలో చిక్కారు. ఓ పనికి సంబంధించి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు ఆమెను రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిసింది.ఒకే రోజు వరుసగా జరిగిన ఈ రెండు ఘటనలు అధికార వర్గాల్లో కలకలం రేపు తున్నాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారు లపై ఏసీబీ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

