Sunday, September 27, 2026
More
    HomeOpinionSummer drinking water problems : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, జూన్ నెలాఖరు...

    Summer drinking water problems : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, జూన్ నెలాఖరు వరకు తాగునీటికోసం రిజర్వాయర్ లలో నీటిని సిద్ధంగా ఉంచాలి

    📰 Generate e-Paper Clip

    Summer drinking water problems ప్రజా దీవెన, మి ర్యాలగూడ: వేసవిలో తాగు, సాగునీటి కొరత లేకుండా చూ డాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు.శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యద ర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జి ల్లా ల కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ, పౌర సరఫరాల అధి కారులతో సాగు, తాగునీరు, ఎల్పిజి గ్యాస్ సర ఫరా తదిత ర విషయాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిర్యా లగూడలో నిర్వహించిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక ని యోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

    వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికా రులతో ఇదే విషయమై సమీక్ష నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, తా గునీటి రిజర్వాయర్లు తదితర వివరాలన్నింటిని ఇంజ నీరిం గ్ అధి కారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆ త ర్వాత మాట్లాడుతూ వేసవిలో తాగునీటికీ అత్యంత ప్రా ధా న్యత ఇవ్వాలని, ముఖ్యంగా గ త సంవత్సరం అనుభవాల ను దృ ష్టిలో ఉంచుకొని జూన్ చివరి వరకు ప్రజలకు ఆయా రి జర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు అవ సరమైనంత నీటిని సి ద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

    ముఖ్యంగా ఉదయ సముద్రం ద్వా రా నల్గొండ పట్టణానికి, చుట్టుప క్కల గ్రామాలకు తాగునీటిని సర ఫరా చేసేందుకు అవసరమయ్యే నీటిని నిలువ ఉంచాలని చెప్పారు. ఇదే స మయంలో ఉదయ స ముద్రం కింద సాగవుతున్న పంటల పరిస్థితిలను ఎప్పటి వరకు సాగు నీరు అవసరం ఉందో క్షేత్ర స్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ ,వ్యవసాయ అధికారులు సం యుక్తంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు.

    సాధ్యమైనంత త్వరగా రైతులు ప్ర స్తుత పంటలను కోసే వి ధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూ చించారు. ఎట్టి పరిస్థితులలో తా గునీటికి సమస్య ఏర్పడకుండా చూడాల ని, ఆవిధంగా ప్రణాళిక రూపొందించాలని, సాగర్, ఇతర ప్రా జెక్టుల ద్వారా వచ్చే సాగునీరు, తాగునీటి రిజర్వాయర్లను ఎప్పటి కప్పుడు సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అ లాగే మిర్యాలగూడ పట్టణానికి తా గునీ రిచ్చే నాగార్జునసాగర్ ప్రాజెక్టు టేలండ్ ను సందర్శించి ఇరి గేషన్ తాగునీటి అధికారులతో సందర్శించి నివేదిక ఇవ్వాల ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కోరా రు.

    ఆయా ప్రాజెక్టుల కింద ఎక్కడైనా భూ సేకరణకు సంబం ధిం చి సమస్య ఉంటే పరిష్కరించా లని, అలాగే పేమెంట్ లకు సంబం ధించిన వివరాలను సైతం సమ ర్పించాలని ఆదే శిం చారు. ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణకు గుర్తించిన భూ ములకు సంబంధించి వెంటనే సరిహద్దులను ఏర్పాటు చే యాలని, పెగ్ మార్కింగ్ లేదా కంద కాలు తవ్వడం వంటివి చేపట్టాల ని కలెక్టర్ సూచించారు.

    అంతకు ముందు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సరఫరా ప్రస్తుత పం టపొలాలకు సాగు నీరు, రబీ సీజ న్ లో చేపట్టే ధాన్యం సేకరణపై అ ధికారులకు దిశానిర్దేశం చే శారు. జిల్లా కలెక్టర్లు అధికారులు ఎక్కడ సాగునీరు, విద్యు త్ కొరత కార ణంగా పంటలు ఎండిపోకుండా చూడాలని, ఈనెలాఖరు వరకు అ త్యంతప్రమత్తంగా ఉండి పంటల ను కాపాడాలని, ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఆయా ప్రా జెక్టుల కింద ఇంజనీర్లు, వ్యవసా య అధికారులు, వి ద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పరిస్థి తులను సమీక్షించాలని చెప్పారు.

    ఇరిగేషన్ అధికారులు లస్కర్ల తో మొదలుకొని అందరు అం దుబాటులో ఉండాలని, విషయా న్ని సీరియస్ గా తీసుకో వాలని, వ్యవసాయం,నీటిపారుదల ,విద్యుత్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. సాగునీరు లేని కారణంగా ఎ క్కడ పంటలు ఎండిపోయాయన్న అపవాదు రాకుండా చూ డాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తేల్చి చె ప్పారు.ఎల్.పి.జి గ్యాస్ సరఫరా విషయం లో ఎటు వంటి గందరగోళానికి గు రికావొద్దని,గృహ వినియోగదారు లకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.

    సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్ర చారంతో కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగు తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయి లో తిప్పికొట్టారు. ఇ టువంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారి గా 72 శా తం బుకింగ్స్ జరుగుతున్నాయని, అయితే గృహ వినియో గదారులతో పాటు ఆసుపత్రిలకు, విద్యాసంస్థలకు, వృద్దాశ్ర మలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభు త్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపా రు. రాష్ట్రంలో 810 ఎల్. పి.జి డిస్ట్రి బ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు.

    అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చే యాలని చూస్తే ప్రభు త్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉప క్రమిస్తుందని ఆయన హెచ్చరిం చారు. తాజాగా జరుగుతు న్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చే యడం అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్ప డడం వంటి చర్యలకు పాల్పడనందుకు గాను ఇప్పటి వర కు 288 కేసులు నమోదు చేశామన్నారు.ఎల్.పి.జి డిస్ట్రి బ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమిం చాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్.పి లు,పో లీస్ కమీషనర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించా రు.

    అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెం టర్ ను ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించిందని ఆయన తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్ర త్యేక అధికారుల కమిటీ ఏ ర్పా టు చేసి రోజువారీ నిల్వలు, సరఫ రా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించా రు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి గ్రామీ ణ 45 రోజుల కు ఒకమారు ఎల్. పిజి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపో హలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకో వొద్దని,గృహా వినియో గదారులకు సరిపడా గ్యాస సరఫ రా చేస్తామని,ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితు లను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజ లకు విజ్ఞప్తి చే శారు.

    రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ తో టల సాగు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయా జిల్లాలకు ఇచ్చిన ల క్ష్యాలను సాధించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈఅం శంపై సమీక్షించి నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా చూడాలని కోరారు. మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలు తదితర శాఖల అధికారులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.