Swiss Tour turned 50 Crore Mystery : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌కు చెందిన ఒక మధ్యతరగతి దంపతులు స్విట్జర్లాండ్ అందాల ను చూసేందుకు విమానం ఎక్కా రు. కట్ చేస్తే… అక్కడ వారు ల్యాండ్ అయ్యారో లేదో తెలియ దు, ఫోన్లు స్విచ్ఛాఫ్. కంగారుపడి న కూతురు పో లీస్ స్టేషన్‌లో కం ప్లైంట్ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే… ఇక్కడే అ సలు ట్విస్ట్ రివీల్ అయిం ది! అది కేవలం ‘మిస్సింగ్’ కేస్ కా దు… పక్కా ప్లాన్‌తో జరిగిన ‘మెగా ఎస్కేప్’ అని తేలింది.
చర్లపల్లికి చెందిన పబ్బా చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూ న్ 22న హైదరా బాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయ లుదేరా రు. అంతవరకు బాగానే ఉంది. కానీ, అక్కడికి వెళ్లినప్పటి నుంచి వారి ఫోన్లు కలవడం లేదు. దీంతో ఆందోళన చెందిన వారి కు మార్తె చర్లపల్లి పోలీసులను ఆశ్రయించింది. “మా అ మ్మనాన్న కని పించడం లేదు, కాపాడండి” అంటూ ఫి ర్యా దు చేయడంతో పోలీసు లు మిస్సింగ్ కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.
తెరపైకి వచ్చిన రూ. 50 కోట్ల ట్విస్ట్
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండ గానే కథలోకి బాధితులు ఎంటర్ అయ్యారు. చంద్రశేఖర్ దంపతులు కేవలం టూరి స్టులు కారు, ఒక భారీ ఫైనాన్స్ స్కామ్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ అని తేలింది. ఎక్కువ వ డ్డీ ఇస్తామంటూ నమ్మబలికారు. హైదరాబాద్ వ్యాప్తంగా అమాయ కుల నుంచి దాదాపురూ. 50 కో ట్లు వసూలు చేశారు. సరిగ్గా వారం రోజుల క్రితమే వీ రిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ నుం చి తప్పించుకోవడానికి వీరు స్విట్జర్లాండ్ టూర్‌ని పక్కా స్కె చ్‌గా వాడుకున్నట్లు తేలింది.
కూతురు పెట్టిన మిస్సింగ్ కేసు కాస్తా ఇప్పుడు ‘ఇంటర్నేష నల్ ఎస్కేపింగ్’ కేసుగా మారిపోయిం ది. హైదరాబాద్‌లో కోట్లు వసూలు చేసి, స్విస్ బ్యాంకుల్లో దాచుకోవ డానికి పారిపోయారా? లేక నిజం గానే అక్కడ ఏదైనా జరిగిందా? అ నే కోణంలో పోలీసులు వేట మొద లుపెట్టారు. సినిమా స్క్రీన్‌ప్లేను త లపించే ఈ ‘స్విస్ మిస్టరీ’ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

