T20 cricket World Cup winner India: ప్రజా దీవెన అ హ్మదాబాద్ : టీ20 వరల్డ్ కప్-2026 ఫైనల్లో భారత్ అ ద్భుత ప్రదర్శనతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత ఆటగాళ్లు అద్భు తంగా రాణించడంతో ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా మారింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వి కెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అభిషేక్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్ ముగ్గురు హాఫ్ సెంచరీలతో అద్భుతంగా రాణించి జట్టుకు బలమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ తరఫున జిమ్మీ నీషమ్ 3 వికె ట్లు తీసి కొంత ప్రభావం చూపగా, మ్యాట్ హెన్రీ మరియు రా చిన్ రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు.
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. 19 ఓవర్లలోనే 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ టీమ్ సీఫెర్ట్ మాత్రం హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడినా జట్టును గెలు పు దిశగా తీసుకెళ్లలేకపోయాడు.
భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ మధ్యవరుసను కుదిపేశాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీసి జట్టు విజ యాన్ని ఖాయం చేశారు. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుని క్రికెట్ ప్రపం చంలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.

