telangana sarpanches : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలం గాణలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభు త్వం కీలక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్ లకే అప్పగిస్తూ కీలక నిర్ణయం ప్రకటిం చిం ది. ఈ మేరకు రా ష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్ర మాలను అరికట్టి, అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలో పే తం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. గతంలో రెండేళ్లపాటు గ్రామాల్లో ఎన్నికైన పాలకవ ర్గాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూ ర్తిగా గాడితప్పింది. చాలాచోట్ల పౌష్టికాహారం పక్క దారి ప డుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కొలువుదీరిన కొత్త పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్య తలు అప్పగించాలని నిర్ణయించింది.
సర్పంచ్ చైర్మన్ గా కమిటీ నియామకం
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణ యంలో భాగంగా సర్పంచ్‌ల నే తృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏ ర్పాటు చేయనుoడగా ఈ కమిటీకి సర్పంచ్ ఛైర్మన్‌గా వ్యవహరించ నుండగా ఇం దులో మొత్తం 11 మంది సభ్యులు ఉండనున్నారు. అంగన్ వాడీ టీచర్ కన్వీనర్‌గా, ఏఎన్‌ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రతి నెలా కేంద్రాలకు అందుతున్న బియ్యం, ప ప్పు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి సరుకుల నాణ్యత ను, పంపిణీని త నిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా ప రిశీలిస్తుంది. లక్షల రూపాయల వి లువైన పోషకాహారం లబ్ధి దారుల కు సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీ బా ధ్యతగా విధి విధానాలు రూపకల్పన చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
