Tungaturthi Congress Protest Gandhi Bhavan : ప్రజా దీవెన, హైదరాబాద్: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్‌లో రే గిన ‘మండల అధ్యక్షుల’ చిచ్చు చివరకు రాష్ట్ర రాజధాని హైదరాబా ద్‌లోని గాంధీభవన్‌ను తాకింది. నిన్న మొన్నటి వరకు నియోజక వ ర్గానికే పరిమితమైన మాటల తూటాలు, బుధవారం నాటి ప్రజా ప్రదర్శనతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఏకపక్ష ని ర్ణయాలకు వ్యతిరేకంగా, “సేవ్ కాంగ్రెస్” అంటూ వందలాది మంది కా ర్యకర్తలు గాంధీభవన్‌ను ముట్టడించడం ఇప్పుడు తెలంగా ణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం ఉద యం తుంగతుర్తి లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన వి షయం తెలిసిందే.
దివంగత నేత రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు, జిల్లా మాజీ ఉపా ధ్యక్షులు ధరూర్ యోగానంద చారి ఆధ్వర్యం లో కార్యకర్తలు హైదరా బాద్ బయలుదేరారు. అయితే,ఈ లోపే అర్వపల్లి వద్ద ఎమ్మెల్యే వర్గీ యులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వా తావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చా ర్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఆటంకాలను దాటుకుంటూ.. దాదాపు 200 పైగా వాహనాల భారీ కాన్వా య్‌తో 500 మందికి పైగా సీనియర్ కాంగ్రెస్ సైనికులు గాం ధీభవన్‌కు చేరుకున్నారు.
ప్లకార్డుల ప్రదర్శనతో దద్దరిల్లిన గాంధీభవన్
హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ ముం దు బైఠాయించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చే తుల్లో ‘సేవ్ కాంగ్రెస్’ ప్లకార్డులు, గాల్లోకి లేచిన నిరసన హ స్తాలు ఏకపక్షంగా ప్రకటించిన మండల అధ్యక్షుల పేర్లను త క్షణమే రద్దు చేయాలనే డిమాండ్లు..వీరి నినాదాల హోరుతో గాం ధీభవన్ ఆవరణ మొత్తం మార్మో గిపోయింది. నలభై ఏ ళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండా మోసిన తమ కు కాకుం డా.. నిన్నమొన్న వచ్చిన ‘ఆయారాం గయారాం’లకు పద వులు ఎలా ఇస్తారంటూ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్య క్తం చేశారు.
40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని ప్రాణం గా కాపాడుకున్న కార్య కర్తలను విమర్శించడం అంటే.. పార్టీని, మమ్మల్ని అవమా నించడమే. నిజమై న నికార్సైన కార్యకర్తలకే పదవులు ద క్కాలని సీనియర్ కాంగ్రెస్ నేత ధరూర్ యోగానంద చారి డి మాండ్ చేశారు. అయితే అధిష్ఠానం ఏం చేయబోతోంది ని యోజకవర్గంలో నిజమైన కాంగ్రెస్ నాయకులపై జరుగుతు న్న దాడులు, అ ణచివేత ధోరణికి అడ్డుకట్ట వేయాలని అ సంతృప్త నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద లు తక్షణమే జోక్యం చేసుకుని తుంగ తుర్తి కాంగ్రెస్‌ను కా పాడాలని కోరుతున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన ఇం తమంది కార్యకర్తల ఆగ్రహాన్ని చూశాక, గాంధీభవన్ పెద్ద లు ఈ అంతర్గత పోరును ఎలా చల్లారుస్తారో.. తుంగతుర్తి ‘మండల’ పీఠాల వివాదానికి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాల్సి ఉంది.


