Us Iran Israel war Ceasefire : ప్రజా దీవెన, వైట్ హౌస్: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అ కస్మాత్తుగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం తీ సుకున్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి యు ద్ధ మేఘాలు కమ్ము కున్న సమయంలో, ఆయన ఐదు రోజు ల పాటు ఇరాన్‌పై దాడులను (Iran Israel war Cease fi re) నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
గత రెండు రోజులుగా గోప్యంగా సాగుతున్న చర్చలు ఇప్పు డు వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ వేదికలపై ఆసక్తి మరింత పెరి గింది. యుద్ధం వైపు సాగుతున్న పరిస్థితులు ఒక్కసారిగా చర్చల దిశగా మళ్లడం ప్రపంచ దేశాలకు కొంత ఊరటనిచ్చింది. ఇదే కాకుండా ఇరాన్ తో ఇంకా ఒకవారం రోజుల పాటు చర్చలు కొనసాగనున్నాయని ట్రంప్ వెల్లడిం చారు.
ఈ చర్చలు శాంతి దిశగా మారుతాయా లేక మరొక పెద్ద ని ర్ణయానికి నాంది పలుకుతాయా అన్నది ఇ ప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమని స్తున్న ప్రశ్న కాగా ప్రపంచ రాజకీయాల్లో కొ త్త అధ్యాయం మొదల వుతుందా లేక ఇది కేవలం తాత్కా లిక విరామమేనా సమాధానం త్వరలోనే తెలుస్తుందని పరి శీలకులు భావిస్తున్నారు.
తమవ్యూహాల ముందు అమెరికా, ఇజ్రాయిల్ వెనక్కి తగ్గాయి
భవిష్యత్‌లో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తాజాగా చేసిన ప్రకట నలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ పరి స్థితుల్లో అమెరికా, ఇజ్రాయెల్ తమ వ్యూహాల ముందు పూ ర్తిగా వెనక్కి తగ్గాయని ఇరాన్ ధైర్యంగా ప్రకటించింది. తమ కఠిన హెచ్చరిక ల వల్లనే అమెరికా నాయకత్వం కూడా ఒక దశలో తగ్గిందని పేర్కొంది.
ఇంకాపరిస్థితులు మరింత ఉద్రిక్తం గా మారితే తీవ్ర పరిణా మాలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. తమ విద్యుత్ కేం ద్రాలపై దాడులు జరిగితే, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడానికి కూడా వె నుకాడబోమని హెచ్చరించింది. అదే సమయంలో, ఇజ్రా యె ల్‌కు చెంది న విద్యుత్ కేంద్రాలు, ఇంధన వ్యవస్థలు, సమా చార మరియు ప్రసార సాంకేతిక మౌలిక వసతులను ల క్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఈ పరిణామాలు భవిష్యత్‌లో గ్లో బల్ రాజకీయాలు, ఆర్థిక వ్యవ స్థ పై గంభీర ప్రభావం చూపే అవకాశముందని విశ్లేష కులు భావిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిణా మాలను ఆతృతగా గమని స్తోంది. ఏది ఏమైనా అకస్మాత్తు గా అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయిల్ లు ఇరాన్ పై దాడుల ను విరామం ప్రకటించడం వెనుక ఏదైనా మర్మం దాగి ఉం దా అన్న అనుమానాలు అనేకం వ్యక్తమవుతున్నాయి.
