Sunday, October 4, 2026
More
    HomeOpinionBC Caste Census All-Party Meeting : బీసీ కులగనణకై ఈనెల 8న ఢిల్లీలో అఖిలపక్ష...

    BC Caste Census All-Party Meeting : బీసీ కులగనణకై ఈనెల 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

    📰 Generate e-Paper Clip

    –ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం
    –ఓబీసీ కాలమ్ పై మాట్లాడని రాజకీయ పార్టీ నేతలు బీసీ ద్రో హులు
    –నవంబర్ లో పార్లమెంట్ సమా వేశాలను అడ్డుకుంటాo
    –బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

    BC Caste Census All-Party Meeting : ప్రజా దీవెన, హై దరాబాద్: జాతి జన గణ మనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని ప్ర ధాన డిమాండ్ తో గ త రెండు నెలలుగా దేశవ్యాప్తం గా బీసీ లు రోడ్లెక్కి ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం స్పం దించకపోవడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాదు లోని బీసీ భవన్ లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గ ణేష్ చారి అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశంలో శ్రీ నివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్ర సంగించారు. ఈ సం దర్భంగా ఈ నెల 8న ఢి ల్లీలో జరిగే జాతీయ అఖిలపక్ష సమావేశoకు సంబం ధించిన వాల్ పోస్టర్ ను ఈ సం దర్భంగా బీ సీ నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరిం చారు.

    అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓబిసి కులా ల లె క్కలు తీయాలంటే కేంద్ర ప్రభు త్వం గడగడ ఉనికి పో తుందని బీసీల లెక్కలు తేలితే తమకు భ విష్యత్తులో రాజకీ యంగా నష్టం జరుగుతుందని కుట్రతోనే కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం జరిగే జనగణనలో ఓబీసీ కాలం చేర్చడం లేదని ఆయన ఆరోపిం చారు


    ఓబీసీ కాలం చేర్చాలని ప్రధాన డిమాండ్ తో ఇప్పటికే దేశ వ్యా ప్తంగా ఉద్యమం చేపట్టామని అందులో భాగంగానే జిల్లా కలె క్టర్లకు వినతి పత్రాలు, గెజిట్ నో టిఫికేషన్లు చించివేత, రౌం డ్ టేబుల్ సమావేశాలు, ధర్మ పో రాట దీక్షలు, నిరసన ర్యా లీలు చేపట్టడం జరిగిందని అయినప్ప టికీ ప్రధాని నరేంద్ర మో డీ కనీసం స్పందించకపోవడం చూస్తే బీసీ లు అంటే నరేంద్ర మోడీకి గిట్టద ని తేలిపోయిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే దేశంలోని కొ న్ని రాజ కీయ పార్టీలు వాటికి నే తృత్వం వహించే అధ్యక్షులు కేం ద్ర ప్ర భుత్వాన్ని నిలదీసి డిమాం డ్ చేయాల్సిన వారు కనీసం మీ డియా సమావేశం ఏర్పాటు చేసి కానీ, లేదా ఉద్యమ కార్యా చరణ గాని చేపట్టడం లేదన్నారు, బీసీ కులగనన చేయకుండా బిజెపి బీసీ వ్యతిరేక పార్టీగా మిగిలిపో తే, బీసీ కులగన చే యాలని డి మాండ్ చేయని పార్టీలు కూడా బీసీ ద్రోహుల పా ర్టీలుగా చరిత్ర లో మిగిలిపోతాయని ఆయన హెచ్చరించారు.

    జాతీయస్థాయిలో బీసీ ఉద్యమా న్ని ఇంకా ఉధృతం చేయడా నికి ఓబి సి కాలమ్ డిమాండ్ పై దేశం లోని అన్ని రాజకీయ పార్టీల వైఖ రిని తెలుసుకోవడానికి ఈనెల ఎ నిమిదో తేదీన ఢిల్లీలోని కాన్స్టి ట్యూషన్ క్లబ్ లో జాతీయ అఖి లపక్ష సమా వేశాన్ని నిర్వహిస్తు న్నామని ఆయన తెలిపారు ఈ సమావేశం లో ఇప్పటివరకు జరి గిన ఉద్యమంపై చర్చించి భవిష్యత్ కా ర్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని, అన్ని రాజకీయ పా ర్టీల సలహాలు సూచన లతో ఉద్యమాన్ని ముందుకు తీ సుకు వెళ్తామని ఆయన తెలిపారు.

    దేశంలోని 6శాతం ఉన్న ఓబీ సీలను జెండాలు మోహిం చుకుంటూ జిందాబాద్ లు కొట్టించుకొని ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు తమ విధానపరమై న వైఖరిని ఈనెల 8లోగా స్పష్టం గా వెల్లడించాలని లేనిపక్షంలో 8వ తేదీన ఢిల్లీలో జరిగే సమావే శంలో ఓబీసీల కాలం ఉ ద్యమానికి మద్దతు తెలపని రాజకీయ పార్టీలను బహిరంగం గా ప్రకటిం చి వాటిని రాజకీయంగా భూస్థా పితం చేయడానికి తమ ఉద్యమ కార్యచరణ ఉంటుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు

    ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్య క్షులు ప్రొఫెసర్ సంఘని మల్లే శ్వ ర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటి కొండ విక్ర మ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షు లు కనకాల శ్యాంకుర్మా, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వల్లబోజు నరసిం హచారి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంద్రం ర జక, బండిగారి రాజు గౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

    BC Caste Census All-Party Meeting

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.