Wednesday, September 30, 2026
More
    HomeOpinionMahatma Jyotirao Phule Jayanthi : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాల స్ఫూర్తి...

    Mahatma Jyotirao Phule Jayanthi : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాల స్ఫూర్తి భావితరాల్లోకి తీసుకెళ్లాలి

    📰 Generate e-Paper Clip

    Mahatma Jyotirao Phule Jayanthi : ప్రజా దీవెన, న ల్లగొండ: సమానత్వం, సామాజిక న్యాయం నాణ్యమైన వి ద్యకై కృషి చేసిన మ హాత్మ జ్యోతిబాపూలే ఆశయాల స్ఫూ ర్తి భావితరాలకు తీసుకెళ్లాల్సి న బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. జిల్లా వెనుకబడిన త రగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జి ల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన మహాత్మ జ్యో తి బాపూలే “ద్విశతాబ్ది” ఉత్సవాలకు ఆయన ముఖ్య అతి థిగా హాజరై మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూల మా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ కార్యక్రమానికి హాజరైన విద్యా ర్థులు, ఆహుతులను ఉ ద్దేశించి జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడి న వర్గాల వారి అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ప్రత్యేకించి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, ప్రీ మె ట్రిక్ స్కాలర్షిప్ లతోపాటు, నాణ్య మైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని వసతి గృహా లలో ఇంకా సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. విద్యాభివృద్ధిలో భాగంగా రా ష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవ ర్గానికి ఒకటి చొప్పున 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షి యల్ పాఠశాలలను నిర్మిస్తున్న దని, ఇందులో ఒకేసారి 2,600 పిల్లలు చదువుకోవచ్చని అన్నారు.

    అలాగే నియోజకవర్గానికి ఒక తె లంగాణ మోడల్ స్కూల్ ను ఏ ర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పం పించినట్లు వెల్లడించారు. ఈ పాఠశాలలో విద్యా ర్థులు ఇం టి వద్ద నుండి బస్సులో తీసుకువెళ్లే సౌకర్యాన్ని కూడా ప్ర భుత్వం ఏర్పాటు చేయనుందని తె లిపారు. వెనుకబడిన తరగతుల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చే యడం జరుగుతున్నదని, ఓవర్సీస్ విద్యానిధి పథకం కిం ద జిల్లాలో 12 మందికి ఆర్థిక స హాయం అందించడం జరిగిం దని, అలాగే కులాంతర వివాహం చేసు కున్న 21 మంది ల బ్ధిదారులకు ఆ ర్థిక సహకారం అందించడం జరిగిం దని చె ప్పారు .అలాగే వెనుకబడిన తరగతుల సంఘాల ప్రతినిధు లు లేవనెత్తిన సమస్యల పరిష్కారా నికి కృషి చేయడం జ రుగుతుందని, విద్యార్థులు బాగా చదువు కోవాలని, మహా త్మ జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేయాలని, ప్రశ్నిం చే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆ రోగ్య వారోత్సవాలను నిర్వహించ డం జరుగుతున్నదని, ఇందులో భాగంగా శనివారం క్లాక్ టవర్ చౌ రస్తానుండి నో డ్రగ్స్ క్యాంపెయిన్ కింద ర్యాలీ నిర్వహించినట్లు కలెక్టర్ వె ల్లడించారు.

    నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీ నివాస్ రెడ్డి మాట్లాడుతూ మహా త్మ జ్యోతిబాపూలే సంఘసంస్కర్త మాత్రమే కాదని ,మహిళా చదువు కోసం పోరాటం చేసిన వ్యక్తిఅని సమా జంలో అందరూ సమానమని, సమానంగా ఉండాలని ఆలో చించారని మహిళా విద్యకై కృషి చే సిన మహానీయుడని ,వారి జీవిత చరిత్రను విస్తృతంగా విద్యార్థులకు తెలియ జేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్క రు మాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయా ల్సిన అవ సరం ఎంతైనా ఉందని ఆకాంక్షించారు.

    జోతిరావ్‌ పూలే కు సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించిందని, 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించి తరు వా త చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవారు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్ర కుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వారు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసా గేలా చేశారని గుర్తు చేశారు. ఆయన 1841లో స్కాటిష్‌ మి షన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదా శివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారిందని వివరించారు.

    ఎమ్మెల్సీ నెలకుంటి సత్యం మాట్లా డుతూ సుమారు 200 సంవత్స రాలకు పూర్వం సమాజంలో పా తుకుపోయిన కులవివక్షతకు వ్య తిరేకంగా మహాత్మ జ్యోతిబాపూలే కృషి చేశారని ,కుల వ్యవస్థ నిర్మూ లనకు దేశంలో అనేక ఉద్య మాలు జరిగాయని అన్నారు. ఆ రోజుల్లో చదువుకునేందు కు అవకాశం కూ డా లేని వారికి ప్రత్యేకించి మహిళ లకు విద్యను అందించేందుకు జ్యో తిబాపూలే కృషి చేశారని, సమాజ చైతన్యానికి విద్యనే ముఖ్యమని భావించారని అన్నారు.

    ఎన్నో ఉ ద్యమాలు జరిగినప్పటికీ దేశంలో ఇంకా కుల వ్య వస్థ కొనసాగుతు న్నదని, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మ హాత్మ జ్యోతిబాపూలేని ఆద ర్శంగా తీసుకొని ముందుకెళ్లా ల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యా భివృద్ధికి ప్రభు త్వం ప్రస్తుతం కేటా యిస్తున్న బడ్జెట్ సరిపోదని. అధిక ని ధులు కేటాయించాల్సిన అవస రం ఉందని ,అలాగే బిసి రి జర్వేషన్, మహిళల ఉపకోట కోసం పని చేయాల్సిన అవస రం ఉందని ఆయన అన్నారు.

     

    ఈ కార్యక్రమoలో విశ్రాంత ఐఏఎ స్ చోల్లేటి ప్రభాకర్ ,వున్న కైలాస్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ జూ కూరి రమేష్, మా రగొనినవీన్ గౌ డ్, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ,బీసీ సం ఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రా మరాజు, దుడుకు లక్ష్మీనారాయ ణ, పాలడుగు నాగార్జున, కొండూ రు సత్యనారాయణ, నేలపట్ల స త్యనారాయణ, వెంకన్న గౌడ్, భా ష పాక హరికృష్ణ, చొల్లేటి రమేష్ కేశబో యిన శేఖర్, మిర్యాల యాదగిరి, రాపోలు పరమేష్ చిక్కా ల రాములు, కంది సూర్యనారాయ ణ, కే శివ, కొంపల్లి బిక్ష పతి, ముం తాజ్, కరుణాకర్ గౌడ్, వాసుదేవ వెంకట నరస య్య, పంకజ్ జాదవ్ తదితరులు మాట్లాడారు.

    మిర్యాల గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ, స్థానిక త హసిల్దార్ పరశురాం ,ఇతర అధికారులు, ప్రజాప్రతి నిధులు తదితరులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.