Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండలోని నక్రేకల్ మైనారిటీ రెసి డె న్షియల్ జూనియర్ కాలేజీలో MEC & CEC గ్రూప్ లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రారంభం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అస్మా షాహీన్ అధ్యక్షతన నిర్వా హకవర్గం ఆధ్వర్యంలో విస్తృత స్థా యి అవగాహన సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో కళా శాలలో విద్యార్థినులకు అందిస్తున్న విద్యా, వసతి, నైతిక విలువలతో కూడిన సౌకర్యాలపై సమగ్రంగా వి వరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థి నులకు నాణ్యమైన ఆధునిక వి ద్యతో పాటు ధార్మిక విద్య, పంచ కాల ప్రార్థనల క్రమబద్దమైన ఏర్పా టు తో పాటు నైతిక విలువల బోధ న, క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంపొందించే కార్యక్రమాలను ప్రో త్సహిస్తున్నట్లు తెలిపారు.
జూనియర్ కాలేజీ స్థాపన నాటి నుంచి రాష్ట్ర స్థాయిలో విశేషమైన విద్యా విజయాలు సాధించడమే కా కుండా, సంస్థ ప్రతిష్ఠ కూడా క్రమం గా పెరుగుతూ వస్తోందని పేర్కొ న్నారు. కళాశాలలో అనుభవ జ్ఞు లైన, కుశలమైన అధ్యాపకుల పర్య వేక్షణలో నాణ్యమైన బోధన అం దించబడుతున్నదని, విద్యార్థిను ల కు పోషకాహారం, మెరుగైన వసతి సదుపాయాలు, సురక్షిత వాతావర ణంతో పాటు అన్ని ఆధునిక సౌక ర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక వి లువలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యే క ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థినుల ను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ ద్వారా అందిస్తున్న సౌకర్యాలను మైనారిటీ వర్గాల విద్యార్థినులు పూ ర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదే సమయంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అ వగాహన కార్యక్రమాలు నిర్వహిం చి ఎక్కువ సంఖ్యలో విద్యార్థినుల ప్రవేశాలు సాధించేందుకు మైనారిటీ నాయకులు, విద్యావేత్తలు, సామా జిక కార్యకర్తలు సమిష్టిగా సహకరిం చాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కోఆర్డినేటర్ సురే ష్, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ జుబేర్ అహ్మద్ ఖాన్, విద్యా నిపు ణులు మహమ్మద్ జాఫర్, డాక్టర్ ఎ.ఏ. ఖాన్, మైనారిటీ నాయకులు ఖ్వాజా హౌస్ ముహియుద్దీన్, హా షిం బాబా, జియా ఉద్దీన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినుల తల్లి దండ్రులు, ఇతర ప్రముఖులు పా ల్గొన్నారు. సమావేశం ముగింపులో కళాశాల మరింత అభివృద్ధి చెందా లని, విద్యార్థినులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించా లని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలి యజేశారు.

