Monday, September 28, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, నీటి...

    CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, నీటి వివాదాల విషయం లో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రా లతో వివాదాలు కోరుకోవడం లే దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్య మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చే శారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కావాలా..! నీళ్లు కావా లా..! అని అడిగితే తెలంగాణ రా ష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటా మని చెప్పారు.నదీ జలాలపై రాజకీ య ప్రయోజనం పొందాలని ప్రభు త్వం భావించడం లేదని, రాజకీ యాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటు న్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల లోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ (Suzen Medicare) ఫ్లూ యిడ్స్ తయారీ యూనిట్ ను ము ఖ్యమంత్రి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స భలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయ న మాటల్లోనే..తెలంగాణ జల వివా దాలను ప్రస్తావించారు. “పక్క రా ష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదు. న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయతీ పెట్టుకునే కన్నా సమ స్యపై కూర్చొని చర్చల ద్వారా పరి ష్కరించుకోవాలి. నీటి వివాదాల వి షయంలో తెలంగాణ శాశ్వత పరి ష్కారం కోరుకుంటోంది. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహ కారం, సయోధ్య ఉండాలి. రాజకీ యాలకు అతీతంగా పరిష్కారం కో సం అందరూ సహకరించాలి..”అని పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞ ప్తి చేశారు.

    కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదని ఈ సందర్భంగా ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. జల వివాదాలపై శాశ్వత పరిష్కా రం, రాష్ట్ర ప్రయోజనాలపై వివాదా లను కోరుకోవడం లేదని, సమస్య ల పరిష్కారం కోసం సహకరించాల ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మం జూరైన పాలమూరు, రంగారెడ్డి, క ల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆం ధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావ రణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్య లు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభు త్వం నుంచి రావలసిన నిధులు, అ నుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం ప డుతోందని చెప్పారు.

    రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజ లు, రైతుల ప్రయోజనాల కోసం ఆ లోచన చేస్తున్నామని, పరస్పర స హకారం అవసరమని అన్నారు. పో ర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మ చిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగా మని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చే యాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు.అలాగే, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుం టు న్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని అన్నారు.

    తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రా ష్ట్రాన్ని క్యూర్(#CURE), ప్యూర్ (#PURE), రేర్(#RARE) మూడు భాగాలుగా అభివృద్ధి లక్ష్యాలను ని ర్దేశిస్తూ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగా ణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెం ట్ విడుదల చేశామని వివరించా రు. తెలంగాణ ప్రపంచంలో జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయా ర్క్ లతో పోటీ పడాలని సంకల్పిం చామని, అందులో భాగంగానే యు వ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.ప్రపంచ నగరాలతో పోటీ పడే విధం గా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ వాటిల్లో పోటీ పడగలుగుతున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవ కాశాలు కల్పించాలంటే ప్రైవేటు రం గంలో పెట్టుబడులను ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉంది.

    రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి పారిశ్రామిక, విద్యు త్, పర్యాటక, దేవాదాయ, వైద్య రంగాల్లో ప్రభు త్వం పాలసీలు తీసు కొచ్చిందని, విద్యా రంగంలోనూ సరికొత్త పాల సీని ప్రకటించబోతున్నాం. పెట్టుబ డులను ఆకర్షించడానికి పారదర్శ కమైన ప్రణాళికలు రూపొందించాం. భారత్ ఫ్యూచర్ సిటీ వల్ల ఇక్కడి భూముల ధరలు పెరుగుతాయి. అభివృద్ధికి అందరూ సహకరించా లి. అందరి సహకారం ఉంటేనే రా ష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది.

    1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్ల హైదరాబాద్ ప్ర పంచ నగరాలతో పోటీ పడుతోం దని ముఖ్యమంత్రి చెప్పారు.

    జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో దక్షి ణ భార త దేశంలోనే ఐవీ ఫ్లూయి డ్స్ తయా రీకి సంబంధించి సంస్థ ను ఏర్పాటు చేయడం అభినందనీ యమని ప్రశంసించారు. సుజెన్ మె డికేర్ ఐవీ ఫ్లూయిడ్స్ ఉత్పత్తి యూ నిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, శాసన మండలిలో చీఫ్ వి ప్ పట్నం మ హేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.