— భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
Cheruvugattu Brahmotsavams : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: ఈనెల 23 నుండి 30 వరకు నిర్వ హించ నున్న చెరువుగట్టు శ్రీ పార్వతీ జడ ల రామలింగేశ్వర స్వామి బ్ర హ్మో త్సవాల సందర్భంగా భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని భువనగిరి పార్లమెంట్ సభ్యు లు చామల కిరణ్ కుమార్ రెడ్డి అ న్నారు. శుక్రవారం నకిరేకల్ శాస న సభ్యులు వేముల వీరేశం, డైరీ డె వ లప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి .చం ద్ర శేఖర్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివా స్, జిల్లా అధికారులతో కలిసి చెరు వుగట్టు పార్వతి జడల రామలింగే శ్వర స్వామి దేవాలయ ఆవరణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావే శం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్స వాలకు హాజరయ్యే భక్తులను అం చనా వేసి అందుకు తగ్గట్టుగా ఏ ర్పాట్లు చేయాలని అన్నారు. బ్ర హ్మోత్సవాల సందర్భంగా చెరువు గట్టు పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ,కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు అన్నింటిని ఎప్పటిక ప్పుడు పరిష్కరించేందుకు యం త్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అ న్నారు. చేరువుగట్టు దేవాలయాని కి ఎంతో ప్రాముఖ్యత ఉందని, హైద రాబాద్ తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని, అంతేగాక భక్తులు నిద్ర చేయడం ఇక్కడ అల వాటుగా ఉందని, అందువల్ల భక్తు లకు అవసరమైన ఏర్పాట్లలో ఎ లాంటి లోటుపాట్లు లేకుండా చూ డాలన్నారు. బ్రహ్మోత్సవాలపై విస్తృ త ప్రచారం కల్పించాలని, హయత్ నగర్ నుండి చెరువుగట్టు వరకు ప్ర త్యేక బస్సులు నిర్వహించాలని ఆ ర్టీసీ అధికారులతో కోరారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించాలని, మద్యం, మత్తు పదార్థాల వంటివి లేకుండా చూడా లని ,పార్కింగ్ లో భక్తులు ఇబ్బందు లు పడకుండా చర్యలు తీసుకోవా లని అన్నారు.చెరువుగట్టు శ్రీ పా ర్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి అవసర మైతే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం తో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ దేవాలయా నికి స్వయం సమృద్ధి ఉన్నందున భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెం దే అవకాశం ఉందన్నారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సమావేశానికి అధ్యక్షత వ హించి మాట్లాడుతూ ఉమ్మడి న ల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట త ర్వాత అతిపెద్ద దేవాలయం చెరు వుగట్టు పార్వతి జడల రామలింగే శ్వర స్వామి దేవాలయం అని అ న్నారు. ప్రతి అమావాస్యకు 50 వేల వరకు భక్తులు ఇక్కడ నిద్ర చేస్తా ర ని, ఏళ్ల తరబడి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జ రుగుతున్నదని, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరు కలిసి ఈ సం వత్సరపు బ్రహ్మోత్సవాలను విజ యవంతం చేయాలని కోరారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వా మి దేవాలయానికి వంద కోట్ల రూ పాయలతో మాస్టర్ ప్లాన్ రూపొం దించడం జరిగిందని, వచ్చే నెలలో ఈ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం దేవాలయం ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తు న్నట్లు ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లా డుతూ ఈనెల 23 నుండి జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్య లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నం దున అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి సమస్యలు రాకుండా బ్ర హ్మోత్సవాలను విజయవంతం చే యాలన్నారు. సిసిటీవీలను కమాం డ్ కంట్రోల్ రూమ్ కు టై అప్ చేయా లని, గుట్టపైన, పార్కింగ్ వద్ద హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేయాలని, కింది నుండి దేవాలయానికి వెళ్లే రహదా రి ఇబ్బందులు లేకుండా గుంతలు పూడ్చాలని అన్నారు.
సమావేశం అనంతరం ఆయన అధి కారులతో మాట్లాడుతూ ఏడు రోజు లపాటు నిర్వహించే బ్రహ్మోత్సవా లు పూర్తిగా విజయవంతం చేసేం దుకు రూట్ ప్లాన్ తయారు చేయా లని, భక్తులు పార్కింగ్ లో దిగినప్ప టి నుండి దర్శనం చేసుకుని తిరిగి పార్కింగ్ కు వచ్చేవరకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ప్రణాళికలు రూపొందించా లని, బ్రహ్మోత్సవాల సందర్భంగా 26 ఉదయం నిర్వహించే కల్యాణో త్సవం ఆరోజు ప్రముఖులకు ఎ లాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, తగినంత బ్యారికే డింగ్ ఏర్పాటు చేయాలని, కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తుల కు షామీనాలు, లైవ్ స్క్రీన్ ఏర్పా టు చేయాలని ,వాలంటీర్స్ ఏర్పా టు చేయాలని అన్నారు.
ఈ నెల 21లోగా పనులన్నిటిని పూర్తి చేయాలని ఆయన ఆదేశిం చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ ,ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, డిఎ స్పి శివరామిరెడ్డి, దేవాల య ఈవో మోహన్, నార్కెట్ పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ కృష్ణ, ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, జిల్లా అధికా రులు, ప్రజాప్రతినిధులు హాజర య్యారు. ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులు బ్రహ్మోత్స వా లలో వారి శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు వివరించారు.


