Monday, September 28, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, వాహనదారులకు శుభ వార్త, ఇకపై డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, వాహనదారులకు శుభ వార్త, ఇకపై డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌

    📰 Generate e-Paper Clip

    –వ్యక్తిగత వాహనాలకు ఆర్టీఏ ఆఫీ సులకువెళ్లాల్సినఅవసరముoడదు

    –15 రోజుల్లో అందుబాటులోకి రా నున్న సాఫ్ట్‌వేర్‌

    –ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో కొత్తగా వ్యక్తిగత వా హనాలను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాల యాలకు వెళ్లాల్సిన అవసరం లే కుండా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. గత ఏడాది డిసెంబరు 19న రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డీలర్ల వద్దనే వ్యక్తి గ త వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయా ల ని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదే శంతో యంత్రాంగం ఆ మేరకు తద ననుగుణంగా సంస్కరణలను చేప ట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ర వాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి తా జాగా ఉత్తర్వులు జారీ చేశారు.

    వాహనాల అమ్మకం డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా అ వ సరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని అందులో ఆదేశా లు ఇచ్చారు. గతంలో వాహన కొ నుగోలుదారులు తాత్కాలిక రిజి స్ట్రేషన్‌ను(టీఆర్‌) డీలర్‌ వద్ద చే సు కునే వారు కాని శాశ్వత రిజిస్ట్రేష న్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లా ల్సి వచ్చేది.

    ఈ నేపద్యంలో కార్యాలయాల్లో ముడుపులు ఇస్తేనే పనులు జరు గుతాయన్న విమర్శలు లేకపోలేదు. వీటన్నింటి దృష్టితో సమస్య పరి ష్కారంగా డీలర్‌ వద్దనే వ్యక్తిగత వా హనాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వి ధంగా అధికారులు నిర్ణయం తీసు కున్నారు.

    పలు రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవా ణా, రహదారి మంత్రిత్వశాఖ ఆధ్వ ర్యంలో వాహ న్, సారథి పోర్టల్‌ల ద్వారా షోరూం లోని డీలర్‌ వద్దనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రా ష్ట్రంలో ఈ పోర్టల్‌ లు పూర్తి స్థాయి లో అందుబాటులోకి రావడానికి ఆ రు నెలల సమయం పట్టే అవకాశా లు ఉండడంతో వెంటనే ఈ నిబం ధనలను అమలుచేయడానికి ప్ర త్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నా రు.

    *కొత్త వాహనదారులు పాటించా ల్సిన విధానం* …అధీకృత డీలర్‌ వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం దర ఖాస్తు చేయాలంటే పలు పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అం దులో భాగంగా వాహనం ఇన్వా యిస్‌, ఫారం-21(విక్రయ ధ్రువీకర ణ, ఫారం-22 (రోడ్డు అనుకూలత ధ్రువీకరణ), బీమా ( ఇన్సూరెన్స్) పత్రం, కొనుగోలుదారుల చిరునా మా ధ్రువీకరణ( అడ్రస్ ప్రూఫ్) లతో పాటు మరో వాహనం లేదని డిక్లరే షన్‌ పత్రం అప్ లోడ్ చేయాల్సి ఉం టుoది. కొనుగోలుదారుల ఫొటో సంతకం స్కాన్‌ కాపీ, వాహనం ఇం జిన్, ఛాసిస్‌ నంబర్ల ఫొటోలు, అవ సరం మేరకు రవాణా శాఖ నిర్దే శిం చే ఇతరేతర పత్రాలు సమర్పించా ల్సి ఉంటుంది.

    ఇక డీలర్‌ నుంచి వచ్చిన వాహన కొనుగోలుదారుల దరఖాస్తులను రి జిస్టరింగ్‌ అథారిటీ/ అదనపు రిజి స్టరింగ్‌ అథారిటీ పరిశీలించి నిబం ధనల మేరకు పత్రాలను ఆమోదిం చడం లేదా తిరస్కరించడం చేస్తుం ది.రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని(ఆర్‌సీ) స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా కొనుగోలుదారులకు పంపిస్తారు. అధీకృత డీలర్ల వద్ద ఉ న్న వాహనాల నిల్వలపై వెహికిల్‌ ఇ న్‌స్పెక్టర్‌/ఆర్టీవో/డీటీసీ/జేటీసీ/ ర వాణా కమిషనర్‌ ఎప్పుడైనా తని ఖీలు చేపట్టవచ్చని నిబంధనలు వెల్లడిస్తున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.