Monday, September 28, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, బీసీసంక్షేమసంఘం ఆ ద్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి,...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, బీసీసంక్షేమసంఘం ఆ ద్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, భారీ ర్యాలీ తీసిన బీసీలు

    📰 Generate e-Paper Clip

    Big Breaking :  ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముట్టడి కార్యక్రమం ని ర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రా జ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రం లో కలెక్టరేట్ ముందు 42 శాతం రి జర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవా లని చట్టబద్రత కల్పియాలని ని నాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు.

    ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షులు దుడుకు ల క్ష్మీనారాయణ, జెసి జాబ్ చైర్మన్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ సభలో చె ప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిన 42 శాతం స్థా నిక సంస్థలు రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం శోచనీయమ న్నారు.

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, ఇతర సం ఘాలు మేధావులు ప్రతిపక్ష నాయ కులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంలో అసెంబ్లీలో ఏక తీర్మా నం చేసి గవర్నర్ కు రాష్ట్రపతికి ప్ర ధానమంత్రి కి పంపించడం జరిగిం దని గుర్తు చేశారు. కొంతమంది బీసీ సంఘాలను తీసుకొని పెద్ద ఎత్తున హడావుడి చేసి ప్రధానమంత్రిని హై దరాబాదుకు రప్పిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి 56 సార్లు ఢిల్లీకి పో యి ఒక్కసారి కూడా ప్రధానితో చ ర్చించకపోవడం కేంద్రం రాష్ట్రాలకు 243D 6 ఆర్టికల్ ప్రకారం స్వయ ప్ర తిపత్తి 42 శాతం స్థానిక సంస్థలు రి జర్వేషన్లు ఇవ్వడానికి పూర్తి అధి కారం ఉందన్నారు.

    విద్య.ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూ ల్లో చేరిస్తే తప్ప దానికి చట్టబద్రత రాదని, 3500 కోట్ల రూపాయలు సాకు చూసి అభివృద్ధి కుంటుబో తుందని చెప్పి స్థానిక సంస్థ రిజర్వే షన్ల కోసం తర్వాత జెడ్పిటిసి ఎం పిటిసి లకు ఎన్నికలకు నిర్వహిస్తా మని చెప్పడం ఇది చాలా దారుణ మన్నారు.

    ఇప్పటికైనా స్థానిక సంస్థల రిజర్వే షన్లు చట్టబద్రత కల్పించేంతవరకు ఎన్నికలకు పోకూడదని నల్గొండ బీ సీ సంక్షేమ సంఘం పక్షాన డిమాం డ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరి గిందని చెప్పారు. అనంతరం ఏవో కి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింద న్నారు.

    ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం ల క్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి జే రిపోతుల రమేష్ గౌడ్, విద్యార్థి సం ఘం జిల్లా అధ్యక్షులు అయిత గోనీ జనార్దన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ క ట్ట హరిబాబు, బక్కతట్ల వెంకన్న యాదవ్, కట్టబోలు ధీపేందర్, మ చ్చ నాగరాజు యాదవ్, తిరుపత య్య గౌడ్, పుట్ట వెంకన్న గౌడ్, క ర్నాటి యాదగిరి, గజ్జి అజయ్ గడ్డం శంకరయ్య, భరద్వాజ్ మల్లబోయి న సతీష్ యాదవ్, చిలుకరాజు స తీష్, చిలక రాజు చెన్నయ్య, వడ్డే పోయిన రామకృష్ణ, అంబటి శివ, అనంత నాగరాజు రమణ ముదిరా జ్, వి కృష్ణ భాస్కర్, సతీష్ యాద వ్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.