Wednesday, September 30, 2026
More
    HomePoliticsDeputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క ప్రకటన,...

    Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క ప్రకటన, 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో విద్య, స్కిల్స్, ఉ పాధి రంగాలకు పెద్దపీట

    📰 Generate e-Paper Clip

    Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రైజింగ్ 2047 డాక్యు మెంట్లో వి ద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని, తెలంగాణ గ్లోబల్ గ్రో త్ ఇంజన్ కావాలని ఆ ఇంజన్ ను ముందుకు నడిపేది జేఎన్టీ యూనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క మల్లు అన్నారు. శుక్రవారం జేఎ న్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. ఈ సంద ర్భంగా సావనీర్ ను ఆవిష్కరించి, పూర్వ విద్యార్థులను సన్మానించిన అనంతరం ప్రసంగించారు.

    గత అరవై ఏళ్లలో లక్షలాది ఇంజనీ ర్లు, ఆవిష్కర్తలు, పరిపాలకులు, స్వప్నదృష్టులను తీర్చిదిద్దిన ఈ ప విత్ర స్థలంలో నిలబడి మాట్లాడటం ఒక అపూర్వమైన ఆనందం అని డి ప్యూటీ సీఎం అన్నారు. జేఎన్టీయూ సంస్థకు భారత తొలి ప్రధాని జవహ ర్‌లాల్ నెహ్రూ పేరు ఉండడం ఎం తో సార్థకమైందనీ అభిప్రాయ వ్య క్తం చేశారు. ఎందుకంటే, భారత భ విష్యత్తు విజ్ఞానంపై, ఆధునిక సంస్థ లపై, యువత ధైర్యంపై నిర్మితమ వుతుందని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విశ్వసించారని తెలిపారు.

    సాంకేతిక విశ్వవిద్యాలయాలు దేశ పురోగతికి ఇంజిన్‌గా మారాలి అని ఆయన కలగన్నారు, 1965లో నా గార్జునసాగర్ ఇంజనీరింగ్ కాలేజ్‌గా ప్రారంభమై, 1972లో దేశ మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఎది గి, నేడు 100 ఎకరాల కూకట్‌పల్లి క్యాంపస్‌గా jntu ప్రపంచ ఖ్యాతిని పొందింది అన్నారు. JNTU ఆ క ల ను మాత్రమే కాదు, దానిని అధిగ మించి అనేక విజయాలను సాధిం చిందన్నారు. గన్‌ఫౌండ్రీ, మసాబ్ ట్యాంక్ నుండి AI, క్వాంటమ్ టెక్నా లజీ, గ్లోబల్ ఇన్నోవేషన్ వరకు JN TU ప్రస్థానం దేశ చరిత్రలో లిఖించ దగిన గొప్ప సాహసోపేతమైన అ ధ్యాయమన్నారు.

    ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం jnt u కి సంబంధించిన ప్రస్థానాన్ని ఒక సామెత ద్వారా వివరించారు. “సిలి కాన్ వాలీలో ఒక రాయి విసిరితే అ ది IITian లేదా JNTU అలుమినీ మీద పడుతుంది.”సర్కార్ ప్రతినిధి గా నేను రాళ్లు విసరమని చెప్పలే ను కానీ ఆ గణాంకం మాత్రం వాస్త వమని jntu విద్యార్థుల ప్రస్థానం గురించి చతురొక్తులతో సబిక్కుల ను నవ్వించారు.ISRO నుండి Goo gle వరకు, DRDO నుండి Tesla వరకు, పబ్లిక్ సెక్టార్ నాయకత్వం నుండి డీప్-టెక్ స్టార్టప్‌ల వరకు J NTU భారతదేశాన్ని ముందుకు న డిపించిన తరాలను సృష్టించిందనీ డిప్యూటీ సీఎం వివరించారు. జేఎ న్టీయూ పూర్వ విద్యార్థుల జాబితా ను ఒకసారి పరిశీలిస్తే అలుమినీ జాబితా ఒక హాల్-ఆఫ్-ఫేమ్ మా దిరిగా ఉంది అన్నారు.

    డా. జి. సతీష్ రెడ్డి, డా. టెస్సీ థా మస్,డా. అవినాష్ చంద్రా, మహేం దర్ రెడ్డి నిత్యం నిశ్శబ్దంగా దేశ ని ర్మాణంలో భాగస్వాములవుతున్న వేలాది ఇంజనీర్లు ఇక్కడి వారే అని వివరించారు. Jntu ఒక విశ్వవి ద్యాలయం మాత్రమే కాదు, ఒక జాతీయ ఆస్తి డిప్యూటీ సీఎం అభి వర్ణించారు. JNTU ఎల్లప్పుడూ తె లంగాణకు బలమైన భాగస్వామి

    నిజాయితీతో ప్రవేశ పరీక్షలు, అను బంధ కాలేజీలకు నైతిక మార్గనిర్దే శం, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అపూర్వ సహకారం అందిస్తుందని తెలిపా రు.

    ప్రస్తుతం 215 కాలేజీలు, 3.5 లక్షల విద్యార్థులు JNTU కుటుంబంలో భాగమవడం దాని ప్రభావం, వ్యాప్తి ని తెలియజేస్తుందన్నారు.ప్రతీ వ ర్షంలో మేము మరమ్మతు చేసే గుం తల కంటే ఎక్కువ ఇంజనీర్లను JN TU తయారు చేసింది, ఈ రెండూ తెలంగాణ అభివృద్ధికి అత్యవసరం అని ప్రభుత్వ ప్రతినిధిగా తాను భా విస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో

    విద్యా రంగ పునర్నిర్మాణం జరు గుతోందనీ తెలిపారు. తెలంగాణ లోని ప్రజా ప్రభుత్వం రిక్రూట్మెంట్ పరీక్షలో నమ్మకాన్ని, పారదర్శక తను, గౌరవాన్ని పునరుద్ధరిం చా మన్నారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో టెక్నికల్ ఎడ్యు కేషన్‌ ను ఆధునికీకరిస్తున్నాం, ITIs ను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం, ఇండస్ట్రీ 4.0 యుగానికి యువతను సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు.

    65 ఐటిఐ లను ఇప్పటికే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం రా ష్ట్రంలో మొత్తం 104 ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. జేఎ న్టీయూ సరి సమానంగా భారత్ స్కి ల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.విద్య ఖర్చు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టుబడి అన్నారు.JNTU యొక్క న్యాయమైన సమస్యలైన భూమి లీజ్ సమస్య పరిష్కారం,లీజ్ రెం ట్, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు,

    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునరుద్ధరణకు రూ ల. 800 కోట్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్ర భుత్వం సానుకూలంగా పరిశీలి స్తుందన్నారు.ఉద్యోగం కోరేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వా రిగా ఎదగండి,ఇంజనీరింగ్‌లో స మయాన్ని సెమిస్టర్లలో కొలుస్తారు… ఒత్తిడిని బ్యాక్‌లాగ్‌లలో కొలుస్తారు అని నాకు తెలుసు, కానీ మార్కుల కంటే ముఖ్యమైనది — ఆసక్తి, ధై ర్యం, ఆవిష్కరణ కానీ ప్రస్తుత వి ద్యార్థులకు డిప్యూటీ సీఎం పలు సూ చనలు చేశారు.

    ప్లేస్‌మెంట్లు ముఖ్యం, ప్యాకేజీలు ముఖ్యం.కానీ భవిష్యత్తు అవకా శా లు సృష్టించే వారికి చెందుతుంది, వేచి చూసేవారికి కాదన్నారు. 20 27 నాటికి భారతదేశంలో 1000+ యూనికోర్న్ స్టార్టప్‌లు ఎదగను న్నాయి.తెలంగాణ రాష్ట్రం ఈ వి ప్లవానికి ప్రధాన కేంద్రంగా మార డా నికి సిద్ధమైందని తెలిపారు. Jntu లో ఇప్పటికే రోల్ మోడల్స్ ఉన్నా రు,జాతీయ గుర్తింపు పొందిన R. నితిన్ వంటి స్టార్టప్ నాయకులు.

    ఇలాంటి కథలు మరిన్ని jntu నుం చి రావాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.EDC, టెక్ బిజినెస్ ఇన్‌క్యూబేటర్, J-Hub అన్నిటిని ఉపయోగించండి.ప్రభుత్వం మీతో పాటు నడుస్తుంది అని భరోసా క ల్పించారు.మీ స్టడీ టైమ్ కంటే స్క్రీ న్ టైమ్ ఎక్కువైతే, మీ డిగ్రీ ప్రమా దంలో ఉంటుంది , మీ బ్యాటరీ మా త్రం ఖచ్చితంగా తగ్గుతుంది,

    చెడువ్యసనాలకు దూరంగా ఉం డండి. పుస్తకాలు, ల్యాబ్‌లు, మెం టర్‌లు, అవకాశాలకు దగ్గరగా ఉం డండని ప్రస్తుత విద్యార్థులకు ప్రేమ పూర్వక సలహా ఇస్తున్నట్టు డిప్యూ టీ సీఎం తెలిపారు.

    JNTU విద్యార్థులు ఇండియాను నడిపించాలి, ఇండియా పరుగులు తీస్తున్నప్పుడు మొబైల్ స్క్రోలిం గ్‌లో ఉండకండి అన్నారు.భవిష్యత్ అవసరాలు ప్రపంచం వేగంగా మా రుతోంది. పరిశ్రమకు నైపుణ్యవం తులైన, ఇన్నోవేటివ్, ఇండస్ట్రీ-రెడీ ఇంజనీర్లు కావాలి.కరికులం రి ఫా ర్మ్, ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రీ భాగ స్వామ్యం, మల్టీ-డిసిప్లినరీ అభ్యా సం మరింత బలపడాలి అన్నారు.

    కొత్త టెక్నాలజీలతో పాటు కోర్ బ్రాం చ్‌లను బలపరచాలి అని డిప్యూటీ సీఎం సూచించారు.ఈ రాష్ట్రాన్ని ని ర్మించడంలో, ఈ దేశాన్ని సేవించ డంలో ముందుండే ఒక గొప్ప సం స్థ ను నిర్మించినందుకు అధ్యాపక వ ర్గానికి, పూర్వ విద్యార్థులకు ధన్య వాదాలు తెలియజేశారు. సాహ సం గా కలలు కనండి, భయంలేకుండా ఆవిష్కరించండి. వినయంతో స మాజానికి సేవ చేయండని డి ప్యూ టీ సీఎం విద్యార్థులకు సూచించా రు.మొదటి 60 సంవత్సరాలకంటే వచ్చే 60 సంవత్సరాలు మరింత మహోన్నతంగా jntu ఉండాలనీ మ నస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు డి ప్యూటీ సీఎం తెలిపారు.

    ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, జేఎ న్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బా లకృష్ణారెడ్డి, యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్, రిజిస్టర్ కే వెంకటే శ్వరరావు, ఉన్నతాధికారులు కృష్ణ ఆదిత్య, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.