Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి నెల్లికల్...

    District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి నెల్లికల్ చెంచువాని తండా సందర్శన, చెంచుల సమస్య ల పరిష్కారం కోసం 

    📰 Generate e-Paper Clip

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, తిరుమలగిరి సాగర్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతి సో మవారం నిర్వహించే ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ గా ప్రజాల వ ద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నా రు. ఇంతలో నల్గొండ జిల్లా తిరుమ లగిరి సాగర్ మండలం ,నెల్లికల్ చెం చు వాని తండా కు చెందిన ఆదెమ్మ

    ఒక పిటీషన్ ను జిల్లా కలెక్టర్ కు స మర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వి విధ ధ్రువపత్రాలు లేనందున తమ తాండవాసులందరూ ప్రభుత్వ పథ కాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అంద టం లేదని విన్నవించింది.

    ఈ విషయాన్ని సావధానంగా పరిశీ లించిన జిల్లా కలెక్టర్ ఒక చెంచు మహిళ సుదూర ప్రాంతం నుండి న ల్గొండకు వచ్చి సమస్యలను చెప్ప డంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నే రుగా నెల్లికల్ చెంచువాని తండాకే వెళ్లి చెంచు తండావాసుల సమస్య లు పరిష్కరించాలని నిర్ణయించా రు. వెంటనే నాగార్జున సాగర్ శాస నసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో మాట్లాడి చెంచులు సమస్య ల పరిష్కారానికి నెల్లికల్ చెంచు వా ని తాండకి వెల్దామని,అందుకు స మయం కేటాయించాలని కోరారు.

    అందుకు ఎంఎల్ఏ జయవీర్ రెడ్డి అంగీకరించడంతో శుక్రవారం ఉద యం 8 గంటలకే జిల్లా కలెక్టర్ , జి ల్లా అధికారులతో సహా శాసనస భ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి నెల్లికల్ చెంచుతాండకి చేరు కున్నారు. ఉదయమే తమ తండా కు వచ్చిన జిల్లా కలెక్టర్ ,ఎం ఎల్ ఏ లను చూసి చెంచు ప్రజలు సంతో షంతో స్వాగతం పాలికారు. చెంచు వాని తాండ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు, వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సావధానంగా విన్నా రు. అంతేకాక సమస్యల పరిష్కా రానికి సైతం మార్గాలు సూచించా రు.

    తమ తండాలో కొంతమందికి ఆ ధార్ కార్డులు లేవని ,ఆధార్ కార్డు లు ఉన్నవారికి అప్డేషన్ లేనందున తాము ఎలాంటి పథకాలకి అర్హులం కాకుండా పోయామని, తాగునీటి బోరు మరమ్మతు చేయించాలని, పి ల్లలు ఎక్కువగా ఉన్న వారికి ప్రభు త్వం ఇస్తున్న 6 కేజీల బియ్యం స రిపోవడం లేదని ,అంత్యోదయ అ న్న యోజన కింద 32 కిలోల బి య్యం ఇవ్వాలని, కొంతమందికి రే షన్ కార్డులు లేవని, పెండింగ్ లో ఉ న్నాయని, కొందరికి ఉపాధి హామీ జాబ్ కార్డులు లేవని, తమ చెంచు ల నుండే ఆశ, అంగన్వాడి, ఏఎన్ ఎం లాంటి వారిని నియమించా ల ని ఎలాంటి నెట్ వర్క్ లేనందున అ త్యవసర సమయాలలో సమాచా రం చేరవేయడం కష్టంగా ఉందని జి ల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో వారి శాఖల ద్వారా అమలు చేసే పథకాల గురిం చి ముందుగా చెంచులకు వివరించే ఏర్పాటు చేశారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జి ల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా క్టర్ రమేష్, పంచాయతీరాజ్, అట వీ శాఖల ద్వారా చెంచుల కోసం అ మలు చేసే పథకాలను కులంకషం గా చెంచులకు వివరించారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ సరైన ధ్రువపత్రాలు లేకుంటే ముఖ్యంగా ఆధార్, అప్డేషన్, కుల ము, పుట్టిన తేదీ ధ్రువపత్రాల వం టివి లేని కారణంగా నెల్లికల్ చెంచు వాని తాండ చెంచులు ప్రభుత్వ ప థకాలను అందుకోలేకపోతున్నా ర ని తాండకు చెందిన ఆదెమ్మ ప్రజా వాణిలో తన దృష్టికి తీసుకొచ్చింద ని, సమస్యల పరిష్కారానికి చెంచు లు నల్గొండకు వచ్చి ఇబ్బందులు ఎ దుర్కోకూడదన్న ఉద్దేశంతో జిల్లా అధికారులందరిని తీసుకొని తానే శాసన సభ్యులతో సహాచెంచు తాం డకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

    అన్ని దృవపత్రాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, అందులో ఆధార్ ముఖ్యమని, ప్రతి పథకానికి ఆధార్ అనుసంధానం అవసరం ఉంటుం దని, ముఖ్యంగా పెన్షన్లు పొందేవా రు మూడు నెలలకు మించి పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదని, అ లాగే భూమి సాగు చేసుకుంటున్న వారు భూమిని వదిలేసి వెళ్లకుండా నిరంతరం సాగు చేసుకుంటూ ఉం డాలని ,అలాగే కొత్తగా అటవీ భూ ముల సాగు చేయొద్దని, ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అమలు చే స్తుందని,చెంచులు ప్రభుత్వం అమ లు చేసే వివిధ పథకాలను సద్విని చేసుకోవాలని,చెంచుతాండలో ఉ న్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని, ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఆ త్మీయ భరోసా పథకాన్ని సద్వి ని యోగం చేసుకోవాలని, పెన్షన్లు లేని వారు పెన్షన్లకు దరఖాస్తు చేసుకో వాలని, ఆడ శిశువుల విక్రయాలు, బాల్య వివాహాల వంటి దూరాచా రాలకు దూరంగా ఉండాలని సూ చించారు.

    ఆరోగ్య సేవలకు ప్రైవేటు ఆసుప త్రికి వెళ్ళవద్దని, ప్రభుత్వాసుపత్రి లోనే వైద్యం చేయించుకోవాలని, రోగం ముదిరాక ప్రభుత్వ ఆసుప త్రులకు రాకుండా ముందే రావాల ని, తిరుమలగిరి సాగర్ లోనే డా క్టర్,గ్రామంలోనే ఆశ, అంగన్ వాడి ఉంటారని వారి సేవలను ఉప యో గించుకోవాలని చెప్పారు. తాండవా సుల కోరినట్లుగా తక్షణమే కమ్యూ నికేషన్ కోసం ఎయిర్టెల్, లేదా బిఎ స్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను ఏర్పా టు చేస్తామని, తండాలో గ్రామపం చాయతీ భవనం, అంగన్వాడి కేం ద్రo ఇతర ప్రభుత్వ సంస్థలకు సం బంధించి భవనాల నిర్మాణానికి చ ర్యలు తీసుకుంటామని, తాండవ వాసులందరికీ శాశ్వత ఆధార్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇదివరకే ఉన్న కార్డులలో తప్పులు ఉంటే సరి చేస్తామని తెలిపారు.

    నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడు తూ నెల్లికల్ చెంచు తండా ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి తో పరిష్కరించేందుకు అధికారులు చెంచు తాండకే రావడం సంతో ష మని, చెంచులకు సంబంధించిన అ న్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాగునీటి బోర్ మోటర్ మ రమ్మతు చేయించాలని, అలాగే ఇ తర సమస్యలన్నింటిని పరిష్క రిం చడంపై దృష్టి సారించాలన్నారు.

    మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ నెల్లికల్ చెంచు తండా ప్రజల స మ స్యలను తీర్చేందుకు ప్రత్యేకించి ఆధార్, మీ-సేవ అప్డేషన్స్ ,ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ ఇవ్వడం వంటి సమస్యల పరిష్కారానికి అ ధికారులందరితో తాండకు రావడం జరిగిందని తెలిపారు.ఈ సంద ర్భం గా తండాలో 72 మంది ఆధార్ అ

    ప్డేషన్ చేయగా ,21 మందికి కొత్త ఆధార్ కార్డులను ఇస్తున్నట్లు కలెక్ట ర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు ఆధార్, మీ సేవ, ఇతర సేవలకు సంబంధించిన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కా ర్యక్రమంలో డివిజన్ స్థాయి అధికా రులు, మండలాధికారులు ,ప్రజా ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.