Monday, September 28, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, మ‌హిళాఉత్ప‌త్తుల...

    CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, మ‌హిళాఉత్ప‌త్తుల మార్కె టింగ్‌కు అమెజాన్‌తో ఒప్పందo 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: తెలంగా ణవ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉ త్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంత‌ ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందు కు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చే స్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాన‌మంత్రి ఇందిరాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌ రించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇంది రాగాంధీ విగ్ర‌హానికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం పూల‌ మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డ ఇందిరా మ‌హి ళా శ‌క్తి చీర‌ల పంపిణీని ప్రారంభిం చారు. అనంత‌రం రాష్ట్ర స‌చివాల‌ యం నుంచి జిల్లాల్లోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల (ఎస్‌ హెచ్‌సీ) స‌భ్యుల‌తో వీడియో కాన్ఫ‌ రెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. తె లంగాణ‌లోని ఆడబిడ్డ‌ల‌కు పుట్టిం టి వాళ్లు, అన్న‌ద‌మ్ములు సారె చీరె పెట్ట‌డం సాంప్ర‌దాయ‌మ‌ని, అలాగే రాష్ట్రంలోని ప్ర‌తి ఆడ‌బిడ్డ‌ను తోబు ట్టువుగా భావించి త‌మ ప్ర‌జా ప్ర‌భు త్వం అర్హులైన ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందిస్తుంద‌ని సీఎం అన్నారు.

    తెలంగాణ‌లోని అర్హులైన కోటి మం ది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చే యాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం తె లిపారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీ రల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌హిళా ఉన్న‌తి తెలంగాణ ప్ర‌గ‌తి పేరిట చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాల‌ ను చేప‌ట్టాలన్నారు. ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కార్య‌క్ర‌మాన్ని పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని… ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించా ల‌ని సీఎం సూచించారు.

    న‌వంబ‌రు 19 నుంచి డిసెంబ‌రు 9 వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏ ళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు చీర‌ల పం పిణీ పూర్తి చేయాల‌ని ఇందుకు 65 ల‌క్ష‌లు అందుబాటులో ఉంచామ‌ని సీఎం తెలిపారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు 35 ల‌క్ష‌లు చీర‌లు పంపిణీ చేయాల‌ని సీఎం ఆదేశించారు. అర్హులైన ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందుతుంద‌ని ఎవ‌ రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ న్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన సామాజ‌క, ఆర్థిక‌, విద్యా, ఉపాధి, రాజ‌కీయ‌ కుల స‌ర్వే (సీపెక్‌) డాటా ను ద‌గ్గ‌ర పెట్టుకొని ప్ర‌తి మ‌హిళ‌కు చీర అందెలా చూడాల‌ని.. చీర అం దించే స‌మ‌యంలో ఆధార్‌ను తీసు కోవాల‌ని, ముఖ గుర్తింపు చేప‌ట్టాల‌ ని సీఎం క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

    మ‌హిళ‌ల ఉన్న‌తే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌ భుత్వం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డు తోంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రె డ్డి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం వ‌డ్డీలే ని రుణాల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌ హించింద‌ని, తాము వ‌డ్డీలేని రుణా లు ఇవ్వ‌డంతో పాటు అందుకు సం బంధించిన నిధులు విడుద‌ల చేసి న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించ‌డ‌మే కాకుండా ఆర్టీసీ బ‌స్సుల‌కు మ‌హిళ‌ ల‌ను య‌జమానుల‌ను చేశామ‌ని సీఎం తెలిపారు.

    యూనిఫాంలు కుట్టే బాధ్య‌త‌ను అ ప్ప‌జెప్ప‌డంతోమ‌హిళా సంఘాల‌కు రూ.30 కోట్ల ఆదాయం స‌మ‌కూరిం ద‌ని, అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీ ల ద్వారా పాఠ‌శాలల్లో రూ.534 కో ట్ల ప‌నులు చేప‌ట్టామ‌ని,ధాన్యం కొ నుగోళ్లు మ‌హిళా సంఘాల‌కే అప్ప‌ జెప్పామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలి పారు. శిల్పారామం ప‌క్క‌న రూ.వం ద‌ల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇం దిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామ‌ని సీఎం అన్నారు. మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న ఉత్ప‌ త్తుల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్ క‌ ల్పించాల‌నే ల‌క్ష్యంతో అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు.

    ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ మ‌హిళ‌ల గౌర‌వం పెంచాల‌నే ఉద్దేశంతోనే ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం చీర‌ల పంపిణీ కా ర్య‌క్ర‌మం చేప‌డుతోంద‌న్నారు. రేష‌ న్ కార్డు ఉన్న మ‌హిళ‌లంద‌రికీ చీర‌ లు అందిస్తున్నామ‌ని ఆయ‌న తెలి పారు. మంత్రి సీత‌క్క మాట్లాడుతూ మ‌హిళా సంఘాల ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ తో బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సంఘాల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని తె లిపారు. 98 శాతం రుణ చెల్లింపు తో సంఘాలు త‌మ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను చాటుతున్నాయ‌ని కొనియాడారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల పంపి ణీపైనా కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తు న్నార‌ని, వాటిని తిప్పికొట్టాల‌ని సూ చించారు. ఆకాశ‌మే హ‌ద్దుగా మ‌హి ళ‌లు ఎద‌గాల‌నే ఉద్దేశంతో ఆకాశం రంగును చీర‌ల‌కు ఎంచుకున్నామ‌ ని తెలిపారు.

    ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొ న్నం ప్ర‌భాక‌ర్‌, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, క్రీడ‌ లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మం త్రి వాకిటి శ్రీ‌హ‌రి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రా ష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రా మ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి ప్రిన్సి ప‌ల్‌ కార్య‌ద‌ర్శి శేషాద్రి, సీఎం కార్య‌ ద‌ర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో ది వ్య దేవ‌రాజ‌న్‌, చేనేత‌, జౌళి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌ య్య‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

    *మీ పెట్రోల్ బంక్ ఎలా న‌డు స్తోంది..* మీ సంఘం ఆధ్వర్యం లోని పెట్రోల్ బంక్ ఎలా న‌డుస్తోం ద‌ని నారాయ‌ణ‌పేట జిల్లా మ‌హిళా స‌మాఖ్య అధ్య‌క్షురాలు అధ్య‌క్షురా లు అరుంధ‌తిని ముఖ్య‌మంత్రి రే వంత్ రెడ్డి అడిగారు. బాగా న‌డు స్తోంద‌ని, నెల‌కు రూ.4 ల‌క్ష‌ల రాబ‌ డి వ‌స్తోంద‌ని ఆమె సీఎంకు తెలి య‌జేశారు. ఇత‌ర జిల్లాల నుంచి సంఘాల‌ను అక్క‌డ‌కు తీసుకెళ్లి వారి ప‌ని తీరు, రాబ‌డిని ప్ర‌త్య‌ క్షంగా చూపాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు.

    *డిజైన్లు చాలా బాగున్నాయి…*

    త‌మ‌కు ఇస్తున్న చీర‌ల డిజైన్లు ఎంతో బాగున్నాయ‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు భాగ్య ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలి పారు. 9 మీట‌ర్లు, 6 మీట‌ర్ల చీర‌లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఉన్నాయ‌ని…. త‌మ‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు.

    *మాకు యూనిఫాం ఇచ్చిన‌ట్లు ఉంది….* ఇందిరామ‌హిళా శ‌క్తి చీర‌లు ఇవ్వ‌డం ద్వారా త‌మ‌కు యూనిఫాం వ‌చ్చింద‌నే సంతోషం ఉంద‌ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురా లు శ్రీ‌దేవి తెలిపారు. ఈ చీర‌లు ధ‌రించ‌డం ద్వారా త‌మ సంఘాల మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉం టుంద‌ని ఆమె అన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.