Monday, September 28, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, సారె పెట్టి గౌరవించాలనే...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, సారె పెట్టి గౌరవించాలనే కోటి మం ది మహిళలకు కోటిచీరల పంపిణీ

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం త రఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆ లోచనతో కోటి మంది మహి ళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేప ట్టామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటి కి రా ష్ట్రంలో కోటి మంది మహిళల ను కోటీశ్వరులను చేయాలన్న సం కల్పంతో ప్రభుత్వం ముందుకు వె ళుతోందన్నారు.

    మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి హైదరా బాద్ నెక్లెస్ రోడ్డు కూడలి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, ఇతర మంత్రులతో కలిసి ఆ మహనీయురాలి విగ్రహానికి పు ష్పాంజలి ఘటించారు. అనంతరం పలువురు మహిళా సమాఖ్య ప్రతి నిధులకు చీరలను అందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పం పిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ ఈరోజు నుంచి తెలంగా ణ తల్లి అవతరణ దినోత్సవం 9 వ తేదీ డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యా ప్తంగా మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతారని చెప్పా రు. మార్చి 1 నుంచి 8 తేదీ అంత ర్జాతీయ మహిళా దినోత్సవం లోపు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతా ల్లో పంపిణీ చేస్తామన్నారు.

    ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వ డ్డీ రుణాలు, పెట్రోల్‌బంక్‌లు అప్ప గించడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయా ణ సౌకర్యమే కాకుండా బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డ లను చేశాం. సోలార్ పవర్ ప్లాంట్లు అందించడానికి ప్రత్యేక కార్యాచర ణలో ముందుకు వెళుతున్నాం.

    స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రధా న మంత్రిగా దేశంలో అనేక విప్లవాత్మ కమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణ యాలు తీసుకున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వ ర్గా ల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టును ధారపోశారు.

    చీరల విషయంలో ఎవరూ బాధ ప డాల్సిన అవసరం లేదు. ఇది మన ఆత్మగౌరవం. ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుంది. ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న ఆలోచనతో చేపడుతు న్న ఈ కార్యక్రమాన్ని నిండు మన సుతో ఆశీర్వదించాలని ముఖ్య మంత్రి అన్నారు.

    ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మం త్రితో పాటు మంత్రులు ధనసరి అ నసూయ సీతక్క, దామోదర రాజ నర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ గారు, పొన్నం ప్రభా కర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకి టి శ్రీహరి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.